పార్లమెంటు సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల ఫ్లాట్లను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 నవంబర్, 23వ తేదీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి లోక్ ‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా కూడా హాజరుకానున్నారు.

న్యూఢిల్లీ లోని డాక్టర్ బి.డి. మార్గ్ వద్ద ఈ ఫ్లాట్లను నిర్మించారు.  80 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎనిమిది పాత భవనాల స్థానంలో ఇప్పుడు 76 ఫ్లాట్లను నిర్మించారు.  మంజూరు చేసిన వ్యయం కంటే సుమారు 14 శాతం పొదుపుతో ఈ ఫ్లాట్ల నిర్మాణం పూర్తయ్యింది. కోవిడ్-19 ప్రభావం ఉన్నప్పటికీ సకాలంలో ఈ ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది.

ఈ నిర్మాణంలో – ఫ్లై బూడిద మరియు నిర్మాణం,కూల్చివేత వ్యర్థాలతో తయారు చేసిన ఇటుకలు;  థర్మల్ ఇన్సులేషన్ మరియు శక్తి సామర్థ్యం కోసం డబుల్ గ్లేజ్డ్ కిటికీలు;  విద్యుత్తును పొదుపు చేయడానికి ఉపకరించే ఎల్.ఈ.డి. బల్బులు, ఉపకరణాలు;   మనుషులు ఉన్నప్పుడు మాత్రమే దీపాలు వెలిగే విధంగా సెన్సార్ల ఏర్పాటు;  తక్కువ విద్యుత్తు వినియోగం కోసం వి.ఆర్.వి. వ్యవస్థ కలిగిన ఎయిర్ కండీషనర్లు, నీటి సంరక్షణ కోసం తక్కువ వేగంతో నీటిని విడుదల చేసే ఉపకరణాల ఏర్పాటు;  వర్షపు నీటి  సేకరణ వ్యవస్థ, పైకప్పు మీద సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు వంటి అనేక హరిత భవన నిర్మాణ కార్యక్రమాలను అమలుచేశారు. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Safe, Inclusive AI For All': PM Modi Says India Helping Shape 'Force For Good' Conversation

Media Coverage

'Safe, Inclusive AI For All': PM Modi Says India Helping Shape 'Force For Good' Conversation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 ఫెబ్రవరి 2026
February 18, 2026

23 Nations, One Vision: PM Modi Takes India Stack & Responsible AI Global