ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైల్వేల కు చెందిన అనేక కీలక ప్రాజెక్టుల ను 2021 జూలై 16న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా గుజరాత్ లో ప్రారంభించనున్నారు. అనేక పథకాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేయనున్నారు కూడా. ఈ కార్యక్రమం లో భాగం గా గుజరాత్ లోని సైన్స్ సిటీ లో ఆక్వాటిక్స్-రోబోటిక్స్ గ్యాలరీ ని, నేచర్ పార్కు ను కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ఈ మేరకు ఆయన చేతులమీదుగా ప్రారంభం కానున్న రైల్వే ప్రాజెక్టుల లో సరికొత్త గా పునరాభివృద్ధి చేసినటువంటి గాంధీనగర్ రాజధాని రైల్వే స్టేశన్, గేజ్‌మార్పిడి కి లోనైనటువంటి, విద్యుదీకరణ జరిగినటువంటి మహెసాణా-వరేఠా మార్గం, కొత్త గా విద్యుదీకరించినటువంటి సురేంద్రనగర్-పిపావావ్ సెక్శన్ కూడా ఉన్నాయి.
ప్రధాన మంత్రి రాజధాని గాంధీనగర్ రాజధాని కి, వరేఠా కు మధ్య రెండు కొత్త రైళ్ల కు కూడా జెండా ను చూపెట్టి వాటిని ప్రారంభించనున్నారు. ఆ రెండు రైళ్ల లో ఒకటి గాంధీనగర్ రాజధాని-వారాణసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు కాగా రెండోది ఎమ్ఇఎమ్ యు సర్వీస్ రైలు.
గాంధీనగర్ రాజధాని రైల్వే స్టేశన్ పునరాభివృద్ధి
గాంధీనగర్ రాజధాని రైల్వే స్టేశన్ ను 71 కోట్ల రూపాయల తో ఉన్నతీకరించడమైంది. స్టేశన్ లో ఆధునిక విమానాశ్రయాల తరహా లో ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించడం జరిగింది. ఈ స్టేశన్ లో ప్రత్యేక టికెట్ బుకింగ్ కౌంటర్, ఏటవాలు మార్గం, లిఫ్టు, ప్రత్యేకంగా వాహనాల ను నిలిపి ఉంచే చోటు మొదలైనవి ఏర్పాటు చేసి దీనిని దివ్యాంగుల కు అనుకూలమైన స్టేశన్ గా మలచడ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమైంది. భవనం అంతటినీ హరిత భవన ధ్రువీకరణ సదుపాయాల తో రూపొందించడమైంది. అత్యాధునిక ఎక్స్ టీరియర్ ఫ్రంట్ లో 32 రోజువారీ ఇతివృత్తాల తో కూడి ఉండే విద్యుద్దీపాల అలంకరణ వినూత్న శోభ ను ప్రసరించనుంది. స్టేశన్ లో ఒక ఫైవ్ స్టార్ హోటల్ ను కూడా స్థాపించనున్నారు.
మహెసాణా-వరేఠా గేజ్ మార్పిడి మరియు విద్యుతీకరించిన బ్రాడ్ గేజ్ మార్గం (వడ్ నగర్ స్టేశన్ సహా)
293 కోట్ల రూపాయల వ్యయం తో 55 కిలోమీటర్ల మహెసాణా-వరేఠా గేజ్ మార్పిడి పని ని, దానితో పాటే 74 కోట్ల రూపాయల వ్యయం తో విద్యుదీకరణ పనుల ను పూర్తి చేయడం జరిగింది. దీనిలో మొత్తం 10 స్టేశన్ లు ఉన్నాయి. వాటి లో విస్ నగర్, వడ్ నగర్, ఖేరాలూ, వరేఠా ల తాలూకు నాలుగు నూతనం గా నిర్మించిన స్టేశన్ భవనాలు కూడా ఉన్నాయి. ఈ సెక్శన్ లో ఒక ప్రముఖ స్టేశన్ వడ్ నగర్. దీనిని ‘వడ్ నగర్-మోఢెరా-పాటన్ హెరిటేజ్ సర్క్యూట్ లో భాగం గా అభివృద్ధిపరచడమైంది. రాతి నకాశీ పని ని ఉపయోగించి వడ్ నగర్ స్టేశన్ భవనానికి సుందరమైన ఆకృతి ని ఇవ్వడమైంది. చుట్టుపక్కల రాకపోకలు జరిగే క్షేత్రాన్ని చదును చేసి అలంకరించడమైంది. వడ్ నగర్ ఇప్పుడు ఒక బ్రాడ్ గేజ్ లైన్ తో ముడిపడిపోనుంది. మరి ఈ సెక్శన్ గుండా ప్రయాణికుల రైళ్లతో పాటు సరకు రవాణా బండ్ల ను ఏ బాధా లేకుండా నడపడానికి వీలు ఏర్పడుతుంది.
సురేంద్ర నగర్ - పీపావావ్ సెక్శన్ విద్యుదీకరణ
ఈ ప్రాజెక్టు ను మొత్తం 289 కోట్ల రూపాయల వ్యయం తో పూర్తి చేయడమైంది. ఈ పథకం పాలన్ పుర్, అహమదాబాద్ లు సహా దేశం లోని ఇతర ప్రాంతాల నుంచి పీపావావ్ రేవు దాకా మధ్య లో ఆగనక్కరలేకుండానే సరకుల ను మోసుకుపోవడం లో సౌకర్యాన్ని కల్పించగలుగుతుంది. లోకో మార్పిడి కారణం గా ఆపడాన్ని తప్పిస్తూ ఇప్పుడు ఇది అహమదాబాద్, విరమ్ గామ్, సురేంద్రనగర్ ల యార్డుల లో ఇంజిన్ ల మార్పు కోసం రైళ్లు ఎదురుచూడటం తగ్గుతుందన్నమాట.
ఆక్వాటిక్స్ గ్యాలరీ
ఈ అత్యాధునిక సార్వజనిక ఆక్వాటిక్స్ గ్యాలరీ లో ప్రపంచం లోని వివిధ ప్రాంతాల కు చెందిన జలచర ప్రజాతుల కు ఉద్దేశించినటువంటి ప్రత్యేక సరస్సులు ఉన్నాయి. వాటి లో ఒక ముఖ్య చెరువు లో యావత్తు ప్రపంచం లోని ప్రధాన సొరచేప లు ఉన్నాయి. ఇక్కడ ఒక అపురూపమైనటువంటి 28 మీటర్ ల పొడవైన వాక్ అవే టనల్ కూడా ఉంది. అది సందర్శకుల కు ఒక అపూర్వమైనటువంటి అనుభూతి ని అందిస్తుంది.
రోబోటిక్స్ గ్యాలరీ
రోబోటిక్స్ గ్యాలరీ వివిధ రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానాల తో సందర్శకులు మమేకం అయ్యేందుకు అనువు గా ఏర్పాటు చేయబడింది. నిత్య పరిణామశీలమైన రోబోటిక్స్ రంగాన్ని లోతు గా అన్వేషించేందుకు ఇది ఒక వేదిక కానుంది. ఈ గ్యాలరీ ప్రవేశం ద్వారం వద్ద అత్యంత భారీ పరిమాణం తో ఒక ట్రాన్స్ ఫార్మర్ రోబో ప్రతిరూపం దర్శనమిస్తుంది. ఈ గ్యాలరీ లో అత్యంత ఆకర్షణీయమైంది ఏది అంటే అది రిసెస్శన్ వద్ద కనిపించే హ్యూమనాయిడ్ రోబో. ఇది సంతోషం, సంభ్రమం, ఉద్వేగం తదితర హావభావాల ను ప్రదర్శించడమే కాకుండా వచ్చే పోయే సందర్శకుల తో మాట్లాడుతుంది. వివిధ రంగాల కు చెందిన రోబోల ను గ్యాలరీ లోని వేరు వేరు అంతస్తుల లో ఏర్పాటు చేశారు. వీటి లో వైద్యం, వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ రంగాలు సహా రోజువారీ జీవితం లో వినియోగించే ఆప్లికేశన్స్ కు సంబంధించిన రోబో లు ఉంటాయి.
నేచర్ పార్కు
ఈ పార్కు లో మిస్ట్ గార్డెన్, చెస్ గార్డెన్, సెల్ఫీ పాయింట్స్, స్కల్ప్ చర్ పార్కు, అవుట్ డోర్ మేజ్ ల వంటి అందమైన ఆకర్షణలు ఉన్నాయి. పిల్లల కోసం రూపొందించినటువంటి తికమక పెట్టే మార్గాల తో కూడిన పొదలు ఉన్నాయి. ఈ పార్కు లో జడల ఏనుగు, రాకాసి పక్షులు, కత్తికోర ల సింహం వంటి అంతరించిన పలు జంతుజాతుల శిల్పాలతో పాటు వాటికి సంబంధించిన శాస్త్రీయ సమాచారం కూడా పిల్లల కోసం ఏర్పాటు చేయడమైంది.
గుజరాత్ సైన్స్ సిటీ లో ఆక్వాటిక్స్-రోబోటిక్స్ గ్యాలరీ ని, ఇంకా నేచర్ పార్కు ను కూడా ప్రారంభించనున్న ప్రధాన మంత్రి