ఆసియాన్‌ సంబంధిత సమావేశాల్లో పాల్గొనడం కోసం గౌరవనీయ జోకో విడోడో ఆహ్వానం మేరకు నేను ఇండోనేషియా రాజధాని జకార్తా పర్యటనకు బయల్దేరుతున్నాను. ఈ పర్యటనలో భాగంగా 20వ ఆసియాన్‌-భారత శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం నా తొలి కార్యక్రమం. ఈ సందర్భంగా ఆసియాన్‌ కూటమి దేశాల అధినేతలతో సంభాషణల్లో పాల్గొనబోతున్నాను. ఆసియాన్‌-భారత సంబంధాలు నాలుగో దశాబ్దంలో ప్రవేశించిన నేపథ్యంలో ఈ భాగస్వామ్యం భవిష్యత్‌ పరిణామాలపై మా మధ్య ప్రధానంగా చర్చ సాగుతుంది.

   భారత్‌ అనుసరిస్తున్న “తూర్పు కార్యాచరణ” విధానం మూలస్తంభాల్లో ఆసియాన్‌ కూటమితో సంబంధాలు కూడా ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం కుదుర్చుకున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం స్నేహ సంబంధాలకు నూతనోత్తేజం ఇచ్చింది.

   నా పర్యటనలో రెండో కార్యక్రమం కింద 18వ ఆసియా శిఖరాగ్ర సదస్సులోనూ పాల్గొంటాను. ఆహార-ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం. డిజిటల్ పరివర్తనసహా కీలక ప్రాంతీయ అంశాలపై చర్చలకు ఈ వేదిక ఎంతో ఉపయుక్తం. ఈ ప్రపంచ సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనడంలో ఆచరణాత్మక సహకార చర్యలపై తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యే ఇతర దేశాల అధినేతలతో అభిప్రాయాల మార్పిడికి నేను సిద్ధంగా ఉన్నాను.

   గత సంవత్సరం బాలిలో జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా సందర్శించిన నాటి ఉల్లాసపూరిత జ్ఞాపకాలను నేనిప్పుడు మననం చేసుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ప్రస్తుత పర్యటన ఆసియాన్‌ దేశాలతో మన స్నేహ సంబంధాలను మరింత విస్తృతం చేయగలదని నా దృఢ విశ్వాసం.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act

Media Coverage

'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 ఆగష్టు 2026
August 18, 2026

PM Modi’s 12 Years of Structural Power: Manufacturing, FTAs, Airports & Uncompromising Security