యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు.
యూఏఈపై దాడులను ప్రధానమంత్రి ఖండించారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో యూఏఈకి భారత్ అండగా ఉంటుందని తెలిపారు.
యూఏఈలో నివసిస్తున్న భారతీయుల పట్ల చూపుతున్న ఆదరణకు ఆ దేశ అధ్యక్షుడికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్రిక్తతలను తగ్గించటం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు భారత్ మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"యూఏఈ అధ్యక్షుడు, నా సోదరుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడాను. యూఏఈపై జరిగిన దాడులను ఖండించాను. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశాను. ఈ క్లిష్ట సమయంలో యూఏఈకి భారత్ అండగా ఉంటుంది.
యూఏఈలో నివసిస్తున్న భారత సమాజం పట్ల చూపిస్తున్న శ్రద్ధకు ఆ దేశ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపాను. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గి, శాంతిభద్రతలు, స్థిరత్వం నెలకొనేందుకు మేం మద్దతిస్తాం".
Spoke with President of the UAE, my brother Sheikh Mohamed bin Zayed Al Nahyan. Strongly condemned the attacks on the UAE and condoled the loss of lives in these attacks. India stands in solidarity with the UAE in these difficult times.
— Narendra Modi (@narendramodi) March 1, 2026
Thanked him for taking care of the Indian…


