దేశ పౌరుల నిస్వార్థ సేవా భావనను చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు:
‘‘ఛాయామన్యస్య కుర్వన్తి తిష్ఠన్తి స్వయమాతపే
ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ’’
ఈ సుభాషితం, ‘‘వృక్షాలు తీవ్రమైన ఎండను స్వయంగా ఓర్చుకుంటాయి. అయినప్పటికీ, ఇతరులకు నీడను అందిస్తాయి. వాటి పండ్లు కూడా అన్యుల కోసమే. చెట్లు నిస్వార్థమైనవి. ఉత్తమ భావాలు కలవారి లాగా అవి ఎల్లప్పుడూ ఇతరులకు సుఖాన్ని సమకూర్చి, మేలు చేస్తుంటాయి’’ అని మనకు సూచిస్తోంది.
ఒక దేశం వాస్తవిక బలం ఆ దేశ పౌరుల స్వార్థ రహిత భావనలో ఇమిడి ఉంటుంది. ఇది ప్రజలను ఒకరి నుంచి మరొకరు నేర్చుకొనేందుకు స్ఫూర్తిని అందిస్తుంది. మన సమాజాన్ని మరింత ఎక్కువ శక్తిమంతంగా, సమృద్ధంగా, కరుణామయంగా తీర్చిదిద్దుతుందని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘దేశం అసలు శక్తి ఆ దేశ పౌరుల నిస్వార్థ సేవా భావనలో ఇమిడి ఉంటుంది. దీంతో ప్రజలు ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తిని పొందుతారు. మన సమాజం కూడా మరింత సమృద్ధం అవుతుంది.
ఛాయామన్యస్య కుర్వన్తి తిష్ఠన్తి స్వయమాతపే
ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ’’ అని పేర్కొన్నారు.
राष्ट्र की असली शक्ति उसके नागरिकों की निःस्वार्थ सेवा भावना में निहित है। इससे लोग एक दूसरे से प्रेरित होते हैं, साथ ही हमारा समाज भी और समृद्ध होता है।
— Narendra Modi (@narendramodi) April 27, 2026
छायामन्यस्य कुर्वन्ति तिष्ठन्ति स्वयमातपे।
फलान्यपि परार्थाय वृक्षाः सत्पुरुषा इव॥ pic.twitter.com/kYqB92qdsR


