షేర్ చేయండి
 
Comments

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రెండు రోజుల పాటు 2020వ సంవత్సరం జనవరి 11వ తేదీ మరియు 12వ తేదీ లలో కోల్ కాతా ను ఆధికారికం గా సందర్శించేందుకు అక్కడ కు బయలుదేరి వెళ్తున్నారు.

 

వారసత్వ భవనాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేస్తారు

 

పునరుద్ధరించినటువంటి వారసత్వ భవనాల ను నాలుగింటి ని దేశ ప్రజల కు జనవరి 11వ తేదీ నాడు ప్రధాన మంత్రి అంకితం చేస్తారు.

 వాటి లో పాత కరెన్సీ భవనం, బెల్ విడియర్ హౌస్, మెట్ కాఫ్ హౌస్, మరియు విక్టోరియా మెమోరియల్ హాల్ లు ఉన్నాయి.  ఈ నాలుగు ప్రసిద్ధ చిత్రశాలల ను కేంద్ర సంస్కృతి మంత్రిత్వ శాఖ పునర్ నవీకరించింది.  వాటి లో నూతన వస్తువుల ను ప్రదర్శన కు ఉంచింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశించిన మీదట సంస్కృతి మంత్రిత్వ శాఖ దేశం లోని వివిధ మహా నగరాల లోని ప్రసిద్ధ భవనాల చుట్టుపక్కల గల సాంస్కృతిక ప్రదేశాల ను అభివృద్ధిపరుస్తున్నది.  ఈ ప్రాజెక్టు లో ముందు గా కోల్ కాతా, ఢిల్లీ, ముంబయి, అహమదాబాద్ మరియు వారాణసీ ల ను చేపడుతున్నారు.

 

 

కోల్ కాతా పోర్ట్ ట్రస్ట్ (కెఒపిటి) యొక్క నూటయాభైవ జయంతి ఉత్సవాలు

 

ప్రధాన మంత్రి 2020వ సంవత్సరం జనవరి 11వ తేదీ న మరియు జనవరి 12వ తేదీ న భవ్యం గా జరిగే కోల్ కాతా పోర్ట్ ట్రస్ట్ నూటయాభై వ జయంతి ఉత్సవాల లో కూడా పాలు పంచుకొంటారు.

 ప్రధాన మంత్రి కోల్ కాతా పోర్ట్ ట్రస్ట్ యొక్క విశ్రాంత ఉద్యోగులు మరియు ప్రస్తుత సిబ్బంది తాలూకు పెన్శన్ ఫండ్ లో లోటు ను భర్తీ చేయడం కోసం తుది కిస్తీ రూపం లో 501 కోట్ల రూపాయల విలువైన చెక్కు ను అందజేయనున్నారు.

మరొక స్మరణీయ ఘట్టం లో భాగం గా, ప్రధాన మంత్రి కోల్ కాతా పోర్ట్ ట్రస్ట్ కు చెందిన ఇద్దరు వయోధిక పింఛన్ దారు లైన శ్రీ నగీనా భగత్ కు మరియు శ్రీ నరేశ్ చంద్ర చక్రవర్తి కి (వీరు ఇరువురి వయస్సు వరుస గా 105 ఏళ్లు మరియు 100 సంవత్సరాలు) అభినందన లు తెలియజేయనున్నారు.

 

ఈ కార్యక్రమం లో భాగం గా పోర్ట్ గీతాన్ని కూడా ప్రధాన మంత్రి విడుదల చేస్తారు.

 పోర్టు సిసలు జెట్టీ లు ఉన్న చోటు లో 150 సంవత్సరాల తాలూకు స్మారక నిర్మాణాన్ని కూడా శ్రీ మోదీ ఆవిష్కరిస్తారు.

 నేతాజీ సుభాష్ డ్రై డాక్ వద్ద కొచ్చిన్ కోల్ కాతా శిప్ రిపేర్ యూనిట్ కు చెందిన స్థాయి పెంచిన శిప్ రిపేర్ ఫెసిలిటీ ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.

సరకుల రవాణా సాఫీ గా సాగేందుకు మరియు టర్న్ అరౌండ్ టైమ్ మెరుగయ్యేందుకు ఉద్దేశించినటువంటి కెఒపిటి లో ని కోల్ కాతా డాక్ సిస్టమ్ యొక్క అభివృద్ధి పరచిన ఫుల్ రేక్ హ్యాండ్లింగ్ ఫెసిలిటీ ని సైతం శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 

కెఒపిటి లోని హాల్దియా డాక్ కాంప్లెక్స్ లో బెర్త్ నంబర్ 3 యొక్క యాంత్రీకరణ సౌకర్యాన్ని, అలాగే ప్రతిపాదిత నదీముఖ అభివృద్ధి పథకాన్ని కూడాను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.

 సుందర్ బన్స్  కు చెందిన 200 మంది ఆదివాసీ విద్యార్థినుల కు ఉద్దేశించినటువంటి ప్రీతిలత ఛాత్రి ఆవాస్ ను మరియు కౌశల్ వికాస్ కేంద్రాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు ను అఖిల భారతీయ వన్ వాసీ కల్యాణ్ ఆశ్రమాని కి అనుబంధం గా నడుస్తున్న సుందర్ బన్స్ ప్రాంతం లోని గోసాబ కు చెందిన పూర్వాంచల్ కల్యాణ్ ఆశ్రమం తో కలసి కెఒపిటి చేపట్టింది.

 

 

 

 

 

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Govt allows Covid vaccines at home to differently-abled and those with restricted mobility

Media Coverage

Govt allows Covid vaccines at home to differently-abled and those with restricted mobility
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 24th September 2021
September 24, 2021
షేర్ చేయండి
 
Comments

PM Narendra Modi interacted with top 5 Global CEOs to highlight opportunities in India, gets appreciation from citizens

India lauded Modi Govt for its decisive efforts towards transforming India