ఈ నెల 26న ఉదయం సుమారు 11 గంటల వేళకు సంవిధాన్ సదన్‌లోని సెంట్రల్ హాల్లో నిర్వహించే రాజ్యాంగ దినోత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాజ్యాంగాన్ని అంగీకరించిన తరువాత ఈ సంవత్సరంతో 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం.
ఈ ఉత్సవాల్లో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు సహా ఇతరులు పాలుపంచుకోనున్నారు.
కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. భారత రాజ్యాంగ పీఠికను చదివే వారికి రాష్ట్రపతి నాయకత్వం వహిస్తారు. తొమ్మిది భాషల్లో భారత రాజ్యాంగ అనువాద పుస్తకాలను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ఆ భాషల్లో మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, తెలుగు, ఒడియాలతో పాటు అస్సామీస్ కూడా ఉంది. ‘‘భారత్ కే సంవిధాన్ మే కళా అవుర్ కాలిగ్రఫి’’ పేరుతో ఒక స్మారక చిన్న పుస్తకాన్ని కూడా ఇదే కార్యక్రమంలో ఆవిష్కరిస్తారు.


