ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. 1930వ సంవత్సరం ఇదే రోజు మొదలైన దండి యాత్రలో పాల్గొన్న మహనీయులందరికీ నివాళులు అర్పించారు.
సత్యానిదే గెలుపు అని స్పష్టం చేస్తున్న ఈ కింది సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధాని పంచుకున్నారు.
‘‘సత్యమేవ జయతి నానృతం సత్యేన పన్థా వితతో దేవయాన:
యేనాక్రమన్త్‌రుషయో హ్యాప్తకామా యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్’’.
నిజానిదే ఎల్ల వేళలా పైచేయి అవుతూ ఉంటుంది. అబద్ధం చివరకు మాసిపోతుంది. ఈ కారణంగా, రుషులు ఏ మార్గంలో అయితే నడచి బ్రహ్మానందాన్ని పొందడమే కాక పరమ సత్యాన్ని కూడా గ్రహించారో.. ఆ దారినే మనం అనుసరించాలని ఈ సుభాషితం సూచిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘1930వ సంవత్సరంలో ఇదే రోజున దండి యాత్రను మొదలుపెట్టారు. దీనిలో పాల్గొన్న మహనీయులందరినీ శ్రద్ధ పూర్వకంగా స్మరించుకొందాం.
సత్యమేవ జయతి నానృతం సత్యేన పన్థా వితతో దేవయాన:
యేనాక్రమన్త్‌రుషయో హ్యాప్తకామా యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్’’ అని పేర్కొన్నారు.
सन् 1930 में आज ही के दिन दांडी मार्च की शुरुआत हुई थी। इसमें शामिल सभी विभूतियों का श्रद्धापूर्वक स्मरण!
— Narendra Modi (@narendramodi) March 12, 2026
सत्यमेव जयति नानृतं सत्येन पन्था विततो देवयानः।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत्सत्यस्य परमं निधानम्॥ pic.twitter.com/8xIDgxvx9y


