బోత్స్ వానా అధ్యక్షునిగా శ్రీ డ్యూమా బొకో ఎన్నికైన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని తన సందేశాన్ని సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ, కొత్తగా ఎన్నికైన అధ్యక్షుని పదవీకాలం విజయవంతం అవుతుందనే ఆశను వ్యక్తం చేశారు. బోత్స్ వానాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘శ్రీ డ్యూమా బొకో (@duma_boko), మీరు బోత్స్ వానాకు అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంలో మీకివే నా అభినందనలు. మీ పదవీకాలం సఫలం కావాలని నేను కోరుకుంటున్నాను. మన ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడేలా మీతో కలిసి, బాగా పనిచేయాలని ఎదురుచూస్తున్నాను.’’
Congratulations @duma_boko on your election as the President of Botswana. Best wishes for a successful tenure. Look forward to working closely with you to further strengthen our bilateral ties.
— Narendra Modi (@narendramodi) November 3, 2024