భార‌త‌దేశ 75వ స్వాతంత్ర్య దినోత్స‌వ సంద‌ర్భంగా ప‌లుదేశాల నేత‌లు మ‌న దేశానికి శుభాకాంక్ష‌లు తెలిపిన సంగ‌తి తెలిసిందే. వారంద‌రికీ ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. భూటాన్ ప్ర‌ధాని చేసిన ట్వీట్ కు స్పందించిన ప్ర‌ధాని శ్రీ మోదీ ఈ సంద‌ర్భంగా భూటాన్ ప్ర‌ధాని లింఛెన్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ ఇరు దేశాల మ‌ధ్య‌న గ‌ల ప్ర‌త్యేక , విశ్వ‌స‌నీయ‌ సంబంధాల‌ను గుర్తు చేశారు. 

 

ఆస్ట్రేలియా ప్ర‌ధాని శ్రీ స్కాట్ మారిష‌న్ ట్వీట్ ద్వారా అందించిన శుభాకాంక్ష‌ల‌కు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నా స్నేహితుడు శ్రీ స్కాట్ మారిష‌న్ ఎంతో ప్రేమగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆస్ట్రేలియాతో భార‌త‌దేశ సంబంధాలు, భాగ‌స్వామ్యం ఉజ్వ‌లంగా వుంటూ అవి ప్ర‌గ‌తి సాధిస్తున్నాయ‌ని ఇరు దేశాల మ‌ధ్య‌న ఉమ్మ‌డిగా గ‌ల విలువ‌లు, ప్ర‌జ‌ల మ‌ధ్య‌న గ‌ల బంధాల మీద ఇరు దేశాల సంబంధాలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని అన్నారు. 

 

శ్రీ లంక ప్ర‌ధాని శ్రీ మ‌హిందా రాజ‌ప‌క్ష చేసిన ట్వీట్ కు స్పందించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌ధాని మ‌హిందా రాజ‌ప‌క్ష  శుభాకాంక్ష‌ల‌కు త‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇరు దేశాల మ‌ధ్య‌న శ‌తాబ్దాల త‌ర‌బ‌డి గ‌ల సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక‌, నాగ‌రిక‌తాత్మ‌క‌మైన బంధాలనేవి ఇరు దేశాల మ‌ధ్య‌న వున్న విశిష్ట స్నేహానికి పునాదిగా నిలుస్తున్నాయ‌ని అన్నారు. 

 

ప్ర‌ధాని శ్రీ షేర్ బ‌హ‌దూర్ దూబా చేసిన శుభాకాంక్ష‌ల ట్వీట్‌కు స్పందించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఈ సంద‌ర్భంగా భార‌త‌దేశానికి నేపాల్ దేశాల‌కు మ‌ధ్య‌న‌గ‌ల సంబంధాల‌ను గుర్తు చేస్తూ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇరు దేశాలు సాంస్కృతిక‌ప‌ర‌మైన‌, భాషాప‌ర‌మైన‌, మ‌త‌ప‌ర‌మైన‌, కుటుంబ ప‌ర‌మైన బంధాల‌ను క‌లిగి వున్నాయ‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. 

 

మాల్దీవుల అధ్య‌క్షులు శ్రీ ఇబ్ర‌హీం మొహమ్మ‌ద్ సోలిహ్ చేసిన ట్వీట్ కు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ఇండో ప‌సిఫిక్ ప్రాంతం భద్రంగా, ప‌టిష్టంగా, ఐశ్వ‌ర్య‌వంతంగా వుండాల‌నే ఇరు దేశాల దార్శ‌నిక‌త‌ను ముందుకు తీస‌కుపోవ‌డంలో మాల్దీవుల భాగ‌స్వామ్య ప్రాధాన్య‌త‌ను వివ‌రించారు. సముద్ర‌ప్రాంతానికి సంబంధించి భార‌త‌దేశానిగ‌ల ముఖ్య‌మైన స్నేహితురాలు మాల్దీవుల‌ని ఆయ‌న త‌న ట్వీటులో తెలిపారు.

 

శ్రీ లంక అధ్య‌క్షులు శ్రీ గొట‌బాయ రాజ‌పక్ష ట్వీటుకు స్పందించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ త‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇరు దేశాల మ‌ధ్య‌న బంధాల‌ను మ‌రింత ప‌టిష్టం చేయ‌డానికిగాను అన్ని రంగాల్లో శ్రీలంక స‌హ‌కారం పెంపొందించ‌డానికిగాను ఇరు దేశాలు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తాయ‌ని అన్నారు. 

 

మారిష‌స్ ప్ర‌ధాని శ్రీ ప్ర‌వీంద్ జ‌గ‌న్నాధ్ ట్వీట్ కు స్పందిస్తూ ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ త‌నకృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఇరు దేశాల‌కు మ‌ధ్య‌న శ‌తాబ్దాల త‌ర‌బ‌డి సంబంధాలున్నాయ‌ని అన్నారు. ఇరు దేశాలు ఉమ్మ‌డిగా ప‌లు విలువ‌ల్ని, సంప్ర‌దాయాల‌ను క‌లిగి వున్నాయ‌ని అన్నారు. త‌ద్వారా రెండు దేశాల మ‌ధ్య‌న విశిష్ట‌మైన స్నేహ బంధానికి పునాది ఏర్ప‌డింద‌ని అన్నారు. 

 

ఇజ్రాయిల్ ప్ర‌ధాని శ్రీ న‌ప్తాలి బెన్నెట్ శుభాకాంక్ష‌ల‌కు స్పందించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ మీ హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు. ఇరు దేశాల మ‌ధ్య‌న సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికిగాను స‌మిష్టిగా ప‌నిచేయ‌డానికి సిద్ధంగా వున్నామ‌ని అన్నారు. ఇండియా ఇజ్రాయిల్ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని పటిష్ట‌ప‌రుచుకుందామ‌ని అన్నారు. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's electronics production rises 6-fold, exports jump 8-fold since 2014: Ashwini Vaishnaw

Media Coverage

India's electronics production rises 6-fold, exports jump 8-fold since 2014: Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 డిసెంబర్ 2025
December 28, 2025

PM Modi’s Governance - Shaping a Stronger, Smarter & Empowered India