శాంతి, సంతోషాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘శాంతితుల్యం తపో నాస్తి న సంతోషాత్ పరం సుఖమ్
న తృష్ణాయా: పరో వ్యాధిర్న చ ధర్మో దయాపర:’’
శాంతిని మించిన ప్రయత్నమేదీ లేదు, సంతోషాన్ని మించిన ఆనందం మరొకటి లేదు, లోభాని కన్నా మహా వ్యాధి మరేదీ లేదు.. దయను మించిన గొప్ప ధర్మం లేనేలేదనే సందేశాన్ని ఈ సుభాషితం అందిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘శాంతితుల్యం తపో నాస్తి న సంతోషాత్ పరం సుఖమ్
న తృష్ణాయా: పరో వ్యాధిర్న చ ధర్మో దయాపర:’’ అని పేర్కొన్నారు.
शान्तितुल्यं तपो नास्ति न सन्तोषात् परं सुखम्।
— Narendra Modi (@narendramodi) January 27, 2026
न तृष्णायाः परो व्याधिर्न च धर्मो दयापरः।। pic.twitter.com/QtawVKTfo0


