Quote“First steps towards cleanliness taken with Swachh Bharat Abhiyan with separate toilets built for girls in schools”
Quote“PM Sukanya Samruddhi account can be opened for girls as soon as they are born”
Quote“Create awareness about ills of plastic in your community”
Quote“Gandhiji chose cleanliness over freedom as he valued cleanliness more than everything”
Quote“Every citizen should pledge to keep their surroundings clean as a matter of habit and not because it’s a program”

ప్రధానమంత్రి: పరిశుభ్రత పాటించడం వల్ల ఉపయోగాలేమిటో మీకు తెలుసా?

విద్యార్థి: సర్, పరిశుభ్రత పాటించడం వల్ల వ్యాధులు దగ్గరికే రావు, పైగా ఎప్పుడూ శుభ్రంగా ఉండగలం. దేశాన్ని శుభ్రంగా ఉంచినప్పుడు, పర్యావరణ పరిశుభ్రత కూడా ఎంత ముఖ్యమో ప్రజలకు అర్ధమవుతుంది.

ప్రధానమంత్రి: మరి, టాయిలెట్లు లేనప్పుడు ఏమౌతుందీ?

విద్యార్థి: సర్, జబ్బులు విజృంభిస్తాయి.

ప్రధానమంత్రి: నిజమే, వ్యాధులు ప్రబలుతాయి. ఇదివరకూ టాయిలెట్లు ఎక్కువగా అందుబాటులో లేనప్పుడు, 100 ఇళ్ళలో కనీసం 60 ఇళ్ళకి కూడా ఆ సౌకర్యం  ఉండేది కాదు. దాంతో అటువంటి ఇళ్ళలో నివసించేవారు బహిర్భూమిని వాడేవారు, వ్యాధులకి అదే పెద్ద కారణమైపోయింది. పాపం, ఆడవారు- అంటే మన తల్లులు, అక్కలు, కూతుర్లు ఎన్నో  ఇబ్బందులు పడేవారు. అయితే, స్వచ్ఛ భారత్ అభియాన్ మొదలయ్యాక, బాలికలకి ప్రత్యేక వసతులతో, స్కూళ్ళలో టాయిలెట్లు నిర్మించేలా మేం చర్యలు తీసుకున్నాం. దాంతో బడి మానేసే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయి, వాళ్ళు తమ చదువును కొనసాగించే వీలు కలిగింది. ఏమంటారు మరి, పరిశుభ్రత లాభం కలిగించిందా లేదా?

విద్యార్థి: తప్పక కలిగించింది సర్!

ప్రధానమంత్రి: ఇవ్వాళ మనం ఏ పెద్దవారి జయంతులను జరుపుకుంటున్నాం?

విద్యార్థి: సర్, గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సర్ ఇవ్వాళ.

ప్రధానమంత్రి: సరే.. మీలో ఎంతమంది యోగాభ్యాసం చేస్తారు? ఓ.. చాలా మందే చేస్తున్నారే! ఆసనాలు వేయడం వల్ల కలిగే లాభాలేమిటో చెప్పండి మరి!

విద్యార్థి: సర్, యోగా వల్ల శరీరాన్ని సులభంగా వంచగలుగుతాం.

ప్రధానమంత్రి: సరే.. ఇంకా?

విద్యార్థి: యోగా జబ్బులు రాకుండా కాపుకాయడమే కాకుండా, ఒంట్లో రక్త ప్రసరణ సరిగ్గా అయ్యేలా చూస్తుంది సర్!

ప్రధానమంత్రి: భలే! ఇంతకీ నువ్వు ఇంట్లో ఏది ఇష్టంగా తింటావు? అమ్మగారు కూరలు తినమని, పాలు తాగమని చెప్పినప్పుడు, మీలో ఎంతమంది గొడవ చేసి వద్దూ అంటారు?

విద్యార్థి: మేమంతా కూరగాయలు తింటాం సర్..

ప్రధానమంత్రి: నిజమే!?  సరే! మీలో ఎంతమంది, కాకరకాయతో సహా, అన్ని కూరలనీ తింటారు?

విద్యార్థి: ఆ.. కాకరకాయ తప్ప, అన్నీ తింటాం సర్..!

ప్రధానమంత్రి: అలాగా.. కాకరకాయ తప్ప!   

ప్రధానమంత్రి: మీలో ఎంతమందికి ‘సుకన్యా సమృద్ధి యోజన’ గురించి తెలుసు?

విద్యార్థి: సర్.. తెలుసండీ!

ప్రధానమంత్రి: ఐతే ఆ పథకం గురించి చెప్పు మరి!

విద్యార్థి: సర్, ఇది చాలా మంది అమ్మాయిలకి ఎంతో లాభం కలిగిస్తున్న పథకం, మీరు ప్రవేశపెట్టిందే సర్! ఈ పథకం కింద, 10 ఏళ్ల లోపు పిల్లలు ఖాతా తెరవచ్చు, మాకు 18 ఏళ్లు వచ్చేప్పటికి, జమ అయిన సొమ్ము మాకు పెద్ద చదువులకి ఎంతో ఉపయోగిస్తుంది. అప్పుడు మేము ఆ ఖాతా నించీ డబ్బు విత్ డ్రా చేసుకోగలుగుతాం.

ప్రధానమంత్రి: శభాష్! అమ్మాయి పుట్టగానే సుకన్యా సమృద్ధి యోజన కింద ఖాతా తెరవవచ్చు. తల్లితండ్రులు ఖాతాలో  ఏడాదికి వెయ్యి రూపాయలు చొప్పున జమ చేయచ్చు – అంటే, నెలకి 80-90 రూపాయల ఖర్చు అనుకోవచ్చు. అమ్మాయికి 18 ఏళ్ళ వయసు వచ్చాక, పై చదువులకి డబ్బు అవసరం పడితే, ఖాతాలో జమ అయిన సొమ్ములో సగం విత్ డ్రా చేసుకోవచ్చు. అదే, 21 సంవత్సరాల వయసులో పెళ్ళికి సిద్ధమైతే, ఆ అవసరానికి కూడా ఈ డబ్బు వాడుకోవచ్చు. ప్రతి ఏడాది, క్రమం తప్పకుండా వెయ్యి రూపాయలు జమ చేసిన పక్షంలో, సొమ్ము వాపసు తీసుకునే సమయానికి 50,000 రూపాయలు జమ అవుతాయి, ఇందులో 30,000-35,000 రూపాయలు వడ్డీ సోమ్మే. సాధారణ వడ్డీ కన్నా అధికంగా, అంటే 8.2 % చొప్పున మన అమ్మాయిలకి వడ్డీ లభిస్తుంది.

విద్యార్థి: సర్, ఇక్కడ ఈ చార్ట్ చూడండి, స్కూల్ ని పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తోంది ఇది. ఆ పనిలో  ఉన్న విద్యార్థుల ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి సర్!

ప్రధానమంత్రి: నేను గుజరాత్ లో ఉన్న సమయంలో జరిగిన సంఘటన చెబుతాను, వినండి. గుజరాత్ తీర ప్రాంతంలోని ఓ  స్కూల్లో ఒక టీచర్ అద్భుతమైన ఘనత సాధించారు. సముద్ర తీర ప్రాంతం కావడంతో, అక్కడి నీరు ఉప్పుమయంగా ఉంటుంది. దాంతో అక్కడి నేలలో మొక్కలు పెరగడం కష్టమయ్యేది. ఏ చెట్టూ లేని ఆ నేలని ఆ టీచర్ ఎలా మార్చారు? ఆయన తన విద్యార్థులకు తలా ఒక ఖాళీ బిస్లరీ బాటిల్ నో, వాడేసిన ఖాళీ ఆయిల్ క్యాన్లనో ఇచ్చి,  వాళ్ళ ఇళ్ళలో అంట్లు తోమిన నీళ్ళు జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని ఖాళీ బాటిళ్ళలో ఆ నీటిని నింపి బడికి తీసుకురమ్మన్నారు. ప్రతి విద్యార్థికీ ఆయన ఒక్కో చెట్టు అప్పగించారు. ఇంటినించీ తెచ్చిన నీటితో ఆ చెట్టు సంరక్షణ చేయాలన్నమాట! ఈ విషయం జరిగి 5-6 ఏళ్ళ తర్వాత నేను ఆ స్కూల్ కి వెళ్ళినప్పుడు, అక్కడ చూసిన దృశ్యం అద్భుతంగా అనిపించింది, నమ్మశక్యం కానంత పచ్చదనంతో ఆ స్కూల్ కళకళలాడుతోంది మరి!  

విద్యార్థి: సర్, ఇది పొడి చెత్త. తడి/పొడి చెత్తలని వేరు చేస్తే, జీవ ఎరువు తయారు చేయడం సులభం.

ప్రధానమంత్రి: మరి, మీరు ఇంట్లో వ్యర్ధాలను ఇలా వేరు చేస్తారా?

ప్రధానమంత్రి: ప్రధానమంత్రి: మీలో ఎవరి ఇంట్లోనైనా, మీ అమ్మగారు ఉత్తచేతులతో కూరగాయలు కొనడానికి వెళ్ళి, కూరలని ప్లాస్టిక్ సంచుల్లో తెచ్చారనుకోండి! అట్లాంటి పరిస్థితుల్లో మీరు, “అమ్మా, ఇంటినించీ సంచీ తీసుకువెళ్ళవూ, ప్లాస్టిక్ కవర్లు ఎందుకమ్మా మనకి?  ఇంట్లోకి చెత్త తెచ్చినట్టే కదూ..” అంటారా?!

విద్యార్థి: అంటాం సర్, గుడ్డ సంచుల్ని తీసుకువెళ్ళమని చెప్తూ ఉంటాం సర్!

ప్రధానమంత్రి: ఓ.. మీరు చెబుతారన్నమాట!

విద్యార్థి: ఎస్ సర్!

ప్రధానమంత్రి: భేష్!

ప్రధానమంత్రి: ఇదేమిటో తెలుసుగా మీకు? ఔను,  గాంధీ తాత కళ్ళజోడు ఇది. మీరు పరిశుభ్రత పాటిస్తున్నారో లేదో ఆయన గమనిస్తూ ఉంటారా? గాంధీగారు తమ జీవితం మొత్తం స్వచ్ఛత అంటే ప్రాణం పెట్టేవారు. ఎవరు శుభ్రతని పాటిస్తున్నారో, ఎవరు పాటించడం లేదో, ఆయన గమనిస్తూనే ఉంటారు. స్వాతంత్ర్యం, పరిశుభ్రత, ఈ రెండిట్లో ఏది ముఖ్యం అని ఒకానొకప్పుడు ఆయన్ని ఎవరో అడిగితే, పరిశుభ్రతకే నా తొలి ప్రాధాన్యం అన్నారాయన. అంటే, పరిశుభ్రత అంటే ఆయనకి ఎంత ఇష్టమో, స్వాతంత్రం కన్నా మిన్న అని ఆయన భావించేవారని  తెలియడం లేదూ? మన స్వచ్ఛత ప్రచార ఉద్యమం కొనసాగాలా వద్ద, మీరే చెప్పండి.

విద్యార్థి: తప్పక ముందుకి తీసుకువెళ్ళాలి సర్!

ప్రధానమంత్రి: ఇప్పుడు చెప్పండి.. పరిశుభ్రత అనేది కేవలం ఒక కార్యక్రమమా,  లేక అలవాటుగా మారాలంటారా?

విద్యార్థి: తప్పకుండా అలవాటుగా మారాలి సర్!

ప్రధానమంత్రి: శభాష్ పిల్లలూ.. కొంతమంది ఈ స్వచ్ఛతా కార్యక్రమమేదో మోదీ గారికి సంబంధించిందీ అనుకుంటూ ఉంటారు.. నిజానికి పరిశుభ్రత అనేది ఏ ఒక్క వ్యక్తికో, కుటుంబానికో సంబంధించినది కాదు. అట్లాగే, ఇది ఒక రోజులో పూర్తయ్యేదీ  కాదు. జీవితాంతం పాటించవలసిన ఒక అలవాటు, 365 రోజులూ, మనం బ్రతికి ఉన్నంత కాలం దృష్టి పెట్టవలసిన అంశం!

మరి ఇందుకోసం మనం ఏం చెయ్యాలీ? ఒకవిధమైన ప్రత్యేక మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి, మనసుకి హత్తుకునేలా పరిశుభ్రత మంత్రాన్ని పఠించాలి. దేశంలో ప్రతి ఒక్కరూ మేము చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయము అనే నిర్ణయం తీసుకున్నారు అనుకోండి.. అప్పుడేమవుతుంది?   

విద్యార్థి: అప్పుడు అంతటా పరిశుభ్రత ఉంటుంది.

ప్రధానమంత్రి: సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మీరు దేన్ని అలవాటు చేసుకోవాలో చెప్పండి? చెత్తనీ, వ్యర్ధాలనీ ఎక్కడంటే అక్కడ విసిరి వేయకూడదు, అదే మొదటి అడుగు, అర్ధమయ్యిందిగా పిల్లలూ..

విద్యార్థి: ఎస్ సర్! అర్ధమయ్యింది సర్!

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Operation Sindoor: A fitting blow to Pakistan, the global epicentre of terror

Media Coverage

Operation Sindoor: A fitting blow to Pakistan, the global epicentre of terror
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Haryana Chief Minister meets Prime Minister
May 21, 2025

The Chief Minister of Haryana, Shri Nayab Singh Saini met the Prime Minister, Shri Narendra Modi today.

The Prime Minister’s Office handle posted on X:

“Chief Minister of Haryana, Shri @NayabSainiBJP, met Prime Minister @narendramodi. @cmohry”