విపత్తు నిరోధకతను బలోపేతం చేయడానికి 5 అంతర్జాతీయ ప్రాధాన్యతలను ప్రతిపాదించిన ప్రధానమంత్రి
భారత్ ఏర్పాటు చేసిన సునామీ హెచ్చరికల వ్యవస్థ వల్ల 29 దేశాలకు ప్రయోజనం కలుగుతోంది: ప్రధాని
అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాలను భారతదేశం పెద్ద మహాసముద్ర దేశాలుగా గుర్తించింది... వాటి బలహీనతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది: ప్రధానమంత్రి
ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, సమన్వయం కీలకం: ప్రధాని
విపత్తుల నుంచి గట్టెక్కేందుకు నేర్చుకున్న విషయాలు, ఉత్తమ ఆచరణ పద్ధతులతో కూడిన గ్లోబల్ డిజిటల్ రిపాజిటరీ ఏర్పాటు యావత్ ప్రపంచానికి ప్రయోజనకరం: ప్రధాని

అత్యంత ప్రముఖులు,

గౌరవ ప్రతినిధులు,

ప్రియమైన మిత్రులు,

నమస్కారం.

విపత్తు నిరోధక సుస్థిర మౌలిక సదుపాయాల (డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) పై అంతర్జాతీయ సదస్సు 2025 కు స్వాగతం. యూరప్ లో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు నిర్వహణకు మద్దతు అందించిన నా మిత్రుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ కు, ఫ్రాన్స్ ప్రభుత్వానికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సముద్రాలపై త్వరలో జరగనున్న ఐక్యరాజ్య సమితి సదస్సు (యునైటెడ్ నేషన్స్ ఓషన్స్ కాన్ఫరెన్స్) సందర్భంగా కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ సదస్సు ఇతివృత్తం -   'తీరప్రాంతాలకు సుస్థిర భవిష్యత్తును రూపొందించడం'. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల కారణంగా తీరప్రాంతాలు, ద్వీపాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ లలో రెమల్ తుపాను, కరేబియన్ లో బెరిల్ హరికేన్, ఆగ్నేయాసియాలో యాగి తుపాను, అమెరికాలో హెలెన్ హరికేన్, ఫిలిప్పీన్స్ లో ఉసాగి తుపాను, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో చిడో తుపాన్లు పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి.

మిత్రులారా,

1999 సూపర్ సైక్లోన్, 2004 సునామీ సమయంలో భారత్ కూడా ఈ బాధను అనుభవించింది. అయితే ఆ విపత్తుల నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం. తట్టుకునే శక్తిని అభివృద్ధి చేసుకుంటూ నిబ్బరంతో పునర్నిర్మాణాన్ని చేపట్టాం. అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో సైక్లోన్ షెల్టర్లను నిర్మించాం. అలాగే, 29 దేశాలకు ఉపయోగపడేలా సునామీ హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటులో సహాయపడ్డాం. 

 

మిత్రులారా,

విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి 25 అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాలతో కలిసి పనిచేస్తోంది. ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఇంధనం, నీటి భద్రత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను నిర్మిస్తున్నారు. ఈ సదస్సు ఇతివృత్తం దృష్ట్యా, పసిఫిక్, హిందూ మహాసముద్రం, కరేబియన్ దేశాలకు చెందిన స్నేహితులను ఇక్కడ చూడటం నాకు సంతోషంగా ఉంది. ఇంకా, ఆఫ్రికన్ యూనియన్ కూడా సిడిఆర్ ఐలో చేరడం నాకు సంతోషంగా ఉంది.

మిత్రులారా,

కొన్ని ముఖ్యమైన ప్రపంచ ప్రాధాన్యతల గురించి నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను.

మొదటిది: విపత్తుల నివారణపై కోర్సులు, మాడ్యూళ్లు, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు ఉన్నత విద్యలో భాగం కావాలి. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని ఇది సిద్ధం చేస్తుంది. 

రెండోది: అనేక దేశాలు విపత్తులను ఎదుర్కొని సహనంతో పునర్నిర్మాణం చేస్తుంటాయి. ఈ దేశాల అనుభవాలు,  ఉత్తమ ఆచరణ పద్ధతులను ఒక గ్లోబల్ డిజిటల్ భాండాగారంగా సమీకరించడం ప్రపంచానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

 

మూడోది: విపత్తులను తట్టుకునే శక్తి కోసం వినూత్న ఆర్థిక సహాయ పథకాలు అవసరం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా చూడటం, అమలు చేయకలిగిన కార్యక్రమాలను రూపొందించడం చాలా అవసరం.

నాలుగోది: అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాలను మేం పెద్ద సముద్ర దేశాలుగా పరిగణిస్తాం. వారి బలహీనత కారణంగా, వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

ఐదవది: ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, సమన్వయాన్ని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. ఇది సకాలంలో నిర్ణయాలు తీసుకోవడానికి, చివరి మైలు వరకు ప్రభావవంతమైన సమాచార వినిమయానికీ సహాయపడుతుంది. ఈ సదస్సులో జరిగే చర్చలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయని నేను కచ్చితంగా అనుకుంటున్నాను.

మిత్రులారా,

కాలానికీ, ఆటుపోట్లకు దీటుగా నిలబడే మౌలిక సదుపాయాలను నిర్మిద్దాం. ప్రపంచానికి దృఢమైన, సుస్థిరమైన భవిష్యత్తును అందిద్దాం.

ధన్యవాదాలు....

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
First multilingual Indian speech recognition model trained on 65 languages and dialects released

Media Coverage

First multilingual Indian speech recognition model trained on 65 languages and dialects released
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
President’s address on the eve of 80th Independence Day reflects the nation’s strength and inspires renewed determination for a Viksit Bharat: PM
August 14, 2026

Prime Minister Shri Narendra Modi today lauded the address delivered by President of India, Smt. Droupadi Murmu, on the eve of 80th Independence Day noting that it was motivating and thoughtful.

The Prime Minister observed that her thoughts reflect the strength of our nation and the aspirations of every Indian. He stated that her message inspires us all to work with renewed determination for a Viksit Bharat.

In a post on X, the Prime Minister shared:

"A motivating and thoughtful address by Rashtrapati Ji on the eve of Independence Day.

Her thoughts reflect the strength of our nation and the aspirations of every Indian.

Her message inspires us all to work with renewed determination for a Viksit Bharat.

@rashtrapatibhvn"