రుణ సంధానిత ప్రభుత్వ పథకాల జాతీయ పోర్టల్‌ ‘జన సమర్థ్‌’కు ప్రధాని శ్రీకారం

 

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జూన్‌ 6న ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల విశిష్టత వారోత్సవాలను న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 10:30 గంటలకు ప్రారంభిస్తారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (ఆకం)లో 2022 జూన్ 11దాకా వారంపాటు ఈ వేడుకలు సాగుతాయి.

   ఈ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా రుణ సంధానిత ప్రభుత్వ పథకాల జాతీయ పోర్టల్ ‘జన సమర్థ్‌’కు ప్రధాని శ్రీకారం చుడతారు. ఇది ప్రభుత్వ రుణసంధాన పథకాలకు సంబంధించి ఏక గవాక్షంగా ఉంటుంది. ఈ మేరకు రుణదాతలతో లబ్ధిదారులను నేరుగా అనుసంధానించే మొట్టమొదటి వేదికగా ఇది ఏర్పాటవుతోంది. సరళ-సులభ డిజిటల్ ప్రక్రియల ద్వారా వివిధ రంగాలకు సముచిత ప్రభుత్వ ప్రయోజనాలను అందించడం ‘జన సమర్థ్’ పోర్టల్ ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా ఆ దిశగా మార్గనిర్దేశం చేయడం ద్వారా వాటి సమగ్ర వృద్ధి, ప్రగతికి తోడ్పాటునిస్తుంది. తదనుగుణంగా అనుసంధానిత పథకాలన్నిటి సమగ్ర సదుపాయాలనూ ఈ  పోర్టల్ అందుబాటులో ఉంచుతుంది.

   గడచిన ఎనిమిదేళ్లలో ఈ రెండు మంత్రిత్వ శాఖల ప్రగతి పయనాన్ని వివరించే డిజిటల్ ప్రదర్శనను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. అదే సమయంలో  ₹1, ₹2, ₹5, ₹10, ₹20 విలువగల నాణాల ప్రత్యేక సిరీస్‌ను కూడా ప్రధానమంత్రి విడుదల చేస్తారు. ఈ ప్రత్యేక శ్రేణి నాణాలు ‘ఆకం’లోగో ఇతివృత్తంతో ఉంటాయి. దృష్టి లోపంగల వ్యక్తులు కూడా సులభంగా గుర్తించే విధంగా ఇవి తయారవుతాయి.

   ఈ కార్యక్రమం దేశంలోని 75 ప్రదేశాల్లో ఏకకాలంలో నిర్వహించబడుతుంది. అలాగే ఆయా ప్రదేశాలన్నీ ప్రధాన వేదికతో వర్చువల్ మార్గంలో సంధానించబడి ఉంటాయి.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony

Media Coverage

Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 06 ఆగష్టు 2026
August 06, 2026

New India Defies the Storm: Multi-Front Progress Under PM Modi