చంద్రయాన్-3 మిషన్ లో భాగస్వాములైన ఇస్రో శాస్ర్తవేత్తలతో ప్రధానమంత్రి సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనల నుంచి తిరిగి రాగానే నేరుగా బెంగళూరు వెళ్లి ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ ను (ఇస్ర్టాక్) ఆగస్టు 26వ తేదీ ఉదయం 7.15 గంటలకు సందర్శించనున్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ నుంచి నేరుగా ఆయన బెంగళూరు చేరతారు.
ఇస్రోలో చంద్రయాన్-3 మిషన్ లో భాగస్వాములైన శాస్ర్తవేత్తలను ఆయన కలిసి సంభాషించనున్నారు. చంద్రయాన్-3 మిషన్ పురోగతి, అధ్యయనాల గురించి కూడా ఆయనకు శాస్ర్తవేత్తలు వివరిస్తారు.