ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ) లోకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు స్వాగతం పలికారు. ఈ నిర్ణయాన్ని తీసుకొన్నందుకు గాను యుఎస్ ప్రెసిడెంటు శ్రీ జో బైడెన్ కు శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు.
జల వాయు అంశాల లో ప్రెసిడెంటు కు విశేష దూత అయిన శ్రీ జాన్ కేరీ ట్వీట్ కు ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ప్రత్యుత్తరాన్ని ఇస్తూ, అందులో -
‘‘అద్భుతమైన సమాచారం @ClimateEnvoy ! నేను @POTUS కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యుఎస్ఎ కు @isolaralliance లోకి మన:పూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. సతత జగతి కి గాను సౌర శక్తి ని ఉపయోగించుకొనే విషయం లో మన ఉమ్మడి అన్వేషణ తో అలయన్స్ మరింత గా బలోపేతం అవుతుంది.’’ అని పేర్కొన్నారు.
Wonderful news @ClimateEnvoy! I thank @POTUS and wholeheartedly welcome the USA to the @isolaralliance. This will further strengthen the Alliance in our shared quest of harnessing solar energy for a sustainable planet. https://t.co/vWlzCmws3q
— Narendra Modi (@narendramodi) November 10, 2021


