రూ.7,160 కోట్ల వ్యయంతో నిర్మించిన బెంగళూరు మెట్రో పసుపు రంగు మార్గాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి
రూ. 15,610 కోట్లకు పైగా విలువైన బెంగళూరు మెట్రో మూడో దశకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

ఆగస్టు 10న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత బెంగళూరు మెట్రో పసుపు రంగు మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఆర్‌వీ రోడ్ (రాగిగుడ్డ) నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయన బెంగళూరులో పట్టణ రవాణాకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయడంతోపాటు కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. ఒక కార్యక్రమంలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

బెంగళూరు మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్‌లోని ఆర్‌వీ రోడ్ (రాగిగుడ్డ) నుంచి బొమ్మసంద్ర వరకు ఉన్న పసుపు రంగు మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 19 కి.మీ.లకు పైగా ఉన్న ఈ మార్గాన్ని రూ.7,160 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఇందులో 16 స్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గం ప్రారంభంతో కర్ణాటక రాజధాని నగరంలో రైళ్లు తిరుగుతోన్న మెట్రో 96 కి.మీ.ల పైకి చేరుతుంది.

రూ. 15,610 కోట్లతో చేపట్టనున్న బెంగళూరు మెట్రో 3వ దశకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ దశలో మొత్తం 44 కి.మీ.ల మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఇందులో 31 ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి. నివాస, పారిశ్రామిక, వాణిజ్య , విద్యా రంగాలకు చెందిన నగరవాసుల ప్రయాణ అవసరాలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది.

బెంగళూరు నుంచే ప్రధాని 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రారంభించనున్నారు. ఇవి బెంగళూరు నుంచి బెలగావి, అమృత్‌సర్ నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, నాగ్‌పూర్ (అజ్ని) నుంచి పుణే వరకు నడుస్తాయి. ఈ అధిక వేగంతో నడిచే రైళ్లు ప్రాంతీయ అనుసంధానతను గణనీయంగా పెంచటంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending

Media Coverage

Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026