పరిపాలకుడు

Published By : Admin | May 15, 2014 | 16:18 IST


భారతీయ జనతా పార్టీ కి చెందిన సంస్ధాగతమైన తత్వాన్ని బోధపరచుకున్న వ్యక్తి స్థాయి నుండి భారతదేశ అత్యున్నత పరిపాలనాదక్షునిగా మారిన శ్రీ నరేంద్ర మోదీ పరిణామం ఆయన ధైర్యాన్నీ, పట్టుదలను మనకు తెలియజేస్తుంది.

admin-namo-in1

శ్రీ నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.  ఒక రాజకీయ కార్యకర్త గా , కార్యనిర్వాహకుని గా ఉన్న ఆయన ఒక పరిపాలకునిగా ఒక ప్రభుత్వాన్ని నడిపించగల వ్యక్తిగా అతి త్వరగా పరివర్తన చెందారు.  ఈ క్రమంలో ఆ పదవికి అవసరమైన శిక్షణను పొందే అవకాశం ఆయనకు లభించింది.  మొదటి రోజు నుండే వ్యతిరేక రాజకీయ వాతావరణాన్ని ఎదుర్కోవడంతో పాటు భారతీయ జనతా పార్టీలో  కూడా  ప్రతికూల పరిస్థితులలో శ్రీ మోదీ పరిపాలనను కొనసాగించవలసి వచ్చింది.  ఆయన పార్టీ లోని సహచరులు కూడా ఆయనను ఒక పాలనానుభవం లేని బయటి వ్యక్తిగా భావించారు.  అయితే దీనిని ఒక సవాలుగా ఆయన స్వీకరించారు.

admin-namo-in2

మొదటి వంద రోజులు

గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదటి వంద రోజులు శ్రీ మోదీ తన బాధ్యతలకు అలవాటు పడడం ఎలాగా అని ఆలోచిస్తూనే, పరిపాలనను సంస్కరించడానికి అసాధారణ విధానాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. భారతీయ జనతా పార్టీ లోని యథా పూర్వ స్థితిని మార్చడానికి కొత్త ఆలోచనలను ప్రతిపాదించారు.  ఈ వంద రోజుల్లోనే గుజరాత్ లో భూకంపం వల్ల విధ్వంసమైన కఛ్ లో పునరావాస చర్యలను వేగవంతం చేయడానికి వీలుగా కార్యకలాపాలను సులభతరం చేసి పాలనసంబంధమైన కాలయాపనలను తగ్గించడం కోసం శ్రీ నరేంద్ర మోదీ ఉద్యోగ భాగస్వామ్యం (ఉన్నతద్యోగులు) తో కలిసి పనిచేయడాన్ని మనం గమనించవచ్చు.

అనవసర వ్యయాన్ని తగ్గించి, ఒక ఆదర్శాన్ని పాటిస్తూ ఒక మంచి శ్రోతగా, అతి త్వరగా నేర్చురొనేవానిగా ఉండే శ్రీ నరేంద్ర మోదీ తన విధానాలను అర్ధం చేసుకోడానికి వీలుగా మొదటి వంద రోజుల్లోనే ఒక విచారణ కేంద్రాన్ని ప్రారంభించారు.   ఆ వంద రోజుల్లోనే విలువ ఆధారిత విధానంపై ఆయనకున్న నమ్మకం వెల్లడి అయింది.  బాలికల విద్యకు ఆయన ప్రాధాన్యమివ్వడం, అదే విధంగా ఈ విషయమై ఏకాభిప్రాయాన్ని సాధించిన గ్రామాలకు అభివృద్ధి నిధులను సమకూర్చి ప్రోత్సహించడం ఈ విధానానికి నిదర్శనం.  

ఇక చివరగా ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లోనే తన స్వంత రాష్ట్రంలోని ప్రజలను పరిపాలనలో భాగస్వాములను చేసి, వారికి సాధికారితను కల్పించారు.  ఆయన దీపావళి పండుగను కఛ్ లో భూకంపం బాధితులతో కలిసి జరుపుకొని, యుద్ధ ప్రాతిపదికన పునరావాస చర్యలకు నాయకత్వం వహించారు.  అభివృద్ధి ప్రధాన రాజకీయాలపై, సుపరిపాలనపై నిశిత దృష్టి సారించి గుజరాత్ ఏ విధంగా సంక్షోభం నుండి సమూలంగా మార్పు చెందిందీ శ్రీ మోదీ వివరంగా తెలియజేశారు.

admin-namo-in3

ఉజ్జ్వల గుజరాత్ ను అభివృద్ధికీ, సుపరిపాలనకూ ఒక ఉదాహరణగా రూపొందించడానికి శ్రీ నరేంద్ర మోదీ ఎంచుకొన్న మార్గం అతి సులువైందేమీ కాదు.  తమ పార్టీ అంతర్గత సమస్యలతో పాటు ఆ మార్గం సహజమైన, మానవ ప్రేరేపితమైన ఎన్నో కష్టాలు, సవాళ్లతో కూడుకొన్నది.  అయితే ఆయన పటిష్టమైన నాయకత్వ లక్షణాలు, ఆయన ప్రయత్నాలు  - ఆయనను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాయి.  శ్రీ నరేంద్ర మోదీ ముందు కూడా విద్యుత్ సంస్కరణలు జరిగాయి. అయితే, 2002 లో జరిగిన సంఘటనలు ఆయన లాఘవాన్ని పరీక్షించాయి.  

విశ్వాసం కోల్పోవడంతో పాటు గుజరాత్ సామర్ధ్యాన్ని నిలబెట్టుకోవడంలో జీవితాన్ని దురదృష్టకరంగా పోగొట్టుకోవడం ఒక తక్కువ స్థాయి వ్యక్తి తన బాధ్యతలను పరిత్యాగం చేయడడానికీ పదవికి రాజీనామా చేయడానికీ తప్పనిసరి పరిస్థితులను కల్పించింది.  అయితే శ్రీ నరేంద్ర మోదీ ఒక విభిన్నమైన నైతిక విలువలు గల వ్యక్తి.  అందువల్లే సుపరిపాలన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయన చేసే ప్రయత్నాలపై రాజకీయ ప్రత్యర్థుల అపారమైన ఒత్తిడిని భరించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల నుండి తీవ్ర విమర్శలను సైతం ఆయన తట్టుకొన్నారు.

ఇక్కడ ఒక కాంతి ఉంది: జ్యోతి గ్రామ్ యోజన

తీవ్ర రాజకీయ వ్యతిరేకత మధ్య గుజరాత్ లో విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన జ్యోతి గ్రామ్ యోజన ఆయన సుదృఢ నాయకత్వానికో ఉజ్జ్వల ఉదాహరణ.  మారుమూల గిరిజన గ్రామాల నుండి మెగా నగరాల వరకు గుజరాత్ వ్యాప్తంగా ప్రతి రోజూ 24 గంటల విద్యుత్ సరఫరా ఉద్దేశించిన జ్యోతి గ్రామ్ యోజన ఒక విప్లవాత్మక ఆలోచన.  

రైతులు వెంటనే ఈ పథకం పట్ల నిరసనను వ్యక్తం చేశారు. వారు ఎంతటి తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చినప్పటికీ శ్రీ నరేంద్ర మోదీ తన నిర్ణయం పట్ల పట్టుదలతో ఉన్నారు.  దాంతో జ్యోతి గ్రామ్ యోజన రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైంది.  తన విధానం, పటిష్టమైన నాయకత్వంతో కూడిన పరిపాలన సమాజంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్తును మార్చగలదని జ్యోతి గ్రామ్ యోజన ద్వారా శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.  ఈ రోజు వరకు కూడా ఆయన ప్రాథమిక లక్ష్యం “సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్” (అందరితో కలిసి, అందరి అభివృద్ధి).

admin-namo-in4

రాజకీయాల పై ప్రభుత్వం

రాజకీయాల కంటే ప్రభుత్వ పాలనే చాలా ముఖ్యమైనదని శ్రీ నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ విశ్వసిస్తారు.  అభివృద్ధి సవాళ్ల పరిష్కారాల మార్గంలో ప్రవేశించడానికి ఆయన ఎప్పుడూ రాజకీయ విభేదాలకు అవకాశం ఇవ్వరు.  సర్దార్ సరోవర్ ప్రాజెక్టును పూర్తిచేయడానికీ, గుజరాత్ లోకి నర్మదా జలాలు ప్రవేశించడానికీ శ్రీ నరేంద్ర మోదీ అనుసారించిన విధానం ఏకాభిప్రాయ సాధనకు, జ్ఞానానికి మధ్య సమతౌల్యం సాధించడానికి సుపరిపాలన ఏవిధంగా పనికివస్తుందో తెలియజేస్తుంది.  

ఈ ప్రాజెక్టు వేగవంతం చేసేందుకు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లతో శ్రీ మోదీ  ఎంతో సమయస్ఫూర్తి తో చర్చలు జరిపారు.  ఆయన ప్రతిపాదనకు మద్దతుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నుండి లభించిన ఏకాభిప్రాయం ప్రస్తుత రాజకీయాలలో చాలా అరుదుగా గమనించేటటువంటిది.

భారీ ప్రాజెక్టులను నిర్మించడం మాత్రమే ప్రభుత్వం పని కాదని, ప్రాజెక్టు చిట్టచివరి భూములవరకు నీరు సరఫరా అయ్యేటట్లు చూడాలనే విషయాన్ని త్రాగునీరు, సాగు నీటి అవసరాల కోసం నీటి యాజమాన్యాన్ని ఆచరణాత్మకంగా వివరించారు.

admin-namo-in5

ప్రగతికి అత్యంత చేరువలో

ప్రాజెక్టుల నిర్వహణలో శ్రీ నరేంద్ర మోదీ దృష్టి, వాటిని వివరించడంలో ఆయన శ్రద్ధ, గత దశాబ్దకాలంగా చేస్తున్న కృషి - అవే చిట్ట చివరి వ్యక్తి వరకూ ప్రయోజనాలు సరిగ్గా చేరడానికి దోహదపడుతున్నాయి.  

జియో స్పేషియల్ మ్యాపింగ్ మొదలుకొని ఇ-కోర్టులు, పౌరులకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను మేలు మలుపు తిప్పడం కోసం ‘స్వాగత్’, ‘ఒక రోజు పాలన’ వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ సాంకేతిక విజ్ఞానాన్ని వినూత్న రీతులలో ఉపయోగించుకోవడం జరిగింది.

అభివృద్ధి ప్రణాళిక, పరిపాలనలను తాలూకా స్థాయికి, అక్కడి నుండి గ్రామాలకు అతి సమీపంగా తీసుకు వెళ్లే విధంగా చేపట్టిన ఎటివిటి వంటి వికేంద్రీకరణ చర్యల ద్వారా శ్రీ మోదీ పేరు తెచ్చుకున్నారు.  చట్టాలు రూపొందించడం కంటే అవసరమైన పనులు చేయడం మంచిదనే శ్రీ మోదీ ధృఢమైన విశ్వాసానికి ప్రత్యక్ష నిదర్శనం ఏక గవాక్ష వ్యవస్థ ద్వారా పరిశ్రమలు ఎంత ప్రయోజనం పొందాయో చూస్తే చాలు.  శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యావరణ అనుమతి వంటి రంగాలలో పారదర్శకత, సామర్ధ్యం వంటివి తీసుకురావడం జరిగింది.

విజయానికి మూడు స్తంభాలు

వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనే మూడు స్తంభాలపై శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ విజయ సౌధాన్ని నిర్మించారు.  ఆయన పాలనలో గుజరాత్ 10 శాతం వ్యవసాయాభివృద్ధిని నమోదు చేసింది.  కరువు పీడిత రాష్ట్రంగా పేరుపడ్డ గుజరాత్ లో ఇది ఒక చెప్పుకోదగిన విజయం.  కృషి మహోత్సవ్ వంటి కార్యక్రమాల ద్వారా ఆయన రాష్ట్రంలోని రైతుల జీవితాలలో మార్పును తీసుకు వచ్చారు.  " వైబ్రంట్ గుజరాత్ " (ఉత్సాహపూరితమైన గుజరాత్) పేరుతో నిర్వహించిన ద్వైవార్షిక సదస్సు గుజరాత్ కు రికార్డు స్థాయిలో  పెట్టుబడుల రాశిని తెచ్చి పెట్టింది.  తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కల్పన జోరు అందుకొంది.  ఆయన నాయకత్వం కింద చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు  గుజరాత్ స్వర్గధామమైంది.

admin-namo-in6

సంస్థల ప్రాముఖ్యం

పరిపాలకునిగా శ్రీ నరేంద్ర మోదీ సామర్ధ్యం రెండు సార్లు పరీక్షలకు నిలిచింది; ఒక సారి 2006 లో సూరత్ లో బ్రహ్మాండమైన వరదలు సంభవించినప్పుడు, తిరిగి 2008 లో తీవ్రవాదులు గుజరాత్ లోని అనేక నగరాలపై దాడి చేసినప్పుడు.  ఈ రెండు సందర్భాలలోనూ ఉత్తమ సంస్థాగతమైన పద్ధతులను ఆచరించడం ద్వారా శ్రీ మోదీ పరిస్థితులను చక్కదిద్దారు.

కఛ్ లో 2001-2002 లో విపత్తు యాజమాన్యంలో చేపట్టిన సంస్ధాగతమైన విధానం పునర్ నిర్మాణానికి దోహదపడింది.  అలాగే హిందూ మహా సముద్రంలో సునామీ, ఉత్తరాఖండ్ లో విధ్వంసకర వరదల సమయంలోనూ ఈ విధానం ఎంతో సమర్ధంగా ఫలితాలనిచ్చింది. చట్టాన్ని అమలుచేయడంలో సంస్ధాగతమైన విధానం ద్వారా గుజరాత్ పోలీసులు శ్రీ  నరేంద్ర మోదీ నాయకత్వంలో 2008 లో వరుస పేలుళ్ళ కేసును రికార్డు సమయంలో పరిష్కరించారు.  పరిపాలన, నిర్వహణ రంగాల్లో తాను నిర్వహించిన సంస్ధాగతమైన వారసత్వం ద్వారా నిజమైన నాయకుడు నిలిచి ఉంటాడు. ఇదే విధంగా శ్రీ మోదీ ప్రగతిశీల ఆలోచనా సరళి - ఇంధన భద్రతను పెంపొందించడానికి - పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు నుండి - అంతర్గత భద్రతను పెంపొందించడానికి - ఫోరెన్సిక్ మరియు రక్షా విశ్వవిద్యాలయం వరకు వైవిధ్యమైన పలు సంస్థలు నెలకొల్పడానికి దారితీసింది.

శ్రీ మోదీ సంస్ధాగతమైన వారసత్వం, సుపరిపాలన కేవలం వర్తమాన సమస్యల పరిష్కారానికి మాత్రమే కాదనీ - భవిష్యత్తు లో తలెత్తే సమస్యలను, సవాళ్లనూ గుర్తించి వాటి పరిష్కారానికి సిద్ధం కావాలన్న ఆయన స్థిరమైన విశ్వాసానికి ప్రతిబింబంగా, ప్రతీకగా పేర్కొనవచ్చు.

admin-namo-in7

admin-namo-in8

ఏకాభిప్రాయాన్ని నమ్మే వ్యక్తి 

శ్రీ నరేంద్ర మోదీ భారతదేశ తదుపరి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధపడుతున్న సమయంలో పరిపాలనా సరళి అంతా ఏకాభిప్రాయంపై ఉంది.  ప్రభుత్వం జోక్యం తక్కువగా ఉండాలి. పరిపాలన ఎక్కువగా ఉండాలి అనేదే శ్రీ మోదీ తత్త్వం.  ఇదే విషయం ఆయన అనుసరించే పంచామృత విధానం అమలులో స్పష్టమౌతోంది.  అంతే కాదు మంత్రులు, శాఖల మధ్య అవరోధాలు, అంతరాలను ఇది తగ్గిస్తుంది.

శ్రీ మోదీ ప్రకారం ఏకాభిప్రాయ ఆలోచన, పనుల అమలుకు సమీకృత విధానం మధ్య పనులు నిర్వహించడమే భారతదేశం లో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రాథమిక సవాలుగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ మోదీ చేపట్టిన వివిధ చర్యలు సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి నుండి భవిష్యత్ తరాల పట్టణ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి వరకు నిర్వహణలో ఏకాభిప్రాయంగా, పరిపాలనకు ఒక ప్రయత్నంగా మనం భావించవచ్చు.  ఈ విధమైన ఏకాభిప్రాయం రానున్న రోజులలో భారతదేశాన్ని ఉన్నతమైన స్థానానికి చేరుస్తుంది.

admin-namo-in9

admin-namo-in10

భారతదేశపు ఒక ఉత్తమమైన పరిపాలనాదక్షునిగా 2001 నుండి 20013 వరకు శ్రీ నరేంద్ర మోదీ పరిణామం అనేది  ఆయనకు లభించిన అనేక అవార్డులలో ప్రతిఫలించింది. జాతీయ, అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల నుండి  ఆయన ప్రభుత్వం అనేక అవార్డులను స్వీకరించింది.

యోగ్యతాపత్రాలు

“మోదీ ఒక పటిష్టమైన నాయకుడనీ, ఒక సమర్ధుడైన నిర్వాహకుడనీ అందరికీ తెలుసు.  నా శుభాకాంక్షలు, ప్రార్ధనలు ఎల్లప్పుడూ ఆయనతో ఉంటాయి.  ఆయనకు  భవిష్యత్తు లో అన్నీ మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను.  భారతదేశం కోసం ఆయన కలలు, ప్రణాళికలు వాస్తవరూపం దాల్చాలని  ఆశిస్తున్నాను.”  - రజనీకాంత్, సూపర్ స్టార్.

“నరేంద్ర మోదీ ని నేను కలిశాను.  ఆయన ఒక మంచి మనిషిగా నాకు కనబడ్డారు,  గుజరాత్ కు ఆయన మంచి పని చేశారు.” " - గౌరవనీయులు శ్రీ  శ్రీ రవిశంకర్ జీ, ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు.

“శ్రీ నరేంద్ర మోదీ నా సోదరుని వంటి వారు.  ఆయనను ప్రధాన మంత్రిగా చూడాలని మేమంతా కోరుకున్నాము.  దీపావళి శుభ సందర్భంగా మా ఆకాంక్ష నిజం కావాలని కోరుకుంటున్నాను.”- శ్రీమతి లతా మంగేష్కర్, ప్రఖ్యాత గాయకురాలు.

“ముఖ్యమైన కార్యాలయాలలో సమగ్రత తో కూడిన వ్యక్తులు అవసరం ఇప్పుడు దేశానికి ఎంతైనా ఉంది.  ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ నరేంద్ర మోదీ మనకు కావాలి.”- శ్రీ అరుణ్ శౌరి, కేంద్ర మాజీ మంత్రి, విలేకరి, రచయిత.

“ప్రస్తుత పరిస్థితులలో భగవంతుడు పంపిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోదీ.  ఆయన మన తదుపరి ప్రధాన మంత్రి అవుతారు.  దేశానికి కీర్తి ప్రతిష్టలను ఆయన తీసుకువస్తారు. ”- శ్రీ చో రామస్వామి, ‘తుగ్లక్’ పత్రిక సంపాదకుడు.

భారతదేశంలో ఎంతో విజయవంతమైన ముఖ్యమంత్రులలో ఒకరుగాను, అత్యుత్తమమైన నిర్వాకులలో ఒకరుగాను శ్రీ నరేంద్ర మోదీ భారతదేశ 14వ ప్రధాన మంత్రిగా ఎంతో గొప్ప ప్రయోగాత్మక అనుభవాలను తన వెంట తీసుకునివచ్చారు.

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
UPI payment: How NRIs would benefit from global expansion of this Made-in-India system

Media Coverage

UPI payment: How NRIs would benefit from global expansion of this Made-in-India system
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ఎడారి దాహం మరియు సిఎం మోదీ వాగ్దానం: నీరు మరియు పరిష్కారం యొక్క కథ
December 20, 2023

It was New Year’s Day 2009. The unforgiving sun beat down on the parched sands of the Indo-Pak border in Gujarat in the Rann of Kutch. On this day, amidst the desolate landscape, Chief Minister Narendra Modi had arrived. His presence, a beacon of hope in the arid expanse, brought more than just news from the mainland. Shri Modi has always made it a point to spend important dates in the year with the armed forces personnel, and this year was no different.

He sat with the jawans, sharing stories and laughter. But beneath the camaraderie, a concern gnawed at him. He learned of their daily ordeal – the gruelling 50-kilometre journey conducted daily for water tankers to carry water from Suigam, the nearest village with potable supply, to the arid outpost.

The Chief Minister listened intently, his brow furrowed in concern. Shri Modi, a man known for his resolve, replied in the affirmative. He pledged to find a solution and assured the Jawans that he would bring them drinking water. Pushpendra Singh Rathore, the BSF officer who escorted Shri Modi to the furthermost point of the border, Zero Point, recalls that CM Modi took only 2 seconds to agree to the BSF jawans’ demands and made the bold claim that ‘today is 01 January – you will receive potable drinking water, through pipelines, within 6 months’.

Rathore explains that the Rann of Kutch is known for its sweltering and saline conditions and that pipelines typically cannot survive in the region. He recalls that some special pipelines were brought by Shri Modi from Germany to solve the problem. Exactly 6 months after the promise, in June, a vast reservoir was constructed near the BSF camp and water was delivered to it by the new pipeline.

The story of Shri Modi's visit to the border isn’t just about water; it is about trust and seeing a leader who listens, understands, and delivers. A leader whose guarantees are honoured.