షేర్ చేయండి
 
Comments
లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ ఓం బిర్లాను ప్రధాని మోదీ అభినందించారు
ఓం బిర్లా జీ కోటాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అది మినీ ఇండియా, విద్య మరియు అభ్యాసానికి సంబంధించిన భూమి: ప్రధాని
ఓం బిర్లా జీరాజకీయాలకు ప్రజా సేవే కేంద్ర బిందువు: ప్రధాని మోదీ

మాన‌నీయులైన స్పీక‌ర్ సర్,

ఈ ప‌ద‌వి ని మీరు స్వీక‌రించ‌డం ఈ స‌భ లోని స‌భ్యులు అంద‌రి కి ఎక్క‌డ‌ లేని సంతోషాన్ని పొందుతున్నటువంటి మ‌రియు గ‌ర్వపడుతున్నటువంటి ఘడియ. పాత స‌భ్యుల కు మీతో ఇప్ప‌టికే ఎంతో బాగా ప‌రిచ‌యముంది. ఒక చ‌ట్ట స‌భ స‌భ్యుడి గా కూడాను, రాజ‌స్థాన్ లో మీరు ఒక సానుకూలమైనటువంటి భూమిక ను పోషించివున్నారు. మ‌రి రాజకీయాతతో సంబంధం కలిగివున్న వారికి ఈ విషయం ఎరుకే.

స్పీక‌ర్ ప‌ద‌వి కి మేము అంద‌ర‌మూ ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపిన‌ ఒక వ్య‌క్తి.. విద్యార్థి సంస్థ‌ల లో చేరడం మరియు విశ్వ‌విద్యాల‌య విద్యార్థి సంబంధ కార్య‌క్ర‌మాల‌ కు నేతృత్వం వ‌హించడం మొదలుకొని ఏ విరుపు లేకుండా ప్ర‌జా జీవ‌నం లో పాలుపంచుకొంటున్న వ్యక్తి కావడం అన్నది ఈ రోజు న మా అందరి కి గర్వకారకమైన సంగతి గా ఉంది. అంతేకాక భార‌తీయ జ‌న‌తా పార్టీ యొక్క కార్య‌క‌ర్త‌ల లో ఒక‌రి గా అత‌డు విద్యార్థి ఉద్య‌మం లో నుండి వెలుప‌ల‌ కు వ‌చ్చి యువ‌ మోర్చా సంస్థ లో దాదాపు గా 15 సంవ‌త్స‌రాల పాటు జిల్లా స్థాయి లో, రాష్ట్ర స్థాయి లో, ఇంకా జాతీయ స్థాయి లో కృషి చేశారు కూడాను. సంస్థ కు అనేక సంవ‌త్స‌రాల పాటు ప‌ని చేసే అవ‌కాశాన్ని నేను కూడా పొందాను. ఈ కార‌ణం గా మ‌నం ఇరువుర‌ం స‌హ‌చ‌రులు గా క‌ల‌సి పని చేసే అవ‌కాశాన్ని దక్కించుకొన్నాము.

కోటా గ‌డ్డ ఒక విధం గా విద్య కు సంబంధించినంత వ‌ర‌కు కాశీ వ‌లే త‌యారు అయింది. వృత్తి జీవ‌నాని కి ప్రాధాన్యాన్ని ఇచ్చే వారు వారి మ‌స్తిష్కాల లో కోటా ను గురించి ఆలోచిస్తూ ఉంటారు; కోటా లో ఉండాల‌ని, కోటా లో చ‌దువుకోవాల‌ని, మ‌రి అలాగే కోటా లో ఒక బ్ర‌తుకు తెరువు ను స‌ముపార్జించుకోవాల‌ని వారు కోరుకుంటారు. రాజ‌స్థాన్ లో ఉన్న ఈ చిన్న న‌గ‌రం ఒక విధం గా చూస్తే, ఒక బుల్లి భార‌త‌దేశం మాదిరి గా పేరు తెచ్చుకొంది. మ‌రి కోటా యొక్క ఈ ప‌రివ‌ర్త‌న శ్రీ ఓమ్ బిర్లా గారి నాయ‌క‌త్వం, తోడ్పాటు మ‌రియు చొర‌వ ల వ‌ల్ల చేత‌నైంది.

సాధార‌ణం గా రాజ‌కీయ‌ వాదుల కు ప్ర‌జా జీవ‌నంలో ఒక ముఖ చిత్రం అంటూ ఏర్ప‌డింది. ఇది ఎటువంటి చిత్రం అంటే, మేం ఒక‌రి ని మరొకరం ఓడించుకోవడం కోసం రాజకీయాలు ఆడుతూను, ఎల్ల‌వేళ‌లా వాదులాటల లో, పోరాటాల లో నిమగ్నం అయివుంటాము అనేటటువంటిదన్న మాట. ఏమైనప్పటికి, నిజం అన్నది ఒక్కొక్క సారి బ‌య‌టకు రాదు. ఇటీవ‌ల, రాజ‌కీయ జీవ‌నం లో సామాజిక సేవ యొక్క శాతం అధికం గా ఉన్న‌ప్పుడు స‌మాజం లో ఆమోద‌నీయ‌త మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని దేశ ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నారు. క‌ర‌డుగ‌ట్టిన రాజ‌కీయాల యుగం మ‌స‌క‌బారిపోతోంది. ఓమ్ బిర్లా గారు ఎటువంటి వ్య‌క్తి అంటే, ఆయ‌న‌ కు రాజ‌కీయాల‌ తో గ‌ల అనుబంధం ఒక ప్రజా ప్రతినిధి గా అత్యంత స్వాభావికం అయిన‌టువంటిది. అయితే, దీనికి భిన్నం గా ఆయ‌న యొక్క యావత్తు శ్రామిక జీవ‌నం సామాజిక సేవ చుట్టూ తిరుగుతూ వ‌చ్చింది. సామాజిక జీవ‌నం లో ఏదైనా స‌మ‌స్య ఉందనుకొన్న‌ప్పుడ‌ల్లా, ముందు గా చెంత‌ కు చేరేది ఆయ‌నే. నాకు స్ప‌ష్టం గా జ్ఞాపకం ఉంది.. గుజ‌రాత్ భూకంపం కాలం లో ఆయ‌న చాలా కాలం పాటు గుజ‌రాత్ లో ఉన్నారు. ఆయ‌న త‌న ప్రాంతం నుండి యువ స‌హ‌చ‌రుల‌ ను తీసుకు వ‌చ్చారు. స్థానిక స‌దుపాయాన్ని దేని ని ఉప‌యోగించుకోకుండానే ఆయ‌న త‌న వ‌ద్ద అందుబాటులో ఉన్న వ‌న‌రుల తో దీర్ఘ కాలం పాటు ప్ర‌జ‌ల‌ కు సేవ‌లు చేశారు. కేదార్‌నాథ్ విప‌త్తు వేళ, ఆయ‌న త‌న బృందం తో పాటు మ‌రొక్క‌ మారు ప్ర‌జ‌ల‌ కు సేవ చేయ‌డం కోసం వాలిపోయారు. కోటా లో కూడాను శీత‌కాలాల వేళ ఎవ‌రి ద‌గ్గ‌ర‌ అయినా దుప్ప‌టి లేదు అంటే ఆయ‌న రాత్రి అంతా కూడాను కోటా లో గాలించి ప్ర‌జ‌ల ప్రాతినిధ్యం తో దుప్ప‌ట్ల‌ ను స‌ర్దుబాటు చేసి మరీ అవసరపడిన వారికి పంచిపెట్టే వారు. ఆయ‌న యొక్క ప్ర‌జా జీవ‌నం లో ఒక ఉద్య‌మం అంటూ ఉండింది. అది మ‌న వంటి ఎంపీ లు అంద‌రి కి ప్రేర‌ణ ను అందించేట‌టువంటిది. కోటా లో ఏ ఒక్క‌రు ఖాళీ క‌డుపు తో నిద్రించ‌కూడ‌ద‌న్న‌ది ఆయ‌న యొక్క ఉద్యమం గా ఉండింది. మ‌రి ఇందుకోస‌మే ఆయ‌న ప్ర‌సాదం పేరు తో ఒక పథ‌కాన్ని తీసుకు వ‌చ్చారు. ఈ ప‌థ‌కం ఇప్ప‌టి కి కూడాను అమ‌లు అవుతోంది. ప్ర‌సాదం ప‌థ‌కం లో భాగం గా ఆయ‌న ప్ర‌జ‌ల యొక్క ప్రాతినిధ్యం ద్వారా అన్నార్తుల ఆక‌లి ని తీర్చుతూ వ‌చ్చారు. ఇదే విధం గా పేద వారి కి మ‌రియు అనాథ‌ల‌ కు వ‌స్త్రాల ను అందించేందుకు ఆయ‌న ఒక ‘ప‌రిధాన్’ ప‌థ‌కాన్ని ఆరంభించారు. ‘ప‌రిధాన్’ ఉద్య‌మం ద్వారా ఆయ‌న పేద‌ల కోసం పాద‌ర‌క్ష‌ల‌ ను కూడా సేక‌రించే వారు. ఎవ‌రైనా జ‌బ్బు ప‌డిన‌ప్పుడు ర‌క్త‌దానం సర్దుబాటు చేయ‌వ‌ల‌సి వ‌చ్చినప్పుడు లేదా ఆసుప‌త్రుల లో మ‌రేదైనా సేవ అవ‌స‌రం అయినప్పుడు ఆయ‌న ఆ ప‌నుల‌ ను ప్ర‌జా ప్రాతినిధ్యం ప‌ద్ధ‌తి లో పూర్తి చేసే వారు. ఒక ర‌కం గా, ఆయ‌న రాజ‌కీయ శ్ర‌ద్ధ అంతా కూడాను ప్ర‌జా ఉద్యమం కన్నా ప్ర‌జా సేవ యే అని చెప్ప‌వ‌చ్చును.

ప్ర‌స్తుతం అటువంటి సచేతన వ్య‌క్తిత్వం స్పీక‌ర్ పీఠాన్ని అలంక‌రించినందువల్ల, సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి సామాజిక ద‌యాళుత్వం తో కూడిన జీవ‌నాన్ని గ‌డుపుతూ వ‌చ్చిన మ‌రియు ఒక బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌వి లో ఉంటున్న కారణం గా ఒక ఉత్ప్రేర‌కం వలె ఆయన మ‌న‌ కు క్ర‌మ‌శిక్ష‌ణ ను బోధిస్తారని, మ‌న‌ కు ప్రేర‌ణ గా నిలుస్తారని, ఈ సభ దేశాని కి త‌న శ్రేష్ట‌మైనటువంటి తోడ్పాటు ను అందించ‌ గ‌లుగుతుంద‌ని నేను న‌మ్ముతున్నాను. మెరుగైన ప‌ద్ధ‌తి లో కర్తవ్య నిర్వ‌హణ చేయగ‌లిగినటువంటి వ్య‌క్తి ఆయన.

స‌భ లో కూడాను, మ‌నం చూశాము ఆయ‌న ఎంతో విన‌మ్ర‌త తో మాటలాడుతారు; చిరున‌వ్వులు చిందిస్తుంటారు. నాకు ఒక్కొక్క‌సారి భయం వేస్తుంటుంది ఎవ‌రైనా ఆయ‌న యొక్క అణ‌కువ‌ ను మ‌రియు మ‌న‌స్సాక్షి ని వారి యొక్క ప్ర‌యోజ‌నాల కోసమని ఉప‌యోగించు కొంటారేమోన‌ని. ఇంత‌కు ముందు లోక్ స‌భ స్పీక‌ర్ బోలెడ‌న్ని స‌వాళ్ళ ను ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. అదే స‌మ‌యం లో రాజ్య స‌భ చైర్‌మ‌న్ ముందు మాత్రం కాస్తంత త‌క్కువ స‌వాళ్ళు ఎదుర‌య్యేవి. ఏమైనప్పటికి, ప్ర‌స్తుతం ముఖ చిత్రం విరుద్ధం గా మారింది. మునుప‌టి స‌మావేశాల‌ ను మ‌నం ఒక‌సారి జ్ఞ‌ప్తి కి తెచ్చుకొంటే గ‌నుక, మ‌న స్పీక‌ర్ మేడ‌మ్ ఎల్ల‌ప్పుడూ ఉల్లాసం గా ఉంటూ, న‌వ్వు ముఖం తో క‌న‌ప‌డే వార‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఒప్పుకొంటారు. ఆమె ఎవ‌రిని అయినా మంద‌లించ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ప్పుడు సైతం గద్దించిన అనంతరం న‌వ్వేసే వారు. కానీ, ఆమె ఒక కొత్త సంప్రదాయాని కి నాంది ప‌లికారు. స్పీక‌ర్ స‌ర్, మేము మీ యొక్క విధులు సులువు గా పూర్తి కావడం కోసం ఈ స‌భ పక్షాన మ‌రియు పాల‌క ప‌క్షం త‌ర‌ఫున‌ మేము 100 శాతం ప్ర‌య‌త్నాలు చేస్తాము అని మీకు నేను హామీ ని ఇస్తున్నాను. ఈ సభ ను నడపడం లో ఈ పక్షం ద్వారా నిబంధ‌న‌ల‌ ను అతిక్ర‌మించ‌డం లేదా అంత‌రాయాల‌ ను క‌ల్పించ‌డం జ‌రిగింది అంటే గ‌నక వారి కి, మా వంటి వారికి వారి యొక్క స్థాయి ని గుర్తు చేసేందుకు మీకు స‌ర్వ హ‌క్కులు ఉంటాయి; మరి దీని ని మేము స్వాగ‌తిస్తాము. దీని కి కారణం ఈ స‌భ యొక్క గౌర‌వాన్ని నిల‌బెట్ట‌డం అనేది మ‌న అంద‌రి బాధ్య‌త కాబ‌ట్టి. మునుపు మొద‌టి మూడు, నాలుగు సంవ‌త్స‌రాలు ప్ర‌శాంతం గా గ‌డ‌చేది. ఒక్క ఎన్నిక‌ల సంవ‌త్స‌రం లో మాత్ర‌మే కొంత సమ‌స్యాత్మ‌కం గా ఉండేది. కానీ, ఇప్పుడు ప్ర‌తి మూడు, నాలుగు నెల‌ల‌ కు ఒక ఎన్నిక జ‌రుగుతోంది. ఇక్క‌డ నుండి సందేశాలు ఇవ్వాల‌ని కోరుకొనేవారు ఉన్నారు. అటువంటి సంద‌ర్భాలు మీకు ఒత్తిడి ని సృష్టించ‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టి కీ, ఒక మంచి నాణ్య‌మైన వాద‌న‌ మ‌రియు ముఖ్య‌మైన అంశాల‌ కు సంబంధించి చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జరిగేటట్టు, అలాగే నిర్ణ‌యాల‌ ను స‌మ‌ష్టి గా తీసుకొనేటట్టు స‌భ ప్ర‌య‌త్నిస్తుంది. ఈ ఆశ తో, మీకు పాల‌క ప‌క్షం త‌ర‌ఫున మ‌రియు స‌భ త‌ర‌ఫున శుభాకాంక్ష‌ల ను నేను తెలియ‌ జేస్తున్నాను. మీకు ఇవే ధ‌న్య‌వాదాలు.

భారత ఒలింపియన్లకు స్ఫూర్తినివ్వండి! #చీర్స్4ఇండియా
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
India's crude steel output up 21.4% at 9.4 MT in June: Worldsteel

Media Coverage

India's crude steel output up 21.4% at 9.4 MT in June: Worldsteel
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 2nd August 2021
August 02, 2021
షేర్ చేయండి
 
Comments

Citizens elated as PM Narendra Modi to be First Indian Prime Minister to Preside Over UNSC Meeting

Citizens praise Modi Govt’s resolve to deliver Maximum Governance