1. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో 2022 సెప్టెంబర్ 16నాటి షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్యదేశాల అధినేతల మండలి 22వ సమావేశం సందర్భంగా 2022-2023 సంవత్సరానికిగాను వారణాసి నగరం ఎస్సీవో తొలి పర్యాటక-సాంస్కృతిక రాజధానిగా ప్రతిపాదించబడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.
  2. ఎస్సీవో తొలి పర్యాటక-సాంస్కృతిక రాజధానిగా వారణాసి ప్రతిపాదించబడిన నేపథ్యంలో భారత-ఎస్సీవో సభ్యదేశాల మధ్య పర్యాటక-సాంస్కృతిక, మానవ ఆదానప్రదానాలకు ప్రోత్సాహం లభిస్తుంది. అంతేకాకుండా ఈ పరిణామం వల్ల ఎస్సీవో సభ్యదేశాలతో... ముఖ్యంగా మధ్య ఆసియా గణతంత్ర దేశాలతో భారత దేశానికిగల ప్రాచీన నాగరకత సంబంధాల ప్రాముఖ్యం స్పష్టమైంది.
  3. ఈ ప్రధాన సాంస్కృతిక ఆదానప్రదాన కార్యక్రమ చట్రం కింద 2022-23లో వారణాసి నగర పరిధిలో పలు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వీటిలో పాల్గొనాల్సిందిగా ఎస్సీవో సభ్య దేశాల అతిథులకు ఆహ్వానం లభిస్తుంది. భారత చరిత్ర అధ్యయనకారులు, శాస్త్రవేత్తలుపండితులురచయితలుసంగీత విద్వాంసులు, కళాకారులుఫొటో జర్నలిస్టులుపర్యాటక రచయితలు, ఇతర ఆహ్వానిత అతిథులను ఈ కార్యక్రమాలు ఆకట్టుకోగలవని భావిస్తున్నారు.
  4. పర్యాటక-సాంస్కృతిక రంగంలో ఎస్సీవో సభ్యదేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా 2021నాటి దుషాంబే శిఖరాగ్ర సదస్సులో పర్యాటక-సాంస్కృతిక  రాజధాని ప్రతిపాదన సంబంధిత నిబంధనలు ఆమోదించబడ్డాయి.
Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India attracts $70 billion investment in AI infra, AI Mission 2.0 in 5-6 months: Ashwini Vaishnaw

Media Coverage

India attracts $70 billion investment in AI infra, AI Mission 2.0 in 5-6 months: Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 31 జనవరి 2026
January 31, 2026

From AI Surge to Infra Boom: Modi's Vision Powers India's Economic Fortress