"మూడు ప్రధాన ఓడరేవులు, పదిహేడు చిన్న ఓడరేవులతో, తమిళనాడు సముద్ర వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా మారింది"
"సుస్థిరమైన, ముందుచూపుగల అభివృద్ధితో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్న భారత్"
" భారతదేశ అభివృద్ధిలో ఆవిష్కరణలు, ఇతరులతో కలిసి పనిచేయడం గొప్ప బలాలు"
"ప్రపంచ సరఫరా వ్యవస్థలో ప్రధాన వాటాదారుగా భారత్, మెరుగవుతున్న ఈ సామర్థ్యమే మన ఆర్థిక వృద్ధికి పునాది"

నా మంత్రివర్గ సహచరులు, సర్బానంద సోనావాల్ జీ, శాంతనూ ఠాకూర్ జీ, టుటికోరిన్ పోర్ట్ అధికారులు, ఉద్యోగులు, ఇతర ప్రముఖ అతిథులు, సోదర సోదరీమణులారా,

'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) దిశగా మన ప్రయాణంలో ఈ రోజు అత్యంత ముఖ్యమైనది. ఈ కొత్త టుటికోరిన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ భారతదేశ సముద్ర మౌలిక సదుపాయాలలో కొత్త తారగా నిలుస్తుంది. ఈ టెర్మినల్ వి.వో చిదంబరనార్ నౌకాశ్రయ సామర్థ్యాన్ని విస్తరిస్తుంది. పద్నాలుగు మీటర్ల కంటే ఎక్కువ లోతైన డ్రాఫ్ట్, 300 మీటర్ల కంటే ఎక్కువ బెర్త్‌తో వి.ఓ.సి. నౌకాశ్రయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వి.ఓ.సీ నౌకాశ్రయం వద్ద రవాణాపరమైన ఖర్చులు తగ్గించడంతో పాటు, భారత్ కోసం విదేశీ మారకద్రవ్యాన్ని కూడా ఆదా చేస్తుంది. ఈ సందర్భంలో మీ అందరికీ అలాగే తమిళనాడు ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

 

 రెండేళ్ల క్రితం పలు వి.ఓ.సీ. సంబంధిత ప్రాజెక్ట్‌లను ప్రారంభించే అవకాశం నాకు లభించిన విషయం ఇంకా నాకు గుర్తుంది. ఆ సమయంలో, ఈ నౌకాశ్రయంలో సరుకు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి అనేక పనులు ప్రారంభమైనాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో నేను టుటికోరిన్‌ సందర్శించిన సమయంలో కూడా, నౌకాశ్రయానికి సంబంధించి మరిన్ని పనులు ప్రారంభమైనాయి. ఈ రోజు వేగంగా జరుగుతున్న ఈ పనులు చూస్తుంటే నా సంతోషం రెట్టింపు అవుతుంది. ఈ కొత్త టెర్మినల్‌లో 40% మంది ఉద్యోగులు మహిళలే కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సముద్ర రంగంలోనూ మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధికి ఇది ప్రతీకగా నిలుస్తుంది.

 

మిత్రులారా,

తమిళనాడు తీరప్రాంతాలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడ నౌకాశ్రయ మౌలికవసతులలో మూడు ప్రధాన ఓడరేవులు అలాగే పదిహేడు చిన్న ఓడరేవులు ఉన్నాయి. ఈ సామర్థ్యం కారణంగా తమిళనాడు ఇప్పుడు సముద్ర వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉంది. పోర్ట్ ఆధారిత అభివృద్ధి మిషన్‌ను మరింత వేగవంతం చేయడానికి, మేము ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నాము. దీనికోసం ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడుతున్నాము. మేము వి.ఓ.సీ. సామర్థ్యాన్ని పెంచే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నాము. ఈ వి.ఓ.సీ. నౌకాశ్రయం భారతదేశ సముద్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉంది.

మిత్రులారా,

భారత సముద్ర మిషన్ నేడు కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాత్రమే పరిమితం కాలేదు. భారత్ ఇప్పుడు సుస్థిరమైన, ముందుచూపు గల అభివృద్ధితో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నది. ఇది మన వి.ఓ.సీ నౌకాశ్రయం విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నౌకాశ్రయం గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా, అలాగే సముద్రతీర పవన శక్తి కోసం నోడల్ పోర్ట్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో మన కార్యక్రమాలు అత్యంత ప్రభావవంతమైనవి అని ఇది రుజువు చేస్తుంది.

 

మిత్రులారా,

ఈ అభివృద్ధి ప్రయాణంలో ఆవిష్కరణలు, ఇతరులతో కలిసి పని చేయడం భారతదేశపు గొప్ప బలాలుగా ఉన్నాయి. నేడు ప్రారంభించుకున్న కొత్త టెర్మినల్ ఐక్యతా బలానికి నిదర్శనంగా నిలుస్తుంది. బాగా అనుసంధానించబడిన భారత్‌ నిర్మాణం కోసం సమష్టిగా కృషి జరుగుతున్నది. దేశవ్యాప్తంగా నేడు రహదారులు, జాతీయ రహదారులు, జలమార్గాలు, వాయుమార్గాల విస్తరణతో అనుసంధానం ఎంతో మెరుగైంది. దీని ఫలితంగా ప్రపంచ వాణిజ్యంలో భారత్ స్థానం గణనీయంగా బలపడింది. ప్రపంచ సరఫరాల వ్యవస్థలో భారతదేశం ప్రధాన వాటాదారుగా మారుతున్నది. మెరుగవుతున్న ఈ సామర్థ్యం మన ఆర్థికవృద్ధికి పునాది అవుతుంది. ఇదే బలం భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతుంది. భారత్ సామర్థ్యాలను మరింతగా పెంచుటలో తమిళనాడు కీలక పాత్ర పోషించడం నాకు సంతోషం కలిగిస్తున్నది. వీ.ఓ.సీ నౌకాశ్రయం వద్ద కొత్త టెర్మినల్‌ ప్రారంభ సందర్భంగా మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ధన్యవాదాలు.

 వణక్కమ్ (నమస్కారం).

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors

Media Coverage

PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 డిసెంబర్ 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security