ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, శ్రీ లంక అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ గోటబయ రాజపక్స తో టెలిఫోనులో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఇరువురు నాయకులు, సమయోచిత పరిణామాలతో పాటు, ద్వైపాక్షిక, బహుపాక్షిక వేదికలలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు. కొనసాగుతున్న కోవిడ్-19 సవాళ్ళ నేపథ్యంతో సహా సంబంధిత అధికారుల మధ్య క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించడానికి వారు అంగీకరించారు.
పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యత అనే భారతదేశ విధానం గురించి, ఈ సందర్భంగా, ప్రధానమంత్రి, శ్రీలంక కు మరోసారి తెలియజేశారు.


