‘7వ అంతర్జాతీయ యోగ దినం’ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహమ్మారి కాలం లో యోగ కు ఉన్న పాత్ర ను గురించి తన అభిప్రాయాల ను వ్యక్తం చేశారు. ఈ కఠిన సమయం లో యోగ ప్రజల కు ఒక శక్తి సాధనం గాను, ఆత్మవిశ్వాసాన్ని అందించిన సాధనం గాను తన ను తాను రుజువు చేసుకొంది అని ఆయన అన్నారు. మహమ్మారి కాలం లో యోగ దినాన్ని మరచిపోవడం అనేది యోగ తమ సంస్కృతి లో అంతర్భాగం కానటువంటి దేశాల కు సులభమైన విషయమే అని, అయితే దానికి బదులు గా, ప్రపంచ స్థాయి లో యోగ పట్ల ఉత్సాహం వృద్ధి చెందింది అని ఆయన అన్నారు.
ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం లో దృఢత్వం యోగ తాలూకు ప్రముఖ అంశాల లో ఒకటి. ఎప్పుడైతే మహమ్మారి మన ముందుకు వచ్చిందో, ఆ సమయం లో సామర్ధ్యాలు, వనరులు లేదా మానసికంగా దీనికి ఎదురొడ్డి నిలవడానికి ఏ ఒక్కరు తయారు గా లేరు. యోగ ప్రజల కు ప్రపంచమంతటా మహమ్మారి తో పోరాడటానికి ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవడం లో సాయపడింది.
కరోనా తో పోరాడడం లో ముందు వరుస లో నిలచిన యోధులు ఏ విధం గా యోగ ను వారి సురక్షా కవచం లాగా మార్చుకొన్నదీ, యోగ మాధ్యమం ద్వారా వారిని వారు బలపరచుకొన్నదీ ప్రధాన మంత్రి వివరించారు. వైరస్ తాలూకు ప్రభావాల బారి నుంచి బయటపడటం కోసం వైద్యులు, నర్సులు కూడా ఏ విధం గా యోగ ను ఆశ్రయించిందీ ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. ఆసుపత్రుల లో వైద్యుల ద్వారా, నర్సుల ద్వారా ఏర్పాటైన యోగ సమావేశాల ను నిర్వహణ తాలూకు ఉదాహరణ లు ప్రతి చోట కనిపించాయి. మనం గాలి ని పీల్చుకొనే, తరువాత అలా పీల్చుకొన్న గాలి ని బయటకు వదలిపెట్టే క్రియల ను పటిష్ట పరచుకోవడం కోసం ప్రాణాయామం, అనులోమం-విలోమం వంటి శ్వాస సంబంధి వ్యాయామాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అని నిపుణులు నొక్కిచెప్తూ వస్తున్న సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
Published By : Admin |
June 21, 2021 | 08:37 IST
Login or Register to add your comment
PM Modi shares a Sanskrit Subhashitam urging citizens to to “Arise, Awake” for Higher Purpose
January 13, 2026
The Prime Minister Shri Narendra Modi today shared a Sanskrit Subhashitam urging citizens to embrace the spirit of awakening. Success is achieved when one perseveres along life’s challenging path with courage and clarity.
In a post on X, Shri Modi wrote:
“उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥”
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।
— Narendra Modi (@narendramodi) January 13, 2026
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥ pic.twitter.com/i3PPlUoPm4


