అస్తానా లో ఎస్ సిఒ సమావేశాల సందర్భంగా కజాకిస్తాన్, చైనా మరియు ఉజ్ బ్ కిస్తాన్ నాయకులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.

గురువారం నాడు తజాకిస్తాన్ ప్రెసిడెంట్ శ్రీ నూర్ సుల్తాన్ నజర్ బయేవ్ తో ఆయన భేటీ అయ్యారు. 2017-18లో ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో సభ్యత్వం పొందినందుకు తజాకిస్తాన్ ను ప్రధాన మంత్రి అభినందించారు. ప్రెసిడెంట్ శ్రీ నజర్ బయేవ్ ప్రధాన మంత్రికి సాదర స్వాగతం పలికారు. 2015లో ఆయన కజాకిస్తాన్ కు వచ్చిన సంగతిని ప్రెసిడెంట్ గుర్తు చేసుకున్నారు. ఆ పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలలోను,
కుదుర్చుకున్న ఒప్పందాలలోను, పురోగతిపై నేతలు ఇరువురు సమీక్ష జరిపారు. తజాకిస్తాన్ ప్రస్తుతం భారతదేశానికి అత్యంత భారీ స్థాయిలో యురేనియమ్ ను సరఫరా చేస్తోంది. తమ భాగస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలని ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. హైడ్రోకార్బన్ ల రంగంలోను సహకారం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

  

  

ఇంటర్ నేషనల్ సోలార్ అలయన్స్ లో సభ్యత్వం తీసుకోవాలని తజాకిస్తాన్ ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు. నేతలు ఇరువురు అనుసంధానాన్ని మరింత పెంచుకోవలసిన విషయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి చర్చించారు. ఢిల్లీ, అస్తానా ల మధ్య నడిచే రెండు విమాన సర్వీసులను త్వరలోనే ప్రారంభించనున్నారు. 

 

చైనా ప్రెసిడెంట్ శ్రీ శి జిన్ పింగ్ తో ఈ రోజు ప్రధాన మంత్రి సాదర, సకారాత్మక సమావేశం నిర్వహించారు. ఎస్ సిఒ లో భారతదేశం చేరికకు మద్దతు ఇచ్చినందుకు ఆయనకు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. బహుళ ధృవ ప్రపంచంలో ప్రపంచంలో అనిశ్చితి ఏర్పడిన తరుణంలో భారత-చైనా సంబంధాలు నిలకడగా కొనసాగుతున్నాయని, కలిసి పనిచేయడం రెండు దేశాలకు ముఖ్యమని ఉభయ నేతలు గుర్తించారు. వ్యాపారం, పెట్టుబడులు, అనుసంధానం, యువత మరియు సాంస్కృతిక బృందాల రాకపోకలు తదితర అంశాలు చర్చలలో చోటు చేసుకున్నాయి.

ఉజ్ బ్ కిస్తాన్ ప్రెసిడెంట్ శ్రీ షౌకత్ మిర్ జియోయెవ్ తో ప్రధాన మంత్రి సాదర, ఫలప్రద సమావేశాన్ని నిర్వహించారు. ఆర్థిక రంగం, వ్యాపార రంగం, ఆరోగ్య రంగం.. ఈ రంగాలలో పరస్పర సంబంధాలను పటిష్ట పరచుకోవాలన్న అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

  

 

 

 

Prime Minister Modi held fruitful talks with Afghanistan President Ashraf Ghani. The leaders discussed several avenues of India-Afghanistan cooperation.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions