మానసిక ఆరోగ్యంతోనే వందశాతం ఆరోగ్యంగా ఉండటం సాధ్యం అవుతుందని మానసిక ఆరోగ్య దినోత్సవం మనకు సందేశమిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
పరుగులాంటి నేటి జీవన విధానంలో- ఆత్మావలోకనానికీ, ఇతరుల పట్ల దయ చూపడానికీ ఎంతో ప్రాధాన్యం ఉందన్న సంగతిని ఈ దినోత్సవం గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మానసిక ఆరోగ్యంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని, ప్రజలు ఈ దిశగా గట్టి ప్రయత్నం చేయాలనీ ఆయన సూచించారు.
మానసిక రోగులు కోలుకోవడానికీ, ఆనందంగా ఉండటానికీ మానసిక చికిత్సాలయాల్లో పని చేస్తున్న అందరినీ ఆయన అభినందించారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని ఇలా పొందుపరిచారు:
‘‘మానసిక ఆరోగ్యంతో వందశాతం ఆరోగ్యంగా ఉండటం సాధ్యం అవుతుందని మానసిక ఆరోగ్య దినోత్సవం మనకు సందేశమిస్తోంది. నేటి ఉరుకులు పరుగుల జీవన విధానంలో- ఆత్మావలోకనానికీ, ఇతరుల పట్ల దయ చూపడానికీ ఎంతో ప్రాధాన్యం ఉందన్న సంగతిని ఈ దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది. మానసిక ఆరోగ్యంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని, ప్రజలు ఈ దిశగా గట్టి ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మానసిక రోగులు కోలుకోవడానికీ, ఆనందంగా ఉండటానికీ మానసిక చికిత్సాలయాల్లో పని చేస్తున్న అందరినీ అభినందిస్తున్నాను’’.
World Mental Health Day serves as a powerful reminder that mental health is a fundamental part of our overall well-being. In a fast-paced world, this day underscores the importance of reflecting and extending compassion to others. Let us also work collectively to create…
— Narendra Modi (@narendramodi) October 10, 2025


