అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943 డిసెంబర్ 30న పోర్ట్‌బ్లెయిర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
ఆకాంక్ష ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధించదని, సామర్థ్యం, కృషి, న్యాయం, సమష్టి సంకల్పం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఈ చారిత్రక ఘట్టం గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి వివరించారు.
ఈ స్ఫూర్తిని తెలియజెప్పే సుభాషితాన్ని ప్రధానమంత్రి మోదీ ఎక్స్‌లో పంచుకున్నారు:
‘‘ఈ రోజు అంటే.. 1943 డిసెంబర్, 30న పోర్ట్ బ్లెయిర్లో అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కేవలం ఆకాంక్షతో మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధించదని, సామర్థ్యం, కఠోర శ్రమ, న్యాయం, సమష్టి సంకల్పం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. ఈ నాటి సుభాషితం కూడా ఇదే భావాన్ని తెలియజేస్తోంది.
సామర్థ్య మూలం స్వాతంత్ర్యం శ్రమ మూలం చ వైభవం|
న్యాయ మూలం సురాజ్యం.. సంఘ మూలం మహాబలం||’’
आज ही के दिन 30 दिसंबर, 1943 को नेताजी सुभाष चंद्र बोस ने पोर्ट ब्लेयर में साहस और पराक्रम के साथ तिरंगा फहराया था। वह क्षण हमें याद दिलाता है कि स्वतंत्रता केवल आकांक्षा से नहीं, बल्कि सामर्थ्य, परिश्रम, न्याय और संगठित संकल्प से आकार लेती है। आज का सुभाषित इसी भाव को अभिव्यक्त… pic.twitter.com/vYRNygE2Gv
— Narendra Modi (@narendramodi) December 30, 2025


