ఎక్స్‌లెన్సీ,

మీకు, మీ  ప్రతినిధివర్గానికి ఆత్మీయంగా  స్వాగతం పలుకుతున్నా. ఈ రోజు మన రెండు దేశాల సంబంధాల్లో ఒక చరిత్రాత్మకమైన రోజుగా నిలిచిపోతుంది. మనం భారత్-ఫిలిప్పీన్స్ సంబంధాలను ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్తున్నాం. ఇది మన బంధానికి ఒక కొత్త జోరును, సమగ్రతను జోడిస్తుంది. గత కొన్నేళ్లుగా వాణిజ్యం, రక్షణ, నౌకావాణిజ్య సహకారం, ఆరోగ్య సంరక్షణ, భద్రత, తగినన్ని ఆహారపదార్థాల నిల్వలు కలిగి ఉండటం, అభివృద్ధి ప్రధాన అంశాల్లో భాగస్వామ్యం, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా అన్ని రంగాల్లో మన  సంబంధాలు ముందంజ వేశాయి. వచ్చే అయిదేళ్లకు ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని దానిని మనం అమలు చేయబోవడం నిజంగా చాలా సంతోషాన్నిచ్చే అంశం.

ఎక్స్‌లెన్సీ,

‘ఆసియాన్‌’లో 2027 జులై వరకు, భారత్‌కు కంట్రీ కోఆర్డినేటర్‌గా ఫిలిప్పీన్స్ సహకారాన్ని అందించనుంది.  ‘ఆసియాన్’ అధ్యక్ష పదవీబాధ్యతలను 2026లో  మీరు స్వీకరించబోతున్నారు. భారత్-ఆసియాన్ సంబంధాలు ఫిలిప్పీన్స్ నాయకత్వంలో మరింత బలపడతాయని నమ్ముతున్నాం.

ఎక్స్‌లెన్సీ,

మనం ఇద్దరం సమావేశమవడం ఇదే అయినా, దాదాపు అన్ని కీలక అంశాలను  సమగ్రంగా చర్చించాం. అందువల్ల, వాటిని మళ్లీ మళ్లీ ప్రస్తావించాలనో, పునరుద్ఘాటించాలనో నేను అనుకోవట్లేదు. మీరు ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వాలని కోరుతున్నా, మీ ప్రసంగం ఈ అంశాలను ముందుకు తీసుకెళ్లడానికి మనకు తోడ్పడుతుంది.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న యోధులకు ప్రధాని నివాళి
August 09, 2026

చరిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న యోధులందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో వారు చూపిన ధైర్యసాహసాలకూ, దృఢ సంకల్పానికీ నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ నాయకత్వం అందించిన స్ఫూర్తితో క్విట్ ఇండియా ఉద్యమం ఇచ్చిన పిలుపు స్వాతంత్ర్య పోరాటంలో నూతనోత్తేజాన్ని నింపిందనీ, వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని ప్రతిబింబించిందని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

చరిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారిని స్మరించుకుంటున్నా. వారి ధైర్యం ప్రతి భారతీయునికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. మహాత్మాగాంధీ నాయకత్వం అందించిన స్ఫూర్తితో క్విట్ ఇండియా పిలుపు స్వాతంత్ర్య ఉద్యమంలో నూతన శక్తిని నింపింది. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న మన ప్రజల అచంచల సంకల్పాన్ని ప్రతిబింబించింది.