స్ట్రియా రాజధాని వియన్నాలో ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్‌తో  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మూడోసారి  ప్రధానమంత్రిగా కొనసాగడం చారిత్రకమంటూ బెలెన్ అభినందనలు తెలిపారు.

 

   రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తన ఆస్ట్రియా పర్యటన చరిత్రాత్మకమేగాక మరెంతో ప్రత్యేకమైనదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరస్పర ప్రయోజనాల సంబంధిత ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై వారిద్దరూ చర్చించారు. అలాగే పర్యావరణ సుస్థిరత, భూతాపం సమస్య పరిష్కారం వగైరాలపైనా ఆలోచనలను పంచుకున్నారు. ఈ దిశగా పునరుత్పాదక ఇంధనం... ప్రత్యేకించి సౌర, జల, జీవ ఇంధనాల వంటి రంగాల్లో పరస్పర ప్రయోజనకర సహకారానికిగల అవకాశాలపై నేతలిద్దరూ చర్చించారు. కాగా, వాన్ డెర్ బెలెన్ వీలైనంత త్వరగా భారత పర్యటనకు రావాలన్న తన ఆహ్వానాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi pitches India as stable investment destination amid global turbulence

Media Coverage

PM Modi pitches India as stable investment destination amid global turbulence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 జనవరి 2026
January 12, 2026

India's Reforms Express Accelerates: Economy Booms, Diplomacy Soars, Heritage Shines Under PM Modi