సెప్టెంబర్ 2025 వారణాసి సమావేశం నుంచి ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని సమీక్షించిన ఇరు నేతలు
భారత్‌-మారిషస్ మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించిన ఇరు దేశాల ప్రధానులు
మారిషస్ అభివృద్ధి ప్రాధాన్యతలకు భారత్‌ నిరంతర మద్దతు కొనసాగుతుందన్న ప్రధానమంత్రి
హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేయడానికి ఇరు నేతల అంగీకారం
వచ్చే వారం ఢిల్లీలో జరగబోయే ఏఐ ఇంపాక్ట్ సదస్సు కోసం మారిషస్‌ ప్రధానిని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపిన ప్రధానమంత్రి

మారిషస్ రిపబ్లిక్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గూలమ్ నుంచి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి నేడు ఫోన్ కాల్ వచ్చింది.

సెప్టెంబర్ 2025లో వారణాసిలో జరిగిన సమావేశం తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంలో జరిగిన పురోగతిని ఇరు ప్రధానులు సమీక్షించారు. ముఖ్యంగా అభివృద్ధి భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల  బలోపేతంపై వారు చర్చించారు.  భారత్-మారిషస్ ప్రజల ప్రయోజనాల కోసం మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి తమ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారు.

భారత్ అనుసరిస్తున్న పొరుగు దేశాల ప్రాధాన్యత విధానం, 'విజన్ మహాసాగర్’, అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి వంటి మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా.. మారిషస్‌ అభివృద్ధి ప్రాధాన్యతలకు భారత్‌ నిరంతరం మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం అనే ఉమ్మడి లక్ష్యాల సాధన కోసం కలిసి పనిచేయాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు.

వచ్చే వారం ఢిల్లీలో జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు  హాజరవ్వాల్సిందిగా మారిషస్ ప్రధానిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Queen Maxima praises India's digital public infrastructure during 3-day visit focused on country's financial health

Media Coverage

Queen Maxima praises India's digital public infrastructure during 3-day visit focused on country's financial health
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in mishap in Kolkata
June 25, 2026
PM announces ex-gratia from PMNRF

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to a mishap in Kolkata.

Shri Modi assured that the state government is working round the clock to ensure that those affected receive all possible assistance.

The Prime Minister announced an ex-gratia from PMNRF of Rs. 2 lakh to the next of kin of each deceased and Rs. 50,000 for those injured.

Shri Modi posted on X;

The mishap in Kolkata yesterday is saddening. An ex-gratia of Rs. 2 lakh each will be given from PMNRF to the next of kin of those who lost their lives in the mishap. The injured would be given Rs. 50,000. The state government is working round the clock to ensure that those affected receive all possible assistance: PM @narendramodi