బుల్లెట్ రైలు ఉద్యోగి: బుల్లెట్ రైలు మన గుర్తింపు. ఈ విజయం -  మోదీ జీ,  మీకు మాత్రమే కాదు, మాకు కూడా చెందుతుంది.

ప్రధానమంత్రి: మీరేమనుకుంటున్నారు? ఈ వేగం ఫర్వాలేదా? మీరు నిర్దేశించుకున్న టైమ్‌ టేబుల్ ప్రకారమే పనిచేస్తున్నారా, లేక ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?

బుల్లెట్ రైలు ఉద్యోగి: లేదు సార్, మాకు  ఎలాంటి ఇబ్బందులు లేవు. 

ప్రధానమంత్రి: మీరేం చెప్పాలనుకుంటున్నారు? 

బుల్లెట్ రైలు ఉద్యోగి: నేను కేరళ వాడిని. నేను సెక్షన్-2, నవ్‌సారి నాయిస్ (బారియర్ ఫ్యాక్టరీ)లో పనిచేస్తున్నాను.

ప్రధానమంత్రి: మీరు గుజరాత్‌కి రావడం ఇదే మొదటిసారా?

బుల్లెట్ రైలు ఉద్యోగి: అవును సార్. నేను ఇక్కడ సెక్షన్-2లోని నాయిస్ బారియర్ ఫ్యాక్టరీలో రోబోటిక్ యూనిట్‌ను పర్యవేక్షిస్తున్నాను. నాయిస్ బారియర్ కోసం రీబార్ కేజ్‌ను రోబోల సహాయంతో వెల్డింగ్ చేస్తున్నాం.

ప్రధానమంత్రి: ఈ బుల్లెట్ రైలును నిర్మించడం, భారత్‌లో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో భాగం కావడం గురించి మీకు ఎలా అనిపిస్తోంది? వ్యక్తిగతంగా మీరు ఏమనుకుంటున్నారు? మీ కుటుంబ సభ్యులతో ఏం చెబుతారు?

బుల్లెట్ రైలు ఉద్యోగి: సార్, ఇది ఒక కలలా అనిపిస్తోంది. నేను ఇప్పుడు చేస్తున్న పని భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఇది నా కుటుంబానికి, నాకు గర్వకారణమైన క్షణం సార్.

ప్రధానమంత్రి: చూడండి, 'నేను నా దేశం కోసం పనిచేస్తున్నాను, నేను దేశానికి ఏదో కొత్తది ఇస్తున్నాను' అని మీకు మనసులో అనిపించకపోతే, ఆ పనికి అర్థం ఉండదు. అంతరిక్ష ఉపగ్రహాన్ని మొట్టమొదట ప్రయోగించిన వ్యక్తికి అలాగే అనిపించి ఉంటుంది. ఈ రోజు వందలాది ఉపగ్రహాల ప్రయోగం జరుగుతోంది. 

బుల్లెట్ రైలు ఉద్యోగి: నమస్తే సర్, నా పేరు శృతి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను లీడ్ ఇంజనీరింగ్ మేనేజర్‌ని. డిజైన్, ఇంజనీరింగ్ నియంత్రణను చూసుకుంటాను. మీరు చెప్పినట్లుగా, ప్రారంభ ప్రణాళిక, అమలు ఏదైనా, అది తొలి దశల్లోనే మొదలవుతుంది.  ఆ తర్వాత మనం అమలుకి వెళ్లినప్పుడు, ప్రతి దశలో లాభనష్టాలను చూస్తాం. ఏదైనా పని చేయకపోతే, ఇది ఎందుకు పని చేయడం లేదు అని అడుగుతాం - మేం ముందు ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాం. అప్పటికీ మాకు సాధ్యం కాకపోతే, ప్రత్యామ్నాయ పరిష్కారాల పై దృష్టి పెట్టి అలా దశలవారీగా ముందుకెడతాం, సర్.

ప్రధానమంత్రి: మీ అనుభవాలతో ఒక రకమైన "బ్లూ బుక్" వంటిది తయారు చేస్తే మనం మరిన్ని బుల్లెట్ రైళ్లను నిర్మించే దిశగా సాగుతున్నప్పుడు అది దేశానికి చాలా సహాయపడుతుంది. ప్రతిసారీ ప్రతి ఒక్కరూ మొదటి నుంచి ప్రారంభించాలని మనం కోరుకోం. ఇక్కడ నేర్చుకున్న అంశాలను ఇతర చోట్ల అమలు చేయాలి. కానీ ఒక పనిని ఒక నిర్దిష్టమైన విధానంలోనే ఎందుకు చేయాలన్నది తెలిస్తేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే ప్రజలు అర్థం చేసుకోకుండా కేవలం మూస విధానంలో వెళతారు.  మీరు మీ అనుభవాలను రికార్డు చేస్తే, అది భవిష్యత్తులో విద్యార్థులకు కూడా సహాయపడుతుంది. మీరు ఇక్కడ మీ జీవితాన్ని అంకితం చేస్తారు. దేశం కోసం విలువైనదాన్ని వదిలి వెళతారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Over 52,000 Indians return safely from Gulf amid Iran war: MEA

Media Coverage

Over 52,000 Indians return safely from Gulf amid Iran war: MEA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 మార్చి 2026
March 10, 2026

Citizens Appreciate India’s Digital Leap and Green Triumphs Under the Leadership of PM Modi