ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ గోతాబాయా రాజపక్షె, శ్రీ లంక ప్రధాని శ్రీ మహిందా రాజపక్షె ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడి, ఆయన కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇరుగుపొరుగు దేశాలైన భారతదేశం, శ్రీ లంక ల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలపర్చుకోవాలన్న తమ దృఢమైన ఆకాంక్ష ను, తమ నిబద్ధత ను శ్రీ లంక నేతలిద్దరూ వ్యక్తం చేశారు. కొవిడ్ మహమ్మారి పై కలిసి పోరాటం చేయడం సహా ఉభయ పక్షాలు వాటి మధ్య గల సహకారాన్ని కొనసాగిస్తున్నందుకు వారు హర్షం వ్యక్తం చేశారు.
ఉభయ నేతలు అందించిన శుభాకాంక్షలకు గాను వారికి ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సహకారాన్ని భారత్ అనుసరిస్తున్న ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానానికి అనుగుణం గా మరింతగా విస్తృతపర్చుకోవడానికి వారితో కలిసి కృషిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు.


