‘‘భారతదేశం ఒకదశాబ్ద కాలం లో పదకొండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి అయిదో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ గా పుంజుకొంది’’
‘‘ ‘రిడ్ యూస్, రీయూస్ ఎండ్ రీసైకిల్’ అనేవి భారతదేశంయొక్క సాంప్రదాయిక జీవన శైలి లో ఒక భాగం గా ఉన్నాయి’’
‘‘భారతదేశం ప్రతి ఒక్క మిశను కు విస్తృతి ని, వేగాన్ని, రాశి ని మరియు వాసి ని జోడిస్తుంది’’

ఇంటర్‌నేశనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఇఎ) యొక్క మంత్రుల స్థాయి సమావేశం ఈ రోజు న జరగగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

 

ప్రధాన మంత్రి తన సంబోధన లో ఇంటర్‌ నేశనల్ ఎనర్జీ ఏజెన్సీ కి 50 వ వార్షికోత్సవ వేళ అభినందనల ను తెలియ జేస్తూ, ఈ సమావేశాని కి సహ అధ్యక్షత భారాన్ని వహిస్తున్నందుకు గాను ఐర్లండ్ కు మరియు ఫ్రాన్స్ కు కృతజ్ఞత ను కూడా వ్యక్తం చేశారు.

 

చిరకాలిక వృద్ధి ని నమోదు చేయాలి అంటే గనుక శక్తి భద్రత మరియు స్థిరత్వం లను అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. భారతదేశం పదేళ్ళ కాలం లో పదకొండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉన్నది కాస్తా అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఎలా ఎదిగిందో ఆయన వివరించారు. అదే కాలం లో, భారతదేశం ప్రపంచం లోఅత్యంత వేగం గా వృద్ధి చెందుతున్నటువంటి ప్రముఖ ఆర్థిక వ్యవస్థ గా కూడా మారిపోయిందని ప్రధాన మంత్రి అన్నారు. అలాగే, భారతదేశం సౌర శక్తి సామర్థ్యం ఇరవై ఆరు రెట్ల మేరకు వృద్ధి ని నమోదు చేయడం తో పాటు గా దేశం యొక్క నవీకరణయోగ్య శక్తి సామర్థ్యం రెట్టింపు అయింది కూడా అని ఆయన చెప్పారు. ‘‘మేం ఈ విషయం లో మా యొక్క పేరిస్ వాగ్దానాల ను నిర్ణీత కాల పరిమితుల కంటె ముందుగానే నెరవేర్చాం.’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రపంచ జనాభా లో 17 శాతం మంది కి నిలయం గా భారతదేశం ఉంటోంది; అయినప్పటికీ కూడా ప్రపంచం లో కెల్లా అతి పెద్దవైన శక్తి లభ్యత కార్యక్రమాల ను కూడా నిర్వహిస్తోంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భారతదేశం యొక్క కర్బన ఉద్గారాలు ప్రపంచ వ్యాప్త కర్బన ఉద్గారాల లో నాలుగు శాతం గా మాత్రమే లెక్క కు వస్తున్నాయి అని ఆయన తెలిపారు. ఒక సామూహికమైనటువంటి మరియు జరుగబోయే మార్పుల ను అంచనా వేసి ముందస్తు గా తగిన సకారాత్మక చర్యల ను తీసుకొనే విధానాన్ని అవలంభించడం ద్వారా జలవాయు పరివర్తన సంబంధి సమస్యల ను ఎదుర్కనేందుకు దేశం తీసుకొన్న సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘ఇంటర్‌నేశనల్ సోలర్ అలయన్స్ వంటి కార్యక్రమాల కు భారతదేశం ఇప్పటికే నాయకత్వాన్ని వహించింది. మా మిశన్ ఎల్ఐఎఫ్ఇ (Mission LiFE) సమష్టి ప్రభావాన్ని ప్రసరించేటటువంటి భూ గ్రహ మిత్రపూర్వకమైన జీవనశైలి అవకాశాల పై శ్రద్ధ ను తీసుకొంటోంది. ‘రిడ్ యూస్, రీయూస్ ఎండ్ రీసైకిల్’ (‘తగ్గించడం, మళ్ళీ వాడడం మరియు పునర్వినియోగం లోకి తీసుకు రావడం’) అనేవి భారతదేశం అవలంబిస్తున్నటువంటి సాంప్రదాయిక జీవన శైలి లో భాగం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. జి-20 కి భారతదేశం అధ్యక్ష బాధ్యత లను వహించిన కాలం లో గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్సు ను ప్రారంభించడాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఈ కార్యక్రమాన్ని సమర్థించినందుకు గాను ఐఇఎ కు ధన్యవాదాల ను తెలియ జేశారు.

 

అన్ని వర్గాల ను కలుపుకొనిపోయే వైఖరి ఏ ఒక సంస్థ యొక్క సామర్థ్యాన్ని అయినా మరియు విశ్వసనీయత ను అయినా పెంపొందింప చేస్తుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ప్రతిభ, సాంకేతిక విజ్ఞానపరమైన శక్తి యుక్తులు మరియు నూతన ఆవిష్కరణ ల విషయం లో 1.4 బిలియన్ మంది భారతదేశ పౌరులు తోడ్పాటు ను ఇవ్వగలరు అన్నారు. ‘‘మేం ప్రతి ఒక్క మిశను కు విస్తృతి ని, వేగాన్ని, పరిమాణాన్ని మరియు నాణ్యత ను జతపరుస్తాం’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం పోషించేటటువంటి ఒక ప్రముఖ పాత్ర తో ఐఇఎ కు భారీ ప్రయోజనం అందుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐఇఎ యొక్క మంత్రుల స్థాయి సమావేశం ఫలప్రదం కావాలి అంటూ ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను తెలియ జేశారు. ఇప్పటికే అమలవుతున్నటువంటి భాగస్వామ్యాల ను బలపరచడం కోసం, మరి అలాగే కొత్త భాగస్వామ్యాల ను ఏర్పరచుకోవడం కోసం ఈ వేదిక ను ఉపయోగించుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘రండి .. మనమంతా స్వచ్ఛమైనటువంటి, కాలుష్యాని కి తావు ఉండనటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి ఒక ప్రపంచాన్ని నిర్మించుదాం’’ అని చివర లో శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s jewellery exports rise 2.4% to $9.17 billion; studded gold emerges as bright spot

Media Coverage

India’s jewellery exports rise 2.4% to $9.17 billion; studded gold emerges as bright spot
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా విభజన కారణంగా నష్టపోయిన బాధితుల ధైర్యాన్ని కొనియాడిన ప్రధానమంత్రి
August 14, 2026
పట్టుదలతో కూడిన శ్రమ, మానవ ప్రయత్నాల శక్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న పీఎం

పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా దేశ విభజన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరి ధైర్యసాహసాలను స్మరించుకుంటున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విభజన చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నభిన్నం చేసిందని, కుటుంబాలు చెల్లాచెదురయ్యాయని, ఎంతోమంది ప్రియమైన వారిని కోల్పోయారని, చెప్పలేనంత బాధను అనుభవించాల్సి వచ్చిందన్నారు.

కష్టాలను అధిగమించి ప్రజలు, వారి జీవితాలను పునర్మించుకున్నారని, ప్రతికూల పరిస్థితులను విజయంగా మలచుకుంటూ దేశ పురోగతికి తోడ్పాటునందించారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సంకల్ప బలం ఎంత గొప్పదో వారి జీవిత ప్రయాణాలు మనకు తెలియజేస్తాయన్నారు. దేశంలో ఐక్యతను, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించుకోవాలన్న సంకల్పాన్ని ఈ రోజు మరింత బలపరుస్తుందని… వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టి కృషి చేసేలా స్ఫూర్తినిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడి దేశ పురోగతికి కృషి చేసిన వారందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక నివాళులు అర్పించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో లక్ష్యాలను సాధించవచ్చని వారి ధైర్యసాహసాలు, సామర్థ్యాలు నిరూపించాయని పేర్కొన్నారు. దేశ సద్భావన, ఐక్యతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఒక సుభాషితాన్ని ప్రస్తావిస్తూ.. శ్రమ, పట్టుదల, అంకితభావంతో కూడిన ప్రయత్నాల వల్లే వివిధ కళలు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక నైపుణ్యాలు, హస్తకళలు, నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని, ఇవి విజయానికి బాటలు వేస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కేవలం అదృష్టాన్ని నమ్ముకుని ఉండిపోకుండా… ధైర్యం, శ్రమ శక్తి, నిరంతర ప్రయత్నాలతో స్థిరంగా గమ్యం దిశగా సాగాలని తెలిపారు. మానవ ప్రయత్నాలే భవితవ్యాన్ని నిర్ణయిస్తాయన్నారు.

సామాజిక మాధ్యమం "ఎక్స్" వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"ఇవాళ మనం పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే నిర్వహిస్తున్నాం. దేశ విభజన వల్ల ప్రభావితమైన వారి ధైర్యసాహసాలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. విభజన వల్ల ఎన్నో జీవితాలు చిన్నాభిన్నమై.. మరెన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ప్రియమైన వారిని కోల్పోయారు. ఎంతో వేదనను అనుభవించారు.

అదే సమయంలో ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించి ప్రజలు తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారు. కష్టాలను విజయాలుగా మలచుకున్నారు. దేశ పురోగతికి ఎంతో కృషి చేశారు. వారి జీవిత ప్రయాణాలు సంకల్పబలాన్ని గుర్తుచేస్తాయి.

దేశంలో ఐక్యతను, సౌభ్రాతృత్వానని పరిరక్షించుకోవాలన్న సంకల్పాన్ని ఈ రోజు మరింత బలపరుస్తుందని… వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టి కృషి చేసేలా స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తున్నా"

"పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడి దేశ ప్రగతికి అమూల్యమైన సేవలందించిన దేశవాసులందరికీ హృదయపూర్వక నివాళులు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యసాహసాలతో సంకల్ప బలం గొప్పతనాన్ని నిరూపించారు.

"विभाजन विभीषिका स्मृति दिवस पर उन सभी देशवासियों का हृदय से नमन, जिन्होंने उस वीभत्स दौर से निकलकर देश की प्रगति में अमूल्य योगदान दिया। उन्होंने अपने साहस और सामर्थ्य से दिखाया कि कैसे विपरीत परिस्थितियों में भी संकल्पों को सिद्ध किया जाता है। आइए, सद्भावना और एकजुटता की राष्ट्रीय भावना को और सशक्त करें।

उद्यमस्य प्रसादेन दृश्यन्ते विविधाः कलाः।
कातरा एव जल्पन्ति यद् भाव्यं तद् भविष्यति॥”

It is through hard work, enterprise and dedicated effort that diverse arts, science, technological skills, craftsmanship and innovations flourish, paving the way for success. Therefore, one should not remain dependent on fate; rather, one should move steadily towards one's goals with courage, diligence and persistent effort, for it is human endeavor that shapes destiny.