గౌరవ కువైట్ యువరాజు షేక్ సబా అల్ ఖలీద్ అల్ హమద్ అల్ ముబారక్ అల్ సబాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు.
ఈ సందర్భంగా కువైట్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఉల్లంఘనను భారత్ ఖండిస్తుందని.. ఈ కష్టకాలంలో కువైట్ ప్రజలకు అండగా నిలుస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు.
ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో చర్చలు, దౌత్యం ముఖ్యమని ఇరు నేతలు పేర్కొన్నారు.
కువైట్‌లోని భారత ప్రజల భద్రత, సంక్షేమం విషయంలో కువైట్ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతును ప్రధానమంత్రి అభినందించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా అన్నారు.
‘‘గౌరవ కువైట్ యువరాజు షేక్ సబా అల్ ఖలీద్ అల్ హమద్ అల్ ముబారక్ అల్ సబాతో నేడు ఫలప్రదమైన టెలిఫోన్ సంభాషణ జరిగింది. కువైట్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఉల్లంఘనను భారత్ ఖండిస్తోంది. ఈ కష్టకాలంలో అక్కడి ప్రజలకు అండగా నిలుస్తుంది.
ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో చర్చలు, దౌత్యం ముఖ్యమని తెలిపాం. కువైట్‌లోని ప్రవాస భారతీయుల భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడంలో కువైట్ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతును అభినందించాను’’.
Had a productive telephone conversation with Crown Prince of Kuwait, H.H. Sheikh Sabah Al-Khaled Al-Hamad Al-Mubarak Al-Sabah. India condemns violation of Kuwait's sovereignty and territorial integrity and stands with its people in this difficult hour.
— Narendra Modi (@narendramodi) March 3, 2026
We underscored the…
أجرينا محادثة هاتفية مثمرة مع ولي عهد الكويت، صاحب السمو الشيخ صباح الخالد الحمد المبارك الصباح. تدين الهند انتهاك سيادة الكويت ووحدة أراضيها، وتقف إلى جانب شعبها في هذه الظروف الصعبة.
— Narendra Modi (@narendramodi) March 3, 2026
وشددنا على أهمية الحوار والدبلوماسية في استعادة السلام والاستقرار الإقليميين. ونعرب عن تقديرنا…


