తొమ్మిదో సంచిక ‘పరీక్షా పే చర్చ (పీపీసీ)-2026’లో విద్యార్థులతో తన సంభాషణకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. పీపీసీ-2026 రెండో ఎపిసోడ్‌లో కోయంబత్తూర్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, అస్సాంలకు చెందిన ఎగ్జామ్ వారియర్స్‌తో ప్రధాన మంత్రి ముచ్చటించారు. ‘పరీక్షా పే చర్చ’ ప్రత్యేక ఎడిషన్‌కు విద్యార్థులను ఆహ్వానిస్తూ, ఈసారి ఈ కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించామని శ్రీ మోదీ చెప్పారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ:
‘‘తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన #ParikshaPeCharcha26 లో విద్యార్థులతో ముచ్చటించడం గొప్ప అనుభవం. అంకుర సంస్థలు, ఏఐ నుంచి క్రమశిక్షణ, వికసిత భారత్‌ను సాధించాలనే ఆకాంక్షల వరకు, నేటి యువతకున్న ఆసక్తి, స్పష్టత అసాధారణమైనవి.’’
Interacting with students during #ParikshaPeCharcha26 in Coimbatore, Tamil Nadu was a phenomenal experience. From Startups and AI to self-discipline and dreams of building a Viksit Bharat, the curiosity and clarity of today’s young minds are outstanding. pic.twitter.com/AglqfB806E
— Narendra Modi (@narendramodi) February 10, 2026
‘‘కుతూహలం, ఆలోచన, అవగాహన కలిగిన ఓ తరాన్ని #ParikshaPeCharcha26లో భాగంగా ఛత్తీస్‌గఢ్ విద్యార్థులతో జరిపిన సంభాషణలు పరిచయం చేశాయి. చదువు, క్రీడలను సమతౌల్యం చేసుకోవడం నుంచి పర్యావరణంపై శ్రద్ధ వహించడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం వరకు, వారికున్న స్పష్టతను వారి ప్రశ్నలు ప్రతిబింబించాయి.’’
During #ParikshaPeCharcha26, conversations with students from Chhattisgarh revealed a generation that is curious, thoughtful and aware. From balancing studies and sports to caring for the environment and developing leadership qualities, their questions reflected clarity of… pic.twitter.com/SebKQ5I1yz
— Narendra Modi (@narendramodi) February 10, 2026
"పరీక్షల సన్నద్ధతకు సంబంధించిన అంశాలకే గుజరాత్‌లో జరిగిన #ParikshaPeCharcha26 పరిమితం కాలేదు. నేర్చుకోవాలన్న, ఆత్మవిశ్వాసంతో ఎదగాలన్న ఆకాంక్షను వారి ప్రశ్నలు ప్రతిబింబించాయి. క్లిష్టమైన పరిస్థితుల్లో ఒత్తిడిని ఎదుర్కోవడం, ఉపాధ్యాయులు పోషించే ప్రధాన పాత్రతో పాటు అనేక అంశాల గురించి విద్యార్థులు మాట్లాడారు. అద్భుతమైన వర్లీ, పిథోరా, లిప్పన్ కళలను కూడా వారు ప్రదర్శించారు."
#ParikshaPeCharcha26 in Gujarat went beyond just exam preparation. Their questions reflected a deep desire to learn and grow with confidence. Students spoke freely about managing pressure in critical situations, the important role of teachers and more. They even showcased… pic.twitter.com/xH6lFymiiM
— Narendra Modi (@narendramodi) February 10, 2026
"ఒత్తిడిని, ఇతరులతో పోలికలను ఎదుర్కోవడం నుంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవడం వరకు అన్ని అంశాలను అస్సాం విద్యార్థులతో జరిగిన #ParikshaPeCharcha26లో చర్చించాం. ఇది పరీక్షల్లో రాణించాలనే వారి ఆకాంక్షలను ప్రతిబింబింస్తుంది. అదే సమయంలో తమ మూలాలతో, సంస్కృతితో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఎదగాలనే వారి తపనను కూడా చాటిచెప్పింది."
From managing stress and comparisons to building self-confidence and healthy routines, #ParikshaPeCharcha26 with students in Assam covered it all. It reflected their aspirations to do well in exams, grow while at the same time staying connected to their roots and culture. pic.twitter.com/QVmtjlKFFX
— Narendra Modi (@narendramodi) February 10, 2026


