షేర్ చేయండి
 
Comments

ప్రధాన మంత్రి కార్యాలయం లో ప్రస్తుతం ఒఎస్‌డి  విధుల ను నిర్వ‌హిస్తున్న శ్రీ పి.కె. సిన్హా ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి ప్రిన్సిప‌ల్ అడ్ వైజర్ గా నియ‌మించ‌డమైంది.  

శ్రీ సిన్హా 2015వ సంవ‌త్స‌రం జూన్ 13వ తేదీ నుండి 2019 వ సంవ‌త్స‌రం ఆగ‌స్టు 30వ తేదీ వ‌ర‌కు కేబినెట్ సెక్ర‌ట‌రీ గా సేవ‌లు అందించారు.  ఆయ‌న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కాడ‌ర్ కు చెందిన 1977వ సంవ‌త్స‌రం బ్యాచ్ ఐఎఎస్ అధికారి.  శ్రీ సిన్హా త‌న ప్రముఖ వృత్తి జీవ‌నం లో విద్యుత్తు మ‌రియు శిప్పింగ్ మంత్రిత్వ శాఖ లో కార్య‌ద‌ర్శి గా ప‌ని చేశారు.  పెట్రోలియ‌మ్ మరియు స‌హ‌జ వాయువు మంత్రిత్వ శాఖ లో స్పెశ‌ల్ సెక్ర‌ట‌రీ గా కూడా సేవ‌ల ను అందించారు.

ఆయ‌న యూనివ‌ర్సిటీ ఆఫ్ ఢిల్లీ లోని సెంట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి అర్థ శాస్త్రం లో ప‌ట్ట‌భ‌ద్రుడు అయ్యారు.  ఆ త‌రువాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ లో అర్థ శాస్త్రం లో స్నాత‌కోత్త‌ర విద్య ను అభ్య‌సించారు.  త‌ద‌నంత‌రం, స‌ర్వీసు లో ఉంటూనే ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేశన్ లో మాస్ట‌ర్స్ డిప్లొమా ను మ‌రియు సోష‌ల్ సైన్సెస్ లో ఎం.ఫిల్.ను పొందారు.

ఐఎఎస్ లో సుదీర్ఘ కాలం పాటు కొన‌సాగిన క్రమం లో, శ్రీ సిన్హా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం లోను, కేంద్ర ప్ర‌భుత్వం లోను వేరు వేరు ప‌ద‌వుల ను నిర్వహించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ స్థాయి లో శ్రీ సిన్హా నిర్వ‌హించిన వివిధ ప‌ద‌వీ బాధ్య‌త‌ల లో జౌన్‌ పుర్ మ‌రియు ఆగ్రా యొక్క జిల్లా మేజిస్ట్రేట్‌, వారాణ‌సీ క‌మిశ‌న‌ర్‌, సెక్ర‌ట‌రీ (ప్లానింగ్)మ‌రియు ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ  (ఇరిగేశన్) త‌దిత‌ర ప‌ద‌వులు ఉన్నాయి.  ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వం లో అనేక సంవ‌త్స‌రాల పాటు సేవ‌ లు అందించారు.  వాటి లో ప్ర‌ధానం గా శ‌క్తి, ఇంకా మౌలిక స‌దుపాయాల రంగాలు- అంటే పెట్రోలియ‌మ్ & స‌హ‌జ‌ వాయువు మంత్రిత్వ శాఖ‌, విద్యుత్తు శాఖ‌, ఇంకా శిప్పింగ్ శాఖ ల వంటివి- ఉన్నాయి.  శ‌క్తి, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న మ‌రియు ఆర్థిక శాస్త్ర రంగాల లో ఆయన ది అందెవేసిన చేయి.

 

Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
All citizens will get digital health ID: PM Modi

Media Coverage

All citizens will get digital health ID: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
శ్రీఎస్. సెల్వగణపతి రాజ్య సభ కు ఎన్నిక కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
September 28, 2021
షేర్ చేయండి
 
Comments

శ్రీ ఎస్. సెల్వగణపతి పుదుచ్చేరి నుంచి రాజ్య సభ కు ఎన్నిక కావడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మా పార్టీ కి శ్రీ ఎస్. సెల్వగణపతి గారు పుదుచ్చేరి నుంచి ప్రప్రథమ రాజ్య సభ ఎంపి అవడం అనేది బిజెపి లో ప్రతి ఒక్క కార్యకర్త కు అపారమైన గౌరవాన్ని కలిగించేటటువంటి విషయం. పుదుచ్చేరి జనత మా యందు ఉంచిన నమ్మకానికి మేం కృత‌జ్ఞులం. పుదుచ్చేరి ప్రగతి కి మేం పాటుపడుతూనే ఉంటాం’’ అని పేర్కొన్నారు.