These initiatives will boost connectivity and improve the quality of life for people: PM
Today, a vigorous nationwide campaign to modernise railways is underway, and we are determined that West Bengal should not be left behind in this effort: PM
The central government is rapidly expanding the railway infrastructure in West Bengal: PM
Ports like Kolkata and Haldia have long been major centers of trade in Eastern India: PM
Mechanisation at the Haldia Dock Complex will speed up cargo operations, enhance port capacity and strengthen trade facilities: PM

గవర్నర్ ఆర్ ఎన్ రవి గారు, కేంద్ర మంత్రివర్గంలో  నా సహచరులు శంతను ఠాకూర్ గారు, సుకాంత మజుందార్ గారు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారు, నా తోటి పార్లమెంటు సభ్యులు శమిక్ భట్టాచార్య గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, సోదరీ సోదరులారా!

నేడు కోల్‌కతా గడ్డపై నుంచి పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశ అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయం లిఖించబోతుంది. సుమారు 18 వేల కోట్ల రూపాయలకుపైగా విలువైనన రహదారి, రైల్వే, ఓడరేవు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశానికి కొత్త ఊపునిస్తాయి. వాణిజ్యం, పరిశ్రమలను ప్రోత్సహిస్తాయి. లక్షలాది మంది జీవితాలను సులభతరం చేస్తాయి. వారికి కొత్త అవకాశాలను అందిస్తాయి. ఖరగ్‌పూర్-మోరెగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి కావడంతో పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయి. దుబ్రాజ్‌పూర్ బైపాస్, కంగ్‌షవతి, శిలావతి నదులపై నిర్మిస్తున్న పెద్ద వంతెనలు అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ ప్రాజెక్టుల సందర్భంగా పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

నేడు దేశంలో రైల్వేలను ఆధునీకరించేందుకు వేగవంతమైన ఉద్యమం జరుగుతోంది. ఇందులో పశ్చిమ బెంగాల్ వెనుకబడకూడదన్నదే మా సంకల్పం. అందుకే పశ్చిమ బెంగాల్ రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం బలమైన ప్రయత్నాలు చేస్తోంది. నేడు కలైకుండ, కనిమహులి విభాగాల్లో స్వయంచాలక బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను దేశానికి అంకితం చేశాం. ఇది రద్దీగా ఉండే రైలు మార్గాల సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తుంది. ప్రయాణీకులకు వేగం, సౌకర్యం కూడా మెరుగుపడేలా చేస్తుంది.

మిత్రులారా,

నేడు కామాఖ్యగుడి, అనారా, తమ్లుక్, హల్దియా, బరాభుమ్, సియూరి అనే ఆరు స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా ప్రారంభించాం. ఈ స్టేషన్‌లలో బెంగాల్ సంస్కృతి ఇప్పుడు మరింత ప్రకాశిస్తోంది. ఇక్కడ ఇంకా మరెన్నో స్టేషన్లను కూడా పునరాభివృద్ధి చేస్తున్నాం. పురూలియా, ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును కూడా ప్రారంభించాం. ఈ రైలు సర్వీసు కేవలం పశ్చిమ బెంగాల్ ప్రజలకే కాకుండా జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

మిత్రులారా,

రహదారి, రైలు అనుసంధానతలు ఎంత ముఖ్యమో ఓడరేవులు, జల రవాణాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయి. దశాబ్దాలుగా ఈ విషయంలో తూర్పు భారతదేశం సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. కానీ నేడు జలమార్గాలు వాణిజ్యం, పారిశ్రామిక పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తున్నాయి. ఈ దిశగా నేడు ముఖ్యమైన ఓడరేవు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. కోల్‌కతా, హల్దియా వంటి ఓడరేవులు తూర్పు భారతదేశంలో చాలా కాలంగా ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయి. హల్దియా డాక్ కాంప్లెక్స్‌ను యాంత్రీకరిస్తున్నాం. ఇది సరుకు రవాణా కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది. ఓడరేవు సామర్థ్యాన్ని పెంచుతుంది. వాణిజ్యానికి కొత్త సౌకర్యాలను కల్పిస్తుంది. కోల్‌కతా డాక్ సిస్టమ్‌లో బాస్కుల్ వంతెన పునరుద్ధరణ పనులు కూడా జరుగుతున్నాయి. కిడ్డర్‌పూర్ డాక్ వద్ద సరుకు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంపై కూడా మేం దృష్టి సారిస్తున్నాం. ఈ ప్రాజెక్టులన్నీ తూర్పు ప్రాంతంలో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Women’s employment rate rises to 39% in 2025 from 22% in 2017: Mansukh Mandaviya

Media Coverage

Women’s employment rate rises to 39% in 2025 from 22% in 2017: Mansukh Mandaviya
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam highlighting the true resolve of a representative
April 29, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today highlighting the true resolve of a representative.

The Prime Minister remarked that as vigilant citizens of the country, it is our duty to ensure record voting to make democracy even stronger.

The Prime Minister wrote on X:

"देश के एक सजग नागरिक के रूप में हमारा कर्तव्य है कि हम लोकतंत्र को और अधिक सशक्त बनाने के लिए रिकॉर्ड मतदान सुनिश्चित करें। इस तरह हम न केवल भारतवर्ष के नवनिर्माण में अपनी सक्रिय भागीदारी निभा सकते हैं, बल्कि एक समर्थ और समृद्ध राष्ट्र की नींव को और मजबूत कर सकते हैं।

राज्ञो हि व्रतमुत्थानं यज्ञः कार्यानुशासनम्।

दक्षिणा वृत्तिसाम्यं च दीक्षितस्याभिषेचनम्॥"

From the perspective of the welfare of the people, continuously uplifting them, faithfully performing duties as a sacred responsibility, ensuring fair judgment, giving generously, treating everyone with equality, and keeping oneself pure, disciplined and dedicated with a consecrated spirit, this is the true resolve of a representative.