షేర్ చేయండి
 
Comments
జాతీయ విద్యా విధానం 21 వ శతాబ్దపు భారతదేశానికి కొత్త దిశను ఇస్తుంది: ప్రధాని మోదీ
శక్తివంతమైన యువత ఒక దేశం యొక్క అభివృద్ధి యొక్క ఇంజన్లు; వారి అభివృద్ధి వారి బాల్యం నుండే ప్రారంభం కావాలి.ఎన్ఇపి-2020 దీనిపై చాలా ప్రాధాన్యత ఇస్తుంది: ప్రధాని
యువతలో ఎక్కువ అభ్యాస స్ఫూర్తి, శాస్త్రీయ మరియు తార్కిక ఆలోచన, గణిత ఆలోచన మరియు శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించడం అవసరం: ప్రధాని

అందరికీ నమస్కారం,

 కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు, కేంద్ర విద్యామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ గారు, విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధౌత్రే గారు, విద్యావిధానం ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి రంగన్ గారు, కమిటీలోని గౌరవ సహచర సభ్యులు, ఈ సదస్సులో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మేధావులు, అధ్యాపకులు, సోదర, సోదరీమణులారా.. ఈరోజు మనమంతా.. భారతదేశ భవ్యమైన భవిష్యత్తుకు పునాది వేసే ఓ చరిత్రాత్మక క్షణంలో భాగస్వాములయ్యాం. నూతన యుగానికి పునాదివేసిన అద్భుతమైన క్షణమిది. 21వ శతాబ్దంలో భారతదేశానికి సరికొత్త దిశానిర్దేశం చేసేదే మన నూతన జాతీయ విద్యావిధానం.

మిత్రులారా,
గత మూడు దశాబ్దాల్లో భారతదేశంలోని దాదాపు ప్రతి రంగంలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. ప్రతి వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఈ మూడు దశాబ్దాల్లో మన జీవితాల్లో కూడా ఏదీ గతంలో లాగా లేదు. అన్నీ మారినా మన సమాజానికి భవిష్యత్ మార్గదర్శన చేసే విద్యావిధానం మాత్రం ఇంకా పాతగానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మన తరగతి గదిలోని పాడయిన బ్లాక్ బోర్డ్ ను మార్చడం ఎంత అవసరమో.. మన విద్యావిధానాన్ని మార్చడం కూడా మార్చాల్సిన ఆవశ్యకత ఉంది. పాఠశాలల్లో ఉండే పిన్-అప్ బోర్డులో విద్యార్థుల మార్కులకు సంబంధించిన వివరాలు, వారు వేసిన చిత్రాలు, విద్యార్థులకు చెప్పాల్సిన ముఖ్యమైన ఆదేశాలు మొదలైన వివరాలు పిన్ చేస్తారు. అది నిండిపోయిన తర్వాత అవన్నీ తీసేసి.. కొత్త వివరాలను పిన్ చేయాల్సి వస్తుంది. నూతన జాతీయ విద్యావిధానం కూడా అలాంటిదే.

నూతన జాతీయ విద్యావిధానం కూడా భారతదేశ సరికొత్త ఆశలు, ఆకాంక్షలు, అవకాశాలను సుసంపన్నం చేసుకునేందుకు ఓ చక్కటి వేదిక. దీన్ని రూపొందించడం వెనక.. ప్రతి ప్రాంతం, ప్రతి రంగం, ప్రతి భాషకు చెందిన నిపుణులు, మేధావుల నాలుగైదేళ్లుగా పగలు, రాత్రి తేడాలేకుండా చేసిన కఠోరమైన శ్రమ దాగి ఉంది. అయినా ఈ పని ఇంకా పూర్తవలేదు. అసలు పని ఇప్పుడే మొదలైంది. అదే మన నూతన జాతీయ విద్యావిధానాన్ని ప్రభావవంతంగా అమలుచేయడం. ఈ పని మనమంతా కలిసి చేయాల్సి ఉంటుంది. ఈ విద్యావిధానాన్ని ప్రకటించిన. తర్వాత మీలో చాలా మందిలో.. ఈ విద్యావిధానం అంటే ఏంటి? గతంలో ఉన్నదానితో పోలిస్తే దీనికున్న తేడా ఏంటి? పాఠశాలు, కళాశాలల వ్యవస్థలో ఏమేం మార్పులు వస్తాయి? ఇందులో అధ్యాపకుల కోసం ఏముంది? విద్యార్థుల కోసం ఏముంది? అన్నింటికంటే ముఖ్యంగా.. దీన్ని విజయవంతంగా అమలుచేయడానికి మనమేం చేయాలి? వంటి చాలా ప్రశ్నలు తలెత్తాయని నాకు తెలుసు. ఇవన్నీ సహేతుకమైనవి. వీటి గురించి ఆలోచించడం కూడా తప్పనిసరి. అందుకే మనమంతా ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం.. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చించుకుంటాం. నిన్న మీ మధ్య గంటల తరబడి వివిధ అంశాలపై మేధోమధనం జరిగిందని నాకు చెప్పారు.

టీచర్లు వారి అంచనాల ప్రకారం బోధనా సామాగ్రిని సిద్ధం చేసుకోవడం.  విద్యార్థులు మీ బొమ్మల మ్యూజియంను తయారు చేసుకోవడం.. తల్లిదండ్రులతో అనుసంధానానికి పాఠశాలల్లో సామాజిక గ్రంథాలయం అవసరం.. చిత్రాలతోపాటు బహుభాషా నిఘంటువు అందుబాటులో ఉంచాల్సిన ఆవశ్యకత.. పాఠశాలలోనే వంటగది, ఉద్యానవనం ఉండటం వంటి ఎన్నో అంశాలపై మీ మధ్య చర్చ జరిగింది. దీనికి సంబంధించి భిన్నమైన ఆలోచనలు వచ్చాయి. చాలా మంచి మార్పు ఇది. ఈ విద్యావిధానాన్ని అమలుచేసేందుకు ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు ఉత్సాహంగా పలుపంచుకుంటుండం  అన్నింటికంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోంది.

నూతన విద్యావిధానాన్ని అమలుచేసేందుకు కొన్నిరోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ.. దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లను.. మైగవ్ పోర్టల్ ద్వారా సలహాలు, సూచలను ఇవ్వాలని కోరింది. ఒక వారంలోపే.. 15లక్షలకు పైగా సూచలను అందాయి. ఆ సూచలను.. జాతీయ విద్యావిధానాన్ని మరింత ప్రభావవంతంగా మార్చేందుకు దోహదపడతాయి. ఈ విషయంలో మరింత పకడ్బందీగా ముందుకు వెళ్లేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

మిత్రులారా,
ఏ దేశాభివృద్ధిలోనైనా ఆ దేశ యువతరం, యువశక్తి పోషించే పాత్ర అత్యంత కీలకం. కానీ ఆ యువశక్తి నిర్మాణం బాల్యంనుంచే ప్రారంభం అవుతుంది. వారి బాల్యంలో నేర్పించేది, నేర్చుకునేదే వారి భవిష్యత్ జీవనం ఎలా ఉండాలనేది నిర్ణయిస్తుంది. చిన్నారులకు చెప్పే చదువు, వారి చుట్టూ ఉండే వాతావరణం ఆధారంగానే.. భవిష్యత్తులో ఓ వ్యక్తిగా ఎలా ఉంటాడు? ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది నిర్ధారితం అవుతుంది. అందుకే నూతన జాతీయ విద్యావిధానంలో అలాంటి పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని నిర్మించేందుకు అనువైన చదువును నేర్పించడంపైనే.. దృష్టి కేంద్రీకరించడం జరిగింది. పూర్వ-ప్రాథమిక పాఠశాలలో.. చిన్నారి తొలిసారి తన తల్లిదండ్రుల వద్ద ప్రేమగా పెరిగిన తర్వాత మొదటిసారి బయటకు రావడం మొదలవుతుంది. చిన్నారి తన భావనలను, తనలో ఉన్న నైపుణ్యాన్ని అంతకుముందుకంటే బాగా అర్థం చేసుకునేందుకు అదే అత్యంత అనువైన సమయం. అందుకోసం చిన్నారులకు – సరదాగా, ఆడుతూ పాడుతూ అభ్యసించడం, ఓ పని చేస్తూ దాని ద్వారా నేర్చుకోవడం, ఆవిష్కరణాభ్యాసం వంటివాటిని నేర్పించే చక్కటి వాతావరణాన్ని నిర్మించేటటువంటి పాఠశాలల అవసరముంది.

కరోనా సమయంలో ఇదంతా ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తున్న సంగతి నాకు అర్థమైంది. ఇది ఆలోచించడం కంటే అమల్లో పెట్టడంపై ఆదారపడి ఉంటుంది. అటు కరోనాతో నెలకొన్న పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉండదు. పిల్లలు ఒక్కో తరగతి పెరుగుతున్న కొద్దీ వారిలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న భావన పెరగాలి. వారి మనసు, ఆలోచన వైజ్ఞానిక, తార్కిక పద్ధతిలో ఆలోచించడం ప్రారంభమవ్వాలి. వారి ఆలోచన గణితశాస్త్రంలో.. అమలులో విజ్ఞానశాస్త్రం కనిపించేంత పరిపక్వత రావాలి. ఇది అత్యంత ఆవశ్యకం. వారి ఆలోచనలో గణితశాస్త్రం ఉండాలంటే.. కేవలం గణితం విషయంలోని సమస్యలను పరిష్కరించడమే కాదు.. ఇది ఒకరమైన ఆలోచనా పద్ధతి. ఇలాంటి ఆలోచన పద్ధతులను విద్యార్థులకు నేర్పించాలి. ప్రతి అంశాన్ని.. గణిత, తార్కికరూపంలో అర్థం చేసుకునో దృష్టికోణమది. అలాంటప్పుడు ఒక అంశాన్ని మన మెదడు వేర్వేరు కోణాల్లో విశ్లేషించుకునేందుకు వీలుంటుంది. మనస్సు, మెదడు మధ్య సమన్వయం కోసం ఈ దృష్టికోణాన్ని అలవర్చుకోవడం మంచిది. అందుకోసమే నూతన జాతీయ విద్యవిధానం.. వివిధ దృష్టికోణాలపై ఎక్కువ దృష్టిపెట్టింది. మనలో కొంతమంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఇలాంటివి మన పాఠశాలలో ముందునుంచే అమలుచేస్తున్నామే అనే ప్రశ్న ఉత్పన్నమవ్వొచ్చు. కానీ చాలా పాఠశాలల్లో ఇలాంటివేవీ ఉండవు. అందుకే అందరికీ సమానత్వం అందాలనే ఈ ప్రయత్నం. అది చాలా అవసరం. నేను ఇవాళ మీతో ఇంత విస్తారంగా, ప్రతి చిన్న అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించేందుకు ఇది కూడా ఓ కారణం.

నూతన విద్యావిధానంలో మొన్నటివరకున్న 10+2 విధానానికి బదులుగా 5+3+3+4 వ్యవస్థను తీసుకురావడం చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఇందులో భాగంగా ప్రారంభ బాల్య సంరక్షణతోపాటు విద్యకు పునాదులను వేయడానికి బాగుంటుంది. మనం గమనిస్తే.. పట్టణాలు, నగరాల్లో ప్రయివేటు పాఠశాల్లోనే ప్లే-స్కూల్ రూపంలో విద్య అందుతోంది. కానీ ఇప్పుడు ఈ విధానం గ్రామాలకు చేరుతుంది.. పేద, ధనిక అంతరాల్లేకుండా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రాథమిక విద్యపై దృష్టిపెట్టడం ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యం. నూతన విద్యావిధానం ప్రకారం.. అక్షరాస్యతకు పునాది, అంకెలు మొదలైన వాటిపై అవగాహన కల్పించడాన్ని ఓ జాతీయ మిషన్‌గా తీసుకెళ్లబోతున్నాం. ప్రాథమిక భాషలో పరిజ్ఞానం, అంకెలు-సంఖ్యల్లో పరిజ్ఞానం, సులభమైన లేఖలు, కథలను చదివి, అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని పిల్లల్లో పెంపొందించడం చాలా ముఖ్యం. దీని వల్ల చిన్నారి భవిష్యత్తులో నేర్చుకునేందుకు చదవడం అలవాటవుతుంది. అందుకోసం ప్రారంభస్థాయిలోనే పిల్లలకు చదవడాన్ని నేర్పించాలి. ఇదంతా అక్షరాస్యతకు పునాది, అంకెలను నేర్పించడం ద్వారానే సాధ్యమవుతుంది.

కరోనా సమయంలో ఇదంతా ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తున్న సంగతి నాకు అర్థమైంది. ఇది ఆలోచించడం కంటే అమల్లో పెట్టడంపై ఆదారపడి ఉంటుంది. అటు కరోనాతో నెలకొన్న పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉండదు. పిల్లలు ఒక్కో తరగతి పెరుగుతున్న కొద్దీ వారిలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న భావన పెరగాలి. వారి మనసు, ఆలోచన వైజ్ఞానిక, తార్కిక పద్ధతిలో ఆలోచించడం ప్రారంభమవ్వాలి. వారి ఆలోచన గణితశాస్త్రంలో.. అమలులో విజ్ఞానశాస్త్రం కనిపించేంత పరిపక్వత రావాలి. ఇది అత్యంత ఆవశ్యకం. వారి ఆలోచనలో గణితశాస్త్రం ఉండాలంటే.. కేవలం గణితం విషయంలోని సమస్యలను పరిష్కరించడమే కాదు.. ఇది ఒకరమైన ఆలోచనా పద్ధతి. ఇలాంటి ఆలోచన పద్ధతులను విద్యార్థులకు నేర్పించాలి. ప్రతి అంశాన్ని.. గణిత, తార్కికరూపంలో అర్థం చేసుకునో దృష్టికోణమది. అలాంటప్పుడు ఒక అంశాన్ని మన మెదడు వేర్వేరు కోణాల్లో విశ్లేషించుకునేందుకు వీలుంటుంది. మనస్సు, మెదడు మధ్య సమన్వయం కోసం ఈ దృష్టికోణాన్ని అలవర్చుకోవడం మంచిది. అందుకోసమే నూతన జాతీయ విద్యవిధానం.. వివిధ దృష్టికోణాలపై ఎక్కువ దృష్టిపెట్టింది. మనలో కొంతమంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఇలాంటివి మన పాఠశాలలో ముందునుంచే అమలుచేస్తున్నామే అనే ప్రశ్న ఉత్పన్నమవ్వొచ్చు. కానీ చాలా పాఠశాలల్లో ఇలాంటివేవీ ఉండవు. అందుకే అందరికీ సమానత్వం అందాలనే ఈ ప్రయత్నం. అది చాలా అవసరం. నేను ఇవాళ మీతో ఇంత విస్తారంగా, ప్రతి చిన్న అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించేందుకు ఇది కూడా ఓ కారణం.

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Agri, processed food exports buck Covid trend, rise 22% in April-August

Media Coverage

Agri, processed food exports buck Covid trend, rise 22% in April-August
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi arrives in Washington
September 23, 2021
షేర్ చేయండి
 
Comments

Prime Minister Narendra Modi arrived in Washington. In the USA, PM Modi will take part in a wide range of programmes, hold talks with world leaders including President Joe Biden, VP Kamala Harris and address the UNGA. The PM will also participate in the first in-person Quad Summit during this visit.