గత దశాబ్దంలో తీసుకున్న అనేక కీలకమైన నిర్ణయాలు నిర్దేశమైన విధానంతో కంటే అవినీతి మరియు ఇష్టానుసారంగా తీసుకోబడినవే, కానీ గత సంవత్సరం స్వాగతిమ్చదగిన మార్పుగా ఉంది.

సుప్రీం కోర్ట్ ఆదేశాలు బొగ్గు గనుల కేటాయింపులను రద్దు చేసిన తరువాత, పారదర్శకత మరియు సకాలంలో వేలం కోసం ప్రభుత్వం అసమానమైన వేగముతో వ్యవహరించింది. వేలం మరియు కేటాయింపు ఆదాయం, 67 బొగ్గు బ్లాకుల గని జీవితకాలానికి 3.35 లక్షల కోట్ల రూపాయలను తాకింది. ఢిల్లీ హైకోర్టు ఇలా వ్యాఖ్యానించింది:
"వేలం ప్రక్రియ బాగా పనిచేసిన వాస్తవం మమ్మల్ని ఒప్పించింది. స్వయంగా ప్రక్రియ మాకు ఏకపక్షంగా లేదా అహేతుకంగా అనిపించలేదు. ఈ వేలం ప్రక్రియ ఏ ప్రత్యేకమైన వేలందారుని అనుకూలంగా ఉందనే ఆరోపణలు కూడా లేవు.”

స్పెక్ట్రమ్ వేలంలో, గతంలో ఉన్న సున్నా నష్టం సిద్ధాంతం విరుద్ధంగా, ప్రభుత్వం యొక్క విధానం భారీ లాభాలకు భరోసా తెచ్చింది. ఏడు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న రక్షణాత్మక బ్యాండ్ గుర్తింపు సంక్లిష్ట సమస్య త్వరగా పరిష్కరించబడి రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2100 MHz లు కూడా వేలానికి పెట్టబడింది. ఆపరేటర్లు నిర్ణయాత్మక నిర్ణయం తీసుకునేవిధంగా 800 MHz, 900 MHz, 1800 MHz మరియు 2100 MHz - 4 వివిధ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ మొదటిసారిగా ఏకకాలంలో మరియు బహుళ రౌండ్ల వేలం లోకి ప్రవేశపెట్టబడ్డాయి. ఆమోదిత రిజర్వ్ ధర రూ.80277 కోట్లకు గాను, వేలం రూ .109875 కోట్లు సంపాదించి పెట్టింది.

పారదర్శకతను నిర్ధారించడానికి ఒక వినూత్న దశలో, పర్యావరణ మంత్రిత్వశాఖ పర్యావరణ ఆమోదాల కోసం దరఖాస్తుల యొక్క ఆన్లైన్ సమర్పణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఆమోదాల కోసం మంత్రిత్వ శాఖకు రావల్సిన అవసరం ఇక లేదు. దరఖాస్తులను ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చు. కు జిఐఎస్ ఆధారిత డెసిషన్ సపోర్ట్ సిస్టం (డిఎస్ఎస్). అటవీ ఆమోదం ధరకాస్తులపై సమాచారం, పారదర్శక, వేగవంతమైన మరియు ఊహాజనిత నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడనున్నాయి.

పదవి చేపట్టిన మొదటి రోజునే నల్లధనం పై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం స్విస్ ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తూ మరియు ఐటి విభాగం దర్యాప్తు చేసిన కేసుల సమాచారం పొందుతుంది. ప్రభుత్వం ప్రకటించని విదేశీ ఆదాయం మరియు ఆస్తులు (పన్ను విధింపు) బిల్ 2015ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ బిల్లు యొక్క నిబంధనలలో గుర్తుతెలియని విదేశీ ఆదాయం మరియు ఆస్తులకు తీవ్రమైన జరిమానాలు మరియు శిక్షలు మరియు 1 లక్షకు పైన చేసే కొనుగోలు / విక్రయాలకు పాన్ ను నమోదు చేయడం తప్పనిసరి వంటివి ఉన్నాయి.




