ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ముత్యాలతో రూపొందించిన ఒక అద్వితీయ కళాకృతిని ఈ రోజు ప్రదానం చేశారు. ఇందులో భారతదేశం చిత్రపటంతో పాటు ప్రధాన మంత్రి బొమ్మ కూడా ఉంది.
5 లక్షలకు పైగా ముత్యాలను ఉపయోగించి ఈ కళాకృతిని తీర్చిదిద్దినట్లు ఈ బొమ్మను తయారు చేసిన ఖుశ్ బూ ఆకాశ్ దావ్‌డా వివరించారు. అంతేకాకుండా 10 కిలో మీటర్ల పొడవైన దారాన్ని కూడా వాడారు. 7 అడుగులు పొడుగు, 7 అడుగులు వెడల్పుతో ఉన్న ఈ కళాకృతిని తయారు చేయడానికి 850 గంటలు పట్టింది.
రాజ్ కోట్ పార్లమెంటు సభ్యుడు శ్రీ మోహన్ భాయ్ కున్ దరియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


