షేర్ చేయండి
 
Comments
“Budget this year has come with a new confidence of development amidst the once-in-a-century calamity”
“This Budget will create new opportunities for the common people along with providing strength to the economy”
“Budget is full of opportunities for more Infrastructure, more Investment, more growth, and more jobs.”
“Welfare of the poor is one of the most important aspect of this budget”
“Budget’s provisions aim to make agriculture lucrative and full of new opportunities”

వందేళ్ళ కు ఒకసారి సంభవించిన విపత్తు మధ్య ఈ బడ్జెటు అభివృద్ధి లో ఒక కొత్త విశ్వాసాన్ని నింపింది. ఆర్థిక వ్యవస్థ ను బలపరచడం తో పాటు గా, ఈ బడ్జెటు సామాన్య మానవుని కి ఎన్నో కొత్త అవకాశాల ను కల్పిస్తుంది. ఈ బడ్జెటు లో మౌలిక సదుపాయాల కల్పన కు, పెట్టుబడి కి, వృద్ధి కి, ఇంకా ఉద్యోగాల కు కొత్త అవకాశాలు సంపూర్ణం గా ఉన్నాయి. ఒక కొత్త రంగాని కి తలుపుల ను తెరవడమైంది. అదేమిటి అంటే ‘గ్రీన్ జాబ్స్’. ఈ బడ్జెటు తక్షణ అవసరాల ను తీరుస్తుంది. మరి అంతేకాకుండా దేశ యువత కు ఉజ్వలమైన భవిష్యత్తు కు కూడాను పూచీ పడుతుంది.

గత కొద్ది గంటలు గా ఈ బడ్జెటు ను ప్రతి ఒక్కరు ఏ విధం గా స్వాగతిస్తున్నదీ, మరి సామాన్య మానవుని వద్ద నుంచి సకారాత్మకమైనటువంటి ప్రతిస్పందన వస్తున్నదీ నేను గమనించాను. ఇవి ప్రజల కు సేవ చేయాలనే మా ఉత్సాహాన్ని అనేక రెట్లు బలపరచాయి.

జీవితం లోని ప్రతి రంగం లో కొత్తదనం.. అది సాంకేతిక విజ్ఞానం కావచ్చు, రైతుల కు డ్రోన్ లు కావచ్చు, వందే భారత్ రైళ్ళు కావచ్చు, డిజిటల్ కరెన్సీ కావచ్చు, బ్యాంకింగ్ రంగం లో డిజిటల్ యూనిట్ లు కావచ్చు. 5జి సేవల ను ప్రారంభించడం కావచ్చు, దేశ ప్రజల ఆరోగ్యం కోసం డిజిటల్ ఇకోసిస్టమ్ కావచ్చు.. మన యువజనులు, మధ్య తరగతి, పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, ఇంకా అన్ని వర్గాలు ప్రయోజనాన్ని పొందనున్నాయి.

ఈ బడ్జెటు తాలూకు ఒక ముఖ్యమైన అంశం పేదల సంక్షేమం గా ఉంది. ప్రతి ఒక్క పేద వ్యక్తి ఒక పక్కా ఇంటి ని, నల్లా నీరు, టాయిలెట్ , గ్యాస్ కనెక్షన్, మొదలైన సౌకర్యాల ను కలిగి ఉండేటట్లు గా ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం జరిగింది. అదే కాలం లో ఆధునిక ఇంటర్ నెట్ సంధానం అనే అంశం పై కూడా సమానమైన ప్రాధాన్యాన్ని ఇవ్వడమైంది.

జీవనం మరింత సరళతరం గా మారేటట్లు చూడటానికి, భారతదేశం లో యావత్తు హిమాలయ పర్వత శ్రేణి తాలూకు పర్వతమయ ప్రాంతాల నుంచి ఎలాంటి ప్రవాసం ఉండకుండా చూడటానికి ఒక కొత్త ప్రకటన ను కూడా చేయడం జరిగింది. దేశం లో మొట్టమొదటిసారి గా ‘పర్వతమాల పథకాన్ని’ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము-కశ్మీర్, ఇంకా ఈశాన్య ప్రాంతాల కోసం మొదలు పెట్టడం జరుగుతోంది. ఈ పథకం నవీన రవాణా వ్యవస్థ ను, మరి అదే విధం గా పర్వత ప్రాంతాల లో సంధానాన్ని ఏర్పరుస్తుంది. ఇది మన దేశం లోని సరిహద్దు గ్రామాల ను బలోపేతం చేయనుంది. మన దేశం లో సరిహద్దు గ్రామాలు చైతన్యవంతం కావలసిన అవసరం ఉంది. ఇది దేశ భద్రత పరం గా కూడా అవసరం.

గంగా మాత శుద్ధి తో పాటే, రైతు ల సంక్షేమం కోసం ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడమైంది. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఝార్ ఖండ్, ఇంకా పశ్చిమ బంగాల్ రాష్ట్రాల లో గంగానది తీర ప్రాంతాల వెంబడి ప్రాకృతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. గంగా మాత శుద్ధి తాలూకు ప్రచార ఉద్యమం ఈ నది ని రసాయనిక వ్యర్థాల బారి నుంచి విముక్తం చేయడం లో ఎంతగానో ప్రభావాన్ని చూపగలుగుతుంది.

వ్యవసాయం లాభదాయకం గా ఉండేందుకు, మరి కొత్త అవకాశాలు లభించేందుకు బడ్జెటు లో చేసిన ఏర్పాటు లు పూచీ పడతాయి. కొత్త గా ఏర్పాటయ్యే వ్యావసాయిక స్టార్ట్-అప్స్ ను ప్రోత్సహించడం కోసం ఒక ప్రత్యేకమైన నిధి కావచ్చు, లేదా ఫూడ్ ప్రోసెసింగ్ ఇండస్ట్రీ కోసం ఉద్దేశించిన ఒక కొత్త ప్యాకేజీ కావచ్చు.. బడ్జెటు కేటాయింపులు రైతుల ఆదాయాన్ని పెంచడం లో పెద్ద ప్రభావాన్ని కనబరచనున్నాయి. ఎమ్ఎస్ పి కొనుగోళ్ల ద్వారా 2.25 లక్షల కోట్ల రూపాయాల కు పైగా సొమ్ము రైతు ల ఖాతాల లోకి నేరు గా బదలాయించడం జరుగుతోంది.

ఎమ్ఎస్ఎమ్ఇ లను.. అదే మన చిన్న పరిశ్రమల ను కరోనా కాలం లో పరిరక్షించడానికి సహాయకారి అయ్యే అనేక నిర్ణయాల ను తీసుకోవడం జరిగింది. క్రెడిట్ గ్యారంటీ లో రికార్డు స్థాయి లో పెరుగుదల కు తోడు గా అనేక ఇతర పథకాల ను ఈ బడ్జెటు లో ప్రకటించడమైంది. రక్షణ రంగ మూలధన బడ్జెటు లో 68 శాతాన్ని దేశీయ పరిశ్రమ రంగాని కి ప్రత్యేకించేటటువంటి నిర్ణయం సైతం భారతదేశం లోని ఎమ్ఎస్ఎమ్ఇ రంగాని కి ఎంతో మేలు ను చేయగలదు. ఇది స్వయంసమృద్ధి దిశ లో ఒక భారీ ముందంజ. 7.50 లక్షల కోట్ల రూపాయల మేరకు పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ అనేది ఆర్థిక వ్యవస్థ కు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చి, చిన్న పరిశ్రమల కు మరియు ఇతర రంగాల కు చెందిన పరిశ్రమల కు కొత్త అవకాశాల ను కల్పిస్తుంది.

ప్రజల కు స్నేహపూర్వకం అయినటువంటి మరియు క్రమాభివృద్ధియుక్తం అయినటువంటి బడ్జెటు ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి నిర్మల గారికి, మరి ఆమె యొక్క యావత్తు జట్టు కు నేను అభినందనలు తెలియజేస్తున్నాను.

‘బడ్జెటు మరియు ఆత్మనిర్భర్ భారత్’ అనే అంశం పైన రేపటి రోజు న ఉదయం 11 గంటల కు ప్రసంగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ నన్ను ఆహ్వానించింది. ఆ అంశం పై నేను రేపు మాట్లాడుతాను. ఈ రోజు కు ఇంతే. మీకు చాలా ధన్యవాదాలు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
Rs 1,780 Cr & Counting: How PM Modi’s Constituency Varanasi is Scaling New Heights of Development

Media Coverage

Rs 1,780 Cr & Counting: How PM Modi’s Constituency Varanasi is Scaling New Heights of Development
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 మార్చి 2023
March 26, 2023
షేర్ చేయండి
 
Comments

PM Modi Inspires and Motivates the Nation with The 99 th episode of Mann Ki Baat

During the launch of LVM3M3, people were encouraged by PM Modi's visionary thinking