· ప్రాచీన రాతప్రతుల డిజిటలీకరణ.. పరిరక్షణ.. సార్వత్రిక లభ్యత లక్ష్యంగా ప్రత్యేక డిజిటల్ వేదిక ఏర్పాటు
· న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రధాని ప్రసంగం
· “భారతీయ సంస్కృతి-సాహిత్య.. చైతన్య గళం జ్ఞాన భారతం మిషన్”
· “ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో భారత్‌ వద్ద దాదాపు కోటి రాతప్రతులు”
· “చరిత్రలో కోట్లాది రాతప్రతులు ధ్వంసమైనా ‘జ్ఞానం.. విజ్ఞానం.. అధ్యయనం’పై మన పూర్వికుల అంకితభావాన్ని మిగిలిన రాతప్రతులు వెల్లడిస్తున్నాయి”
· “మన జ్ఞాన సంప్రదాయానికి ‘పరిరక్షణ.. ఆవిష్కరణ.. సంకలనం.. అనుసరణ’ నాలుగు మూలస్తంభాలు”
· “భారత చరిత్ర కేవలం రాజవంశాల ఉత్థానపతనాలకు పరిమితం కాదు”
· “భారత్‌ అంటేనే- ఆలోచనలు.. ఆదర్శాలు.. విలువలతో కూడిన నిరంతర సజీవ స్రవంతి”

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారు, విద్యావేత్తలు, సోదరీసోదరులారా!

 

భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్‌ భవన్‌ సాక్ష్యంగా నిలుస్తోంది. కొద్ది రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం ప్రకటన చేసినప్పటికీ.. స్వల్ప వ్యవధిలోనే ఈ అంతర్జాతీయ సదస్సును మనం నిర్వహించుకోవడం నిజంగా అద్భుతమైన విషయం. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో ముడిపడిన పోర్టల్‌ను కూడా మనం ప్రారంభించుకున్నాం. ఇది ప్రభుత్వ కార్యక్రమమో.. విద్యా వ్యవస్థ సంబంధిత కార్యక్రమమో కాదు. భారతీయ సంస్కృతి-సాహిత్యం, చైతన్య గళంగా ఈ జ్ఞాన భారతం ఆవిర్భవిస్తుంది. వేల తరాల ఆలోచనలు, చింతనలు, దేశంలోని గొప్ప రుషులు, పండితుల జ్ఞానం, పరిశోధన, మన జ్ఞాన సంప్రదాయాలు, మన శాస్త్రీయ వారసత్వం అన్నింటినీ జ్ఞాన భారతం మిషన్ ద్వారా డిజిటలైజ్ చేయబోతున్నాం. ఈ మిషన్ కోసం దేశవాసులందరికీ నా అభినందనలు. జ్ఞాన భారతం బృందానికి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు కూడా నా శుభాకాంక్షలు.

మిత్రులారా,

ఒక ప్రాచీన రాతప్రతిని పరిశీలించడమంటే గడిచిన కాలంలోకి ప్రయాణించడం వంటిదే. గతం-వర్తమానంలోని పరిస్థితుల మధ్య వ్యత్యాసం అపారం. నేడు కీబోర్డులో ఉండే తొలగింపు- దిద్దుబాటు వంటి సౌలభ్యాల ద్వారా విస్తృతంగా రాయగలం, ఒకే పేజీని ప్రింటర్ల సహాయంతో వేల కాపీలు కూడా తీయగలం. అదే శతాబ్దాల కిందటి ప్రపంచాన్ని ఒకసారి ఊహించుకోండి. నాడు ఆధునిక భౌతిక సదుపాయాలు లేనందువల్ల మన పూర్వికులు మేధస్సు సంబంధిత వనరులపైనే ఆధారపడాల్సి వచ్చేది. ప్రతి అక్షరాన్నీ అత్యంత శ్రద్ధతో రాయాల్సి ఉండేది. ఆ లెక్కన ఒక గ్రంథం పూర్తి చేయాలంటే వారు ఎంత కఠినమైన శ్రమ చేసేవారో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ప్రాచీన కాలంలోనూ భారతీయులు ప్రపంచ జ్ఞాన కేంద్రాలుగా వెలుగొందిన గొప్ప గ్రంథాలయాలను నిర్మించారు. ప్రపంచంలో ఇప్పటికీ అత్యధిక రాతప్రతులు గల దేశం భారత్‌ మాత్రమే. మన వద్ద నేడు దాదాపు కోటి రాతప్రతులు ఉన్నాయి. ఇది చిన్న సంఖ్య కాదు.

 

మిత్రులారా, 

క్రూరమైన చారిత్రక ఆటుపోట్ల ఫలితంగా లక్షలాది రాతప్రతులు నాశనం కావడంతోపాటు అదృశ్యమయ్యాయి. అయినప్పటికీ జ్ఞానం.. విజ్ఞానం.. అధ్యయనంపై మన పూర్వికుల అంకితభావానికి మన వద్ద మిగిలిన రాతప్రతులే తార్కాణాలు. గ్రంథ రచనలో వాడిన భూర్జ పత్రాలు, తాటి ఆకుల దుర్బలత్వంతోపాటు.. రాగి రేకులపై రాసినా లోహ క్షయం ముప్పు వంటివి పెనుసవాళ్లుగా ఉండేవి. మన పూర్వికులు అక్షరాన్ని దైవంగా పరిగణించి, గౌరవించారు. ‘అక్షర బ్రహ్మ భవ’ స్ఫూర్తితో ఆ సరస్వతీ మాతను ఆరాధారించారు. ఆ గ్రంథాల విలువను గుర్తించిన కుటుంబాలు తరతరాలుగా నాటి రాతప్రతులను జాగ్రత్తగా సంరక్షిస్తూ వస్తున్నాయి. మనకు వారసత్వంగా సంక్రమించిన జ్ఞానంపై గల అపార గౌరవానికి ఇదే నిదర్శనం. ఈ స్ఫూర్తితో మన సామాజిక బాధ్యతను గుర్తించడంతోపాటు భావితరాలపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. దేశం పట్ల అంకితభావంలో నిబద్ధతకు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ మరేదీ ఉండదు.

మిత్రులారా, 

భారత జ్ఞాన సంప్రదాయం ‘పరిరక్షణ, ఆవిష్కరణ, సంకలనం, అనుసరణ’ అనే నాలుగు మూలస్తంభాలు ఆధారంగా నేటికీ సుసంపన్నంగా విలసిల్లుతోంది.

మిత్రులారా, 

ఈ నాలుగు స్తంభాల్లో మొదటిదైన పరిరక్షణ గురించి చెప్పాలంటే.. అత్యంత ప్రాచీన గ్రంథాలైన మన వేదాలు భారతీయ సంస్కృతికి పునాదిగా ఉన్నాయి. వేదాలు అత్యున్నతమైనవి. ఆ కాలంలో వేదాలను ‘శ్రుతి’ ప్రాతిపదికన తదుపరి తరానికి అందించారు. ఆ విధంగా వేల ఏళ్ల నుంచీ సంపూర్ణ ప్రామాణికతతో దోషరహితంగా వేదాలను పరిరక్షించారు. ఇక రెండో స్తంభమైన ఆవిష్కరణ విషయానికొస్తే.. ఆయుర్వేద, వాస్తు, జ్యోతిష, లోహ శాస్త్రాల్లో భారత్‌ నిరంతర ఆవిష్కరణలు చేస్తూనే ఉంది. ప్రతి తరం ఇలా మునుపటి తరంకన్నా మరింత ముందుకు సాగుతూ.. ప్రాచీన జ్ఞానాన్ని మరింత శాస్త్రీయంగా రూపుదిద్దింది. ‘సౌర సిద్ధాంతం’, ‘వరాహమిహిర సంహిత’ వంటి గ్రంథాలు పండితుల నిరంతర కృషికి, సరికొత్త జ్ఞానాన్ని జోడించడానికి చక్కటి ఉదాహరణలు. మూడో స్తంభమైన సంకలనం గురించి చూస్తే.. ప్రతి తరం పురాతన విజ్ఞాన పరిరక్షణ సహా కొత్త ఆలోచనా దృక్పథాన్ని జోడిస్తూ వచ్చింది. వాల్మీకి రామాయణ రచనానంతరం అనేక మంది రామాయణ రచన చేయడమే దీనికి మంచి ఉదాహరణ. ఈ సంప్రదాయం నుంచి ‘రామచరితమానస్’ వంటి గ్రంథాలు మనకు లభించాయి. అలాగే వేదాలు, ఉపనిషత్తులపై వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. మరోవైపు భారత ఆధ్యాత్మిక ఆచార్యులు ద్వైతం, అద్వైతం వంటి బోధనలు మనకు అందించారు.

 

మిత్రులారా, 

ఇదేవిధంగా, నాలుగో మూలస్తంభం అనుసరణ. కాలక్రమంలో భారత్‌ ఆత్మపరిశీలన చేసుకుంటూ తన జ్ఞానానికి అవసరమైన మార్పుచేర్పులు చేసింది. మనం చర్చలకు ప్రాధాన్యమిస్తూ, శాస్త్రార్థ సంప్రదాయాన్ని కొనసాగించాం. సమాజం కాలం చెల్లిన ఆలోచన దృక్పథానికి స్వస్తి చెప్పి కొత్త దృక్కోణాలను స్వీకరించింది. మధ్యయుగాల్లో వివిధ సామాజిక దురాచారాలు తలెత్తినపుడు సంఘసంస్కర్తలు ఉద్భవించి సమాజాన్ని చైతన్యం చేశారు, వారసత్వాన్ని పరిరక్షించారు.

మిత్రులారా, 

జాతీయతపై ఆధునిక భావనలకు భిన్నంగా భారతదేశానికి తనదైన విశిష్ట సాంస్కృతిక గుర్తింపు, చైతన్యం, జవజీవాలున్నాయి. మన దేశ చరిత్ర కేవలం రాజవంశాల గెలుపోటముల జాబితాకు పరిమితం కాలేదు. కాలక్రమంలో రాజ్యాలు, రాచరికాల భౌగోళిక స్వరూపం మారినా భారతదేశం మాత్రం హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం దాకా చెక్కుచెదరకుండా నిలిచింది. భారత్‌ అంటేనే- ఆలోచనలు, ఆదర్శాలు, విలువలతో కూడిన నిరంతర సజీవ స్రవంతి. ఈ నాగరకత నిరంతర పయనాన్ని భారత ప్రాచీన రాతప్రతులు ప్రతిబింబిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని కూడా ఇవి స్పష్టం చేస్తాయి. దేశవ్యాప్తంగా దాదాపు 80 భాషల్లో రాతప్రతులు ఉన్నాయి. భారత విస్తృత జ్ఞాన సంద్రంలోని సంస్కృత, ప్రాకృత, అస్సామీ, బెంగాలీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మరాఠీ వంటి పలు భాషల్లో అనేక పరిరక్షిత గ్రంథాలున్నాయి. గిల్గిట్ రాతప్రతులు కాశ్మీర్‌పై ప్రామాణిక రీతిలో చారిత్రక అవగాహన కల్పిస్తాయి. కౌటిల్యుడి అర్థశాస్త్రం రాతప్రతి భారత రాజకీయ-ఆర్థిక శాస్త్రాలపై లోతైన అవలోకనానికి వీలు కల్పిస్తుంది. ఆచార్య భద్రబాహు రచించిన ‘కల్పసూత్ర’ రాతప్రతి జైనమత ప్రాచీన జ్ఞాన పరిరక్షణకు తోడ్పడింది. సారనాథ్ రాతప్రతులు బుద్ధుని ప్రబోధాలను వివరిస్తాయి. ‘రసమంజరి, గీతా గోవిందం’ వంటి రాతప్రతులు భక్తి, సౌందర్యం, సాహిత్యం వంటి విభిన్న వన్నెల పరిరక్షణకు చిహ్నాలు.

 

మిత్రులారా, 

భారత రాతప్రతులు యావత్‌ మానవాళి ప్రగతి పయనానికి ప్రతిబింబాలు. ఇవి భారతీయ తత్త్వ, విజ్ఞానశాస్త్ర భాండాగారాలు. వైద్యం, అధిభౌతిక శాస్త్రం సహా కళా, ఖగోళ, వాస్తు శిల్ప జ్ఞానాన్ని కూడా అవి పరిరక్షించాయి. గణితం నుంచి ద్విసంఖ్యామానం ఆధారిత కంప్యూటర్ సైన్స్ వరకూ ఆధునిక శాస్త్ర పునాది సున్నా భావనపైనే ఆధారపడింది. ఇందుకు అనేకానేక ఉదాహరణలున్నాయి. సున్నా భారత ఆవిష్కరణే. సున్నాతోపాటు ప్రాచీన గణిత సూత్ర వినియోగానికి బక్షాలి రాతప్రతుల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇక యశోమిత్ర బోవర్ రాతప్రతులు శతాబ్దాల నాటి వైద్యశాస్త్రంపై అవగాహన కలిగిస్తాయి. చరక సంహిత, శుశ్రుత సంహిత వంటి గ్రంథాల రాతప్రతులు ఆయుర్వేద విజ్ఞానాన్ని నేటికీ పరిరక్షిస్తున్నాయి. శుల్వ లేదా శుల్బ సూత్రం పురాతన రేఖాగణిత జ్ఞానాన్ని అందించగా, సంప్రదాయ వ్యవసాయ జ్ఞానం కృషి పరాశరం నుంచి మనకు సంక్రమించింది. మరోవైపు మానవ భావోద్వేగ పురోగమనాన్ని అర్థం చేసుకోవడంలో నాట్య శాస్త్ర రాతప్రతులు ఎంతగానో తోడ్పడతాయి.

మిత్రులారా, 

ప్రతి దేశం తమ చారిత్రక సంపదను వారి నాగరికత గొప్పదనానికి సంకేతంగా ప్రపంచానికి ప్రదర్శిస్తుంది. వారు కనీసం ఒక రాతప్రతిని లేదా కళాఖండాన్ని జాతీయ సంపదగా పరిగణించి భద్రపరుస్తారు. మన దేశ రాతప్రతుల సంపద అపారమైనది. ఇవి జాతీయ ప్రతిష్టకు నిదర్శనం. కువైట్‌ పర్యటనలో నేను 4-6 మంది ప్రభావశీలురను కలవాలనుకున్నాను. సమయం దొరికితే కొంత సమయం వారితో మాట్లాడాలని భావించాను. వారి ఆలోచనలను అర్థం చేసుకోవాలని అనుకున్నాను. అక్కడ నేను ఒక వ్యక్తిని కలిశాను. భారత ప్రాచీన సముద్ర వాణిజ్య మార్గాలను వివరించే చారిత్రక పత్రాలను ఆయన పెద్ద సంఖ్యలో సేకరించి భద్రపరిచారు. శతాబ్దాల కిందటే భారత సముద్ర వాణిజ్యం నిర్వహించిన తీరును వివరించే సరంజామాతో ఆయన సగర్వంగా నన్ను కలిశారు. ప్రపంచ దేశాలతో భారత్‌ ప్రగాఢ స్నేహ సంబంధాలను, సరిహద్దుల వెంబడి మన దేశానికి గల గౌరవాన్ని ఇలాంటి రాతప్రతులు ప్రతిబింబిస్తాయి. చెల్లాచెదరుగాగల ఈ సంపదను విస్తృత జాతీయ కృషితో పరిరక్షించి, సమగ్రం చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఇటువంటి రికార్డులు ఎప్పుడు... ఎక్కడ దొరికినా కూడా భారత నాగరికత వారసత్వంలో భాగంగా వాటిని పరిరక్షించి, డిజిటలీకరణ ద్వారా పదిలం చేసుకోవాలి. భారత్‌ ప్రపంచ విశ్వాసాన్ని చూరగొన్న నేపథ్యంలో మన దేశాన్ని స్వీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, గౌరవాన్ని పదిలం చేసుకోగల సముచిత ప్రదేశంగా అనేక దేశాలు పరిగణిస్తున్నాయి. లోగడ అపహరణకు గురై తమ దేశాలకు చేరిన కొన్ని భారతీయ విగ్రహాలను మాత్రమే వారు తిరిగి ఇచ్చారు. ఇప్పుడు వందలాది ప్రాచీన విగ్రహాలను ఆయా దేశాలు మనకు తిరిగి ఇస్తున్నాయి. ఇదంతా ఏదో భావోద్వేగంతోనో.. సానుభూతితోనో కాకుండా విశ్వసనీయత ప్రాతిపదికన సాగుతోంది. భారత్‌ తన సాంస్కృతిక విలువల సగౌరవ పరిరక్షణ, విస్తృతికి కృషి చేస్తుందని అన్ని దేశాలూ నమ్ముతున్నాయి. ప్రపంచం దృష్టిలో భారత్‌ విశ్వసనీయ వారసత్వ పరిరక్షక దేశంగా నిలిచింది. నేను మంగోలియా పర్యటన సమయంలో అక్కడి బౌద్ధ సన్యాసులతో మాట్లాడినప్పుడు వారు సేకరించిన గొప్ప రాతప్రతులను పరిశీలించాను. ఆ రాతప్రతులపై అధ్యయనం కోసం వారి అనుమతి కోరాను. అనంతరం వాటిని భారత్‌కు తెచ్చి, డిజిటలీకరణ పూర్తి చేసి వాటి ప్రతులను సగౌరవంగా వారికి తిరిగి అందించాం. ఇప్పుడు అవి వారికి గొప్ప సంపదగా ఉన్నాయి.

 

ఈ గొప్ప కార్యక్రమాల్లో జ్ఞాన భారతం మిషన్ ఒక ముఖ్యమైన భాగం. ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో దేశంలోని అనేక సంస్థలు ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. కాశీ నగరి ప్రచారణి సభ, కోల్‌కతా ఆసియాటిక్ సొసైటీ, ఉదయపూర్‌లోని 'ధరోహర్', గుజరాత్‌ రాష్ట్రం కోబాలోని ఆచార్య శ్రీ కైలాశసురి జ్ఞాన మందిర్, హరిద్వార్‌లోని పతంజలి, పుణేలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, తంజావూరులోని సరస్వతీ మహల్ గ్రంథాలయం వంటి వందలాది సంస్థల సహకారంతో ఇప్పటివరకు పది లక్షలకు పైగా రాతప్రతులు డిజిటలీకరణ అయ్యాయి. దేశంలో చాలా మంది ముందుకొచ్చి తమ కుటుంబ వారసత్వ సంపదను దేశం కోసం అందుబాటులో ఉంచారు. ఇలాంటి అన్ని సంస్థలకు, వ్యక్తులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఒక అంశంపై దృష్టి సారించాలనుకుంటున్నాను. నేను ఇటీవల కొంతమంది జంతు ప్రేమికులను కలిశాను. మీరు ఎందుకు నవ్వుతున్నారు... మన దేశంలో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. విశేషం ఏంటంటే వారు ఆవును పశువుగా పరిగణించరు. వారితో మాట్లాడుతున్నప్పుడు నేను ‘మన దేశంలో పశువుల చికిత్స గురించి పురాతన గ్రంథాల్లో ఉందని, ఇందుకు సంబంధించిన చాలా రాతప్రతులు ఉన్నాయని’ చెప్పాను. నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు, అక్కడి ఆసియా సింహాలపై నాకు ఆసక్తి ఉండేది. నేను వాటిపై చాలా మక్కువ చూపించేవాడిని. అవి ఎక్కువగా తిని ఇబ్బందుల్లో పడినపుడు, ఒక చెట్టు పండ్లను తినాలని వాటికి తెలుసు. అవి తినడం ద్వారా వాంతి అవుతుంది. ఇది ఆ జంతువుకు తెలుసని నేను అప్పుడు తెలుసుకున్నాను. దీని అర్థం ఏంటంటే సింహాల స్థావరాలు ఉన్న చోట అటువంటి పండ్ల చెట్లు ఉండటం అవసరం. దీని గురించి మన గ్రంథాలలో ఉంది. ఈ విషయాలన్నీ పొందుపర్చిన అనేక రాతప్రతులు మన దగ్గర ఉన్నాయి. నేను చెప్పదలచుకున్నది ఏంటంటే.. మనకు చాలా జ్ఞానం అందుబాటులో ఉంది. అది రాతపూర్వకంగా ఉంది. మనం దానిని శోధించి అన్వేషించాలి. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మనం వాటిని అర్థం చేసుకోవాలి.

 

మిత్రులారా,

 

భారతదేశం ఎప్పుడూ తన జ్ఞానాన్ని ధనరూపంలో వెలకట్టలేదు. మన రుషులు కూడా ‘విద్యా దాన్ మనతః పరమ్’ అన్నారు. ‘అన్ని దానాలలోనూ జ్ఞానదానమే గొప్పది’ అని దీని అర్థం. అందుకే ప్రాచీన కాలంలో భారత ప్రజలు కూడా స్వేచ్ఛగా రాతప్రతులను దానం చేశారు. చైనా యాత్రికుడు హుయెన్ త్సాంగ్ భారతదేశానికి వచ్చినప్పుడు తనతో పాటు ఆరు వందల యాభైకి పైగా రాతప్రతులను తీసుకెళ్లాడు. నేను జన్మించిన వాద్నగర్‌లో ఆయన చాలా కాలం పాటు ఉన్నారని చైనా అధ్యక్షుడు ఒకసారి నాతో చెప్పారు. ఇక్కడి నుంచి చైనాకు తిరిగి వెళ్లాక ఆయన అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ జన్మించిన ప్రాంతంలో నివసించాడు. అధ్యక్షుడు నన్ను ఆయన గ్రామానికి తీసుకెళ్లాడు. నేను హుయెన్ త్సాంగ్ నివాస స్థలాన్ని చూసేందుకు ఆయనతో కలిసి వెళ్లాను. అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నాకు రాతప్రతులను పూర్తి వివరంగా చూపించాడు. దానిలో భారత్‌ గురించి వివరించే కొన్ని అంశాలున్నాయి. వాటిని అక్కడి వ్యాఖ్యాత నాకు వివరించాడు. ఇది నన్ను చాలా ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క దానిని చూసి అందులో ఏ నిధి ఉందో ఆలోచించాను. భారతదేశానికి చెందిన అనేక రాతప్రతులు ఇప్పటికే చైనా నుంచి జపాన్‌కు చేరుకున్నాయి. 7వ శతాబ్దంలో జపాన్‌లో వాటిని హోర్యుజి ఆశ్రమంలో జాతీయ సంపదగా భద్రపరిచారు. భారతదేశ పురాతన రాతప్రతులు నేటికీ ప్రపంచంలోని అనేక దేశాలలో భద్రంగా ఉన్నాయి. జ్ఞాన భారతం మిషన్ కింద మానవాళికి సంబంధించి ఈ ఉమ్మడి వారసత్వాన్ని ఏకం చేయడానికి కూడా మేం కృషి చేస్తాం.

 

మిత్రులారా,

 

జీ-20 సాంస్కృతిక వేదికపై చర్చల సందర్భంగా ఈ కృషికి మేం శ్రీకారం చుట్టాం. భారత్‌తో శతాబ్దాల నుంచి సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్న దేశాలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకున్నాయి. తిరిగి ముద్రించిన మంగోలియా ‘కంజుర్’ సంపుటాలను మంగోలియా రాయబారికి మేం బహుకరించాం. అలాగే 2022లో మంగోలియాతో పాటు రష్యాలోని బౌద్ధ ఆరామాలకు 108 సంపుటాలను అందజేశాం. థాయిలాండ్, వియత్నాంలలోని విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాం. పాత రాతప్రతులను డిజిటలీకరించేందుకు మేం అక్కడి నిపుణులకు శిక్షణ ఇస్తున్నాం. ఈ కృషి ఫలితంగా పాళీ, లన్నా, చామ్ భాషలలోని అనేక రాతప్రతులు డిజిటలీకరణ అయ్యాయి. జ్ఞాన భారతం మిషన్ ద్వారా మేం ఈ కార్యక్రమాలను మేం మరింత విస్తృతం చేస్తాం.

 

మిత్రులారా,

 

జ్ఞాన భారతం మిషన్ ద్వారా మరో పెద్ద సమస్య కూడా పరిష్కారమౌతుంది. శతాబ్దాలుగా మనం ఉపయోగిస్తోన్న భారతదేశ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలోని ముఖ్యమైన అనేక అంశాలను సంబంధించిన సమాచారాన్ని ఇతరులు కాపీ చేసి పేటెంట్ చేశారు. ఈ రకమైన మేధోపరమైన చౌర్యాన్ని అరికట్టటం కూడా అవసరమే. డిజిటల్ రాతప్రతుల ద్వారా ఈ పనులు మరింత ఊపందుకుంటాయి. మేధో పైరసీని అరికట్టొచ్చు. అన్ని అంశాలపై ప్రామాణికతతో కూడిన అసలైన మూలాలను ప్రపంచ కూడా తెలుసుకుంటుంది.

 

మిత్రులారా,

 

జ్ఞాన భారతం మిషన్ మరో ముఖ్యమైన కోణాన్ని కలిగి ఉంది. దీని కోసం పరిశోధన, ఆవిష్కరణల విషయంలో కొత్త సామర్థ్యాల ద్వారాలను మేం తెరుస్తున్నాం. నేడు ప్రపంచంలో దాదాపు రెండున్నర ట్రిలియన్ డాలర్ల విలువైన సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమ ఉంది. డిజిటలీకరణైన రాతప్రతులు ఈ పరిశ్రమకు ఊతమిస్తాయి. మిలియన్ల సంఖ్యలో ఉన్న రాతప్రతులు, వాటిలో దాగి ఉన్న పురాతన జ్ఞానం కూడా ఒక భారీ డేటాబేస్‌గా ఉపయోగపడుతుంది. ఇవి 'సమాచార ఆధారిత ఆవిష్కరణ'లకు కొత్త ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇది సాంకేతికత రంగంలో యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. రాతప్రతుల డిజిటలీకరణ అయినందున విద్యారంగ పరిశోధనకు కొత్త బాటలు పడుతాయి.

 

మిత్రులారా,

 

ఈ డిజిటలీకరణ పూర్తయిన రాతప్రతులను అధ్యయనం చేయడానికి మనం ఏఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించటాన్ని పెంచాలి. ఇక్కడ ప్రజెంటేషన్‌లో చెప్పిన విధంగా ఏఐ మానవ ప్రతిభను లేదా మానవ వనరులను భర్తీ చేయలేదన్న అంశంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ విధమైన భర్తీ జరగకూడదని నేను కోరుకుంటున్నాను. అది జరిగితే మనం కొత్త బానిసత్వానికి బాధితులం అవుతాం. ఏఐ అనేది ఒక మద్దతు వ్యవస్థ. ఇది మనల్ని బలపరుస్తుంది. మన బలాన్ని పెంచుతుంది. మన వేగాన్ని పెంచుతుంది. ఏఐ సహాయంతో ఈ పురాతన రాతప్రతులను లోతుగా అర్థం చేసుకోని విశ్లేషించొచ్చు. ఇప్పుడే చూడండి.. అన్ని వేద గణిత గ్రంథాలు అందుబాటులో లేవు. మనం ఏఐని ఉపయోగించి పని చేస్తే అనేక కొత్త సూత్రాలను కనుగొనే అవకాశం ఉంది. ఈ రాతప్రతులలో ఉన్న జ్ఞానాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చేందుకు ఏఐని ఉపయోగించొచ్చు. మరో సమస్య ఏంటంటే.. మన రాతప్రతులు చెల్లాచెదురుగా ఉన్నాయి. వివిధ కాలాలకు సంబంధించినవి వివిధ రకాలుగా ఉన్నాయి. ఏఐ వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే.. వీటన్నింటినీ సేకరించవచ్చు. వాటి నుంచి అమృతాన్ని చిలికేందుకు మనం చాలా మంచి సాధనాన్ని ఉపయోగించొచ్చు. అంటే 10 చోట్ల పడి ఉన్న వాటిని ఏఐ సహాయంతో ఒకచోట చేర్చి వాటిపై అధ్యయనం చేయొచ్చు. ఒకే పదాన్ని చాలా రకాలుగా ఉపయోగించొచ్చని ప్రారంభంలో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో చెప్పినట్లుగా మనం రాతప్రతులను పరిష్కరించిన తర్వాత ప్రశ్నలను 100కు తగ్గించొచ్చు. నేడు మనం లక్షలాది ప్రశ్నలతో చిక్కుకొని ఉన్నాం. మనం వాటిని 100కి తీసుకొస్తాం. మనం మానవ స్ఫూర్తితో అనుసంధానమైనప్పుడు అది ఫలితాలను తీసుకొస్తుంది. కానీ ఇబ్బందులు చాలా ఉన్నాయి. అయితే మార్గాలు కూడా ఉన్నాయి.

 

మిత్రులారా,

 

దేశంలోని యువత అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను. నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇందులో పాలు పంచుకున్న వారిలో 70 శాతం మంది యువతే అని మంత్రి గారు నాకు చెప్పారు. ఇది దీని విజయానికి అతిపెద్ద సంకేతం అని నేను భావిస్తున్నాను. యువత దీనిపై ఆసక్తి చూపడం ప్రారంభిస్తే.. మనం చాలా త్వరగా విజయం సాధిస్తామని నేను ఖచ్చితంగా చెప్పగలను. సాంకేతికత ద్వారా గతాన్ని ఎలా అన్వేషించగలం? ఈ జ్ఞానాన్ని ఆధారభూత పారామితులపై మానవాళికి ఎలా అందుబాటులోకి తీసుకురావచ్చు? ఈ దిశగా మనం కృషి చేయాలి. మన విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు కూడా దీని కోసం కొత్త కార్యక్రమాలను చేపట్టాలి. నేడు దేశం మొత్తం స్వదేశీ స్ఫూర్తితో, స్వావలంబన భారతదేశం అనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం కూడా దానికి కొనసాగింపే. మన వారసత్వాన్ని మన శక్తి సామర్థ్యాలకు పర్యాయపదంగా మార్చుకోవాలి. జ్ఞాన భారతం మిషన్‌తో భవిష్యత్తుకు సంబంధించిన కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని నేను నమ్ముతున్నాను. ఇవి ఆకర్షణ, మెరుపులేని అంశాలు అని నాకు తెలుసు. కానీ వీటికి చాలా శక్తి ఉంది కాబట్టే శతాబ్దాలుగా ఎవరూ కదిలించలేదు. మనం ఈ శక్తితో అనుసంధానం కావాలి. ఇదే నమ్మకంతో.. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

ఈ గొప్ప కార్యక్రమాల్లో జ్ఞాన భారతం మిషన్ ఒక ముఖ్యమైన భాగం. ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో దేశంలోని అనేక సంస్థలు ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. కాశీ నగరి ప్రచారణి సభ, కోల్‌కతా ఆసియాటిక్ సొసైటీ, ఉదయపూర్‌లోని 'ధరోహర్', గుజరాత్‌ రాష్ట్రం కోబాలోని ఆచార్య శ్రీ కైలాశసురి జ్ఞాన మందిర్, హరిద్వార్‌లోని పతంజలి, పుణేలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, తంజావూరులోని సరస్వతీ మహల్ గ్రంథాలయం వంటి వందలాది సంస్థల సహకారంతో ఇప్పటివరకు పది లక్షలకు పైగా రాతప్రతులు డిజిటలీకరణ అయ్యాయి. దేశంలో చాలా మంది ముందుకొచ్చి తమ కుటుంబ వారసత్వ సంపదను దేశం కోసం అందుబాటులో ఉంచారు. ఇలాంటి అన్ని సంస్థలకు, వ్యక్తులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఒక అంశంపై దృష్టి సారించాలనుకుంటున్నాను. నేను ఇటీవల కొంతమంది జంతు ప్రేమికులను కలిశాను. మీరు ఎందుకు నవ్వుతున్నారు? మన దేశంలో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. విశేషం ఏంటంటే వారు ఆవును జంతువుగా పరిగణించరు. వారితో మాట్లాడుతున్నప్పుడు నేను ‘మన దేశంలో జంతు చికిత్స గురించి గ్రంథాలలో రాసిన జ్ఞానం చాలా ఉందని, చాలా రాతప్రతులు ఉన్నాయని’ చెప్పాను. నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు, అక్కడి ఆసియా సింహాలపై నాకు ఆసక్తి ఉండేది. నేను వాటిపై చాలా మక్కువ చూపించేవాడిని. అవి ఎక్కువగా వేడాడి ఇబ్బందుల్లో ఉంటే ఒక చెట్టు పండ్లను తినాలని వాటికి తెలుసు. తద్వారా వాంతి అవుతుంది. ఇది ఆ జంతువుకు తెలుసని నేను అప్పుడు తెలుసుకున్నాను. దీని అర్థం ఏంటంటే సింహాల స్థావరాలు ఉన్న చోట అటువంటి పండ్ల చెట్లు ఉండటం అవసరం. దీని గురించి మన గ్రంథాలలో ఉంది. ఈ విషయాలన్నీ పొందుపర్చిన అనేక రాతప్రతులు మన దగ్గర ఉన్నాయి. నేను చెప్పదలచుకున్నది ఏంటంటే.. మనకు చాలా జ్ఞానం అందుబాటులో ఉంది. అది రాతపూర్వకంగా ఉంది. మనం దానిని శోధించి అన్వేషించాలి. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మనం వాటిని అర్థం చేసుకోవాలి.

మిత్రులారా, 

భారతదేశం ఎప్పుడూ తన జ్ఞానాన్ని ధనరూపంలో వెలకట్టలేదు. మన రుషులు కూడా ‘విద్యా దనమనతః పరమ్’ అన్నారు. ‘అన్ని దానాలలోనూ జ్ఞానదానమే గొప్పది’ అని దీని అర్థం. అందుకే ప్రాచీన కాలంలో భారత ప్రజలు కూడా స్వేచ్ఛగా రాతప్రతులను దానం చేశారు. చైనా యాత్రికుడు హుయెన్ త్సాంగ్ భారతదేశానికి వచ్చినప్పుడు తనతో పాటు ఆరు వందల యాభైకి పైగా రాతప్రతులను తీసుకెళ్లాడు. నేను జన్మించిన వాద్నగర్‌లో ఆయన చాలా కాలం పాటు ఉన్నారని చైనా అధ్యక్షుడు ఒకసారి నాతో చెప్పారు. ఇక్కడి నుంచి చైనాకు తిరిగి వెళ్లాక ఆయన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ జన్మించిన ప్రాంతంలో నివసించాడు. అధ్యక్షుడు నన్ను ఆయన గ్రామానికి తీసుకెళ్లాడు. నేను హుయెన్ త్సాంగ్ నివాస స్థలాన్ని చూసేందుకు ఆయనతో కలిసి వెళ్లాను. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నాకు రాతప్రతులను పూర్తి వివరంగా చూపించాడు. దానిలో భారత్‌ గురించి వివరించే కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని అక్కడి వ్యాఖ్యాత నాకు వివరించాడు. ఇది నన్ను చాలా ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క దానిని చూసి అందులో ఏ నిధి ఉందో ఆలోచించాను. భారతదేశానికి చెందిన అనేక రాతప్రతులు ఇప్పటికే చైనా నుంచి జపాన్‌కు చేరుకున్నాయి. 7వ శతాబ్దంలో జపాన్‌లో వాటిని హోర్యుజి ఆశ్రమంలో జాతీయ సంపదగా భద్రపరిచారు. భారతదేశ పురాతన రాతప్రతులు నేటికీ ప్రపంచంలోని అనేక దేశాలలో భద్రంగా ఉన్నాయి. జ్ఞాన భారతం మిషన్ కింద మానవాళికి సంబంధించి ఈ ఉమ్మడి వారసత్వాన్ని ఏకం చేయడానికి కూడా మేం కృషి చేస్తాం. 

మిత్రులారా, 

జీ-20 సాంస్కృతిక వేదికపై చర్చల సందర్భంగా ఈ కృషికి మేం శ్రీకారం చుట్టాం. భారత్‌తో శతాబ్దాల నుంచి సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్న దేశాలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకున్నాయి. తిరిగి ముద్రించిన మంగోలియా ‘కంజుర్’ సంపుటాలను మంగోలియా రాయబారికి మేం బహుకరించాం. అలాగే 2022లో మంగోలియాతో పాటు రష్యాలోని బౌద్ధ మఠాలకు 108 సంపుటాలను అందజేశాం. థాయిలాండ్, వియత్నాంలలోని విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాం. పాత రాతప్రతులను డిజిటలీకరించేందుకు మేం అక్కడి నిపుణులకు శిక్షణ ఇస్తున్నాం. ఈ కృషి ఫలితంగా పాళీ, లన్నా, చామ్ భాషలలోని అనేక రాతప్రతులు డిజిటలటీకరణ అయ్యాయి. జ్ఞాన భారతం మిషన్ ద్వారా మేం ఈ కార్యక్రమాలను మేం మరింత విస్తృతం చేస్తాం. 

మిత్రులారా, 

జ్ఞాన భారతం మిషన్ ద్వారా మరో పెద్ద సమస్య కూడా పరిష్కారమౌతుంది. శతాబ్దాలుగా మనం ఉపయోగిస్తోన్న భారతదేశ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలోని ముఖ్యమైన అనేక అంశాలను సంబంధించిన సమాచారాన్ని ఇతరులు కాపీ చేసి పేటెంట్ చేశారు. ఈ రకమైన మేధోపరమైన చౌర్యాన్ని అరికట్టటం కూడా అవసరమే. డిజిటల్ రాతప్రతుల ద్వారా ఈ పనులు మరింత ఊపందుకుంటాయి. మేధో పైరసీని అరికట్టొచ్చు. అన్ని అంశాలపై ప్రామాణికతతో కూడిన అసలైన మూలాలను ప్రపంచ కూడా తెలుసుకుంటుంది. 

మిత్రులారా, 

జ్ఞాన భారతం మిషన్ మరో ముఖ్యమైన కోణాన్ని కలిగి ఉంది. దీని కోసం పరిశోధన, ఆవిష్కరణల విషయంలో కొత్త సామర్థ్యాల ద్వారాలను మేం తెరుస్తున్నాం. నేడు ప్రపంచంలో దాదాపు రెండున్నర ట్రిలియన్ డాలర్ల విలువైన సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమ ఉంది. డిజిటలీకరణైన రాతప్రతుల ఈ పరిశ్రమ విలువ గొలుసులకు ఊతమిస్తాయి. మిలియన్ల సంఖ్యలో ఉన్న రాతప్రతులు, వాటిలో దాగి ఉన్న పురాతన జ్ఞానం కూడా ఒక భారీ డేటాబేస్‌గా ఉపయోగపడుతుంది. ఇవి 'సమాచార ఆధారిత ఆవిష్కరణ'లకు కొత్త ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇది సాంకేతికత రంగంలో యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. రాతప్రతుల డిజిటలీకరణ అయినందున విద్యారంగ పరిశోధనకు కొత్త బాటలు పడుతాయి. 

మిత్రులారా, 

ఈ డిజిటలీకరణ పూర్తైన రాతప్రతులను అధ్యయనం చేయడానికి మనం ఏఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించటాన్ని పెంచాలి. ఇక్కడ ప్రజెంటేషన్‌లో చెప్పిన విధంగా ఏఐ మానవ ప్రతిభను లేదా మానవ వనరులను భర్తీ చేయలేదన్న అంశంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ విధమైన భర్తీ జరగకూడదని నేను కోరుకుంటున్నాను. అది జరిగితే మనం కొత్త బానిసత్వానికి బాధితులం అవుతాం. ఏఐ అనేది ఒక మద్దతు వ్యవస్థ. ఇది మనల్ని బలపరుస్తుంది. మన బలాన్ని పెంచుతుంది. మన వేగాన్ని పెంచుతుంది. ఏఐ సహాయంతో ఈ పురాతన రాతప్రతులను లోతుగా అర్థం చేసుకోని విశ్లేషించొచ్చు. ఇప్పుడే చూడండి.. అన్ని వేద గణిత గ్రంథాలు అందుబాటులో లేవు. మనం ఏఐని ఉపయోగించి పని చేస్తే అనేక కొత్త సూత్రాలను కనుగొనే అవకాశం ఉంది. ఈ రాతప్రతులలో ఉన్న జ్ఞానాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చేందుకు ఏఐని ఉపయోగించొచ్చు. మరో సమస్య ఏంటంటే.. మన రాతప్రతులు చెల్లాచెదురుగా ఉన్నాయి. వివిధ కాలాలకు సంబంధించినవి వివిధ రకాలుగా ఉన్నాయి. ఏఐ వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే.. వీటన్నింటినీ సేకరించవచ్చు. వాటి నుంచి అమృతాన్ని చిలికేందుకు మనం చాలా మంచి సాధనాన్ని ఉపయోగించొచ్చు. అంటే 10 చోట్ల పడి ఉన్న వాటిని ఏఐ సహాయంతో ఒకచోట చేర్చి వాటిపై అధ్యయనం చేయొచ్చు. ఒకే పదాన్ని చాలా రకాలుగా ఉపయోగించొచ్చని ప్రారంభంలో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో చెప్పినట్లుగా మనం రాతప్రతులను పరిష్కరించిన తర్వాత ప్రశ్నలను 100కు తగ్గించొచ్చు. నేడు మనం లక్షలాది ప్రశ్నలతో చిక్కుకొని ఉన్నాం. మనం వాటిని 100కి తీసుకొస్తాం. మనం మానవ స్ఫూర్తితో అనుసంధానమైనప్పుడు అది ఫలితాలను తీసుకొస్తుంది. కానీ ఇబ్బందులు చాలా ఉన్నాయి. అయితే మార్గాలు కూడా ఉన్నాయి.

మిత్రులారా, 

దేశంలోని యువత అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను. నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇందులో పాలు పంచుకున్న వారిలో 70 శాతం మంది యువతే అని మంత్రి గారు నాకు చెప్పారు. ఇది దీని విజయానికి అతిపెద్ద సంకేతం అని నేను భావిస్తున్నాను. యువత దీనిపై ఆసక్తి చూపడం ప్రారంభిస్తే.. మనం చాలా త్వరగా విజయం సాధిస్తామని నేను ఖచ్చితంగా చెప్పగలను. సాంకేతికత ద్వారా గతాన్ని ఎలా అన్వేషించగలం? ఈ జ్ఞానాన్ని ఆధారభూత పారామితులపై మానవాళికి ఎలా అందుబాటులోకి తీసుకురావచ్చు? ఈ దిశగా మనం కృషి చేయాలి. మన విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు కూడా దీని కోసం కొత్త కార్యక్రమాలను చేపట్టాలి. నేడు దేశం మొత్తం స్వదేశీ స్ఫూర్తితో, స్వావలంబన భారతదేశం అనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం కూడా దానికి కొనసాగింపే. మన వారసత్వాన్ని మన శక్తి సామర్థ్యాలకు పర్యాయపదంగా మార్చుకోవాలి. జ్ఞాన భారతం మిషన్‌తో భవిష్యత్తుకు సంబంధించిన కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని నేను నమ్ముతున్నాను. ఇవి ఆకర్షణ, మెరుపులేని అంశాలు అని నాకు తెలుసు. కానీ వీటికి చాలా శక్తి ఉంది కాబట్టే శతాబ్దాలుగా ఎవరూ కదిలించలేదు. మనం ఈ శక్తితో అనుసంధానం కావాలి. ఇదే నమ్మకంతో.. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Centre's ₹9,585-cr green scheme for NCR may boost CV replacement demand

Media Coverage

Centre's ₹9,585-cr green scheme for NCR may boost CV replacement demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to visit Surat and Daman on 5th June
June 04, 2026
PM to inaugurate, dedicate to the nation and lay the foundation stone of various development projects worth around ₹18,800 Crore in Surat
PM to dedicate key packages of the 8-Lane Access-Controlled Vadodara-Mumbai Expressway to the nation
PM to lay foundation stone for four-laning of critical sections on NH-56; project to enhance connectivity across tribal regions and boost access to the Statue of Unity
PM to inaugurate, dedicate to the nation and lay the foundation stone of development projects worth around ₹2,970 Crore in Daman
PM to dedicate New Terminal Building of NAMO Airport in Daman
PM to lay foundation stones of port projects worth ₹885 Crore for the UT of Lakshadweep

Prime Minister Shri Narendra Modi will visit Gujarat and Daman on 5th June, 2026. At around 2:30 PM, Prime Minister will visit Hazira in Surat district and review ongoing industrial operations and infrastructure projects. At around 4:15 PM, Prime Minister will inaugurate, dedicate to the nation and lay the foundation stone of various development projects worth around ₹18,800 crore in Surat. He will also address the gathering on the occasion.

Prime Minister will then travel to Daman, where at around 6:15 PM, he will inaugurate the New Terminal Building of NAMO Airport in Daman. This will be followed by the dedication of NAMO Hospital in Daman to the nation. Thereafter, at around 7:15 PM, Prime Minister will inaugurate, dedicate and lay the foundation stone of various development projects worth around ₹2,970 crores in Daman. He will also lay the foundation stone of four important projects for the Union Territory of Lakshadweep worth around ₹885 crore. He will also address the gathering on the occasion.

PM in Surat

Prime Minister will inaugurate, dedicate to the nation and lay the foundation stone of multiple development projects worth over ₹18,800 crore in Surat across the road, power and industrial sectors.

Prime Minister will dedicate Packages VI and VII of the Vadodara-Mumbai Expressway to the nation, enhancing high-speed transportation, logistics efficiency and economic connectivity between Gujarat and Maharashtra. Prime Minister will lay the foundation stone for key infrastructure projects which includes the four-laning of critical sections on NH-56 to enhance connectivity across tribal regions and boost access to the Statue of Unity.

Prime Minister will also inaugurate a 200 bedded ESIC Hospital in Surat, providing modern secondary healthcare across key specialties, backed by a central laboratory and essential ancillary services. It also features 24/7 emergency and trauma care to ensure the timely management of occupational injuries and medical emergencies. Prime Minister will inaugurate critical utility and industrial infrastructure projects, including the Transmission Network Expansion in Gujarat to enhance power evacuation capacity under the Inter-State Transmission System. Prime Minister will also inaugurate several important initiatives of Government of Gujarat, including modern power distribution upgrades under the Revamped Reforms-Based Distribution Sector Scheme in Valsad, advanced effluent disposal and treatment infrastructure at Dahej Petroleum, Chemicals and Petrochemical Investment Region (PCPIR) and Sarigam Gujarat Industrial Development Corporation (GIDC), and essential layout utilities at the Jambusar Bulk Drug Park.

PM in Daman

Prime Minister will inaugurate, dedicate to the nation and lay the foundation stone of development projects worth around ₹2,970 crore in Daman. These projects span various sectors including healthcare, civil aviation, tourism, infrastructure, connectivity and public welfare and are expected to provide a major boost to the overall development of the Union Territory of Dadra and Nagar Haveli and Daman and Diu.

Prime Minister will inaugurate and dedicate projects worth around ₹1,340 crore, including the New Terminal Building of NAMO Airport and NAMO Hospital, among others in Daman. The new airport terminal will significantly enhance regional air connectivity and facilitate economic growth in the region. NAMO Hospital, the district hospital in Daman district, has been developed to cater to nearly 1,500 OPD patients per day and will strengthen access to quality healthcare services for the people.

Prime Minister will also lay the foundation stone of projects worth around ₹1,630 crore. Major projects include the Iconic Bridge, the Daman Convention Centre and the NIFT Campus at Daman, among others. These projects are expected to strengthen modern infrastructure, boost tourism, promote investment, generate employment opportunities and improve the quality of life of the people.

Prime Minister will also lay the foundation stone of important projects for the Union Territory of Lakshadweep worth around ₹885 crore. These projects include Development of Port Facilities on the Eastern and Western Sides of both Kalpeni Island and Kadmat Island. The development of these multipurpose jetties will facilitate year-round berthing of large passenger vessels, including cruise vessels of up to 300 metres in length. The projects will enable safe and efficient passenger and cargo handling and provide integrated facilities for fish handling, fuel distribution, ice supply and boat repair. These initiatives will strengthen maritime connectivity, support the livelihoods of local fishermen, promote tourism and contribute to the socio-economic development of the islands.