ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న బిఐఎమ్ఎస్ టిఇసి (బే ఆఫ్ బెంగాల్ ఇనిశియేటివ్ ఫార్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ ఎండ్ ఇకోనామిక్ కోఆపరేశన్.. ‘బిమ్స్ టెక్) అయిదో శిఖర సమ్మేళనం లో వర్చువల్ పద్ధతి లో పాల్గొన్నారు. ఈ వర్చువల్ పద్ధతి లో జరిగిన ఈ శిఖర సమ్మేళనాని కి బిమ్స్ టెక్ కు ప్రస్తుతం అధ్యక్ష స్థానం లో ఉన్న శ్రీ లంక ఆతిథేయి గా వ్యవహరించింది.

బిమ్స్ టెక్ అయిదో శిఖర సమ్మేళనాని కంటే పూర్వం, సీనియర్ అధికారుల మరియు విదేశీ మంత్రుల స్థాయి లలో సన్నాహక సమావేశాల ను హైబ్రిడ్ పద్ధతి లో కొలంబో లో మార్చి నెల 28వ మరియు 29వ తేదీ లలో నిర్వహించడం జరిగింది.

‘‘ఒక ప్రతిఘాతుకత్వ యుక్త ప్రాంతం, సమృద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ లు, స్వస్థులైన ప్రజలు అనే లక్ష్యాల వైపునకు పయనం’’ అనేది ఈ శిఖర సమ్మేళనాని కి ప్రాధాన్యపూర్వకమైన ఇతివృత్తం గా ఉంది. దీనికి అదనం గా బిమ్స్ టెక్ ప్రయాస ల సహకారభరిత కార్యకలాపాలను అభివృద్ధిపరచడం కూడా దీనిలో భాగం గా ఉంది. తద్ద్వారా సభ్యత్వ దేశాల ఆర్థిక ప్రగతి మరియు అభివృద్ధి పై కోవిడ్-19 మహమ్మారి తాలూకు దుష్ప్రభావాలను పరిష్కరించడం సాధ్యపడనుంది. బిమ్స్ టెక్ చార్టర్ పై సంతకాలు చేయడం మరియు దానికి ఆమోదం తెలపడం ఈ శిఖర సమ్మేళనం ప్రధాన ఫలితం కానుంది. ఈ బిమ్స్ టెక్ చార్టర్ అనేది బంగాళాఖాతం యొక్క తీర ప్రాంతం లో ఉన్న మరియు బంగాళాఖాతం పై ఆధారపడి ఉన్న సభ్యత్వ దేశాల యొక్క కూటమి రూపురేఖల ను కూడా ఖాయపరచనుంది.

బిమ్స్ టెక్ కనెక్టివిటి అజెండా ను పూర్తి చేయడానికి సంబంధించి చెప్పుకోదగిన ప్రగతి ని శిఖర సమ్మేళనం లో పరిశీలించడం జరిగింది. ‘రవాణా సంబంధి సంధానం కోసం ఉద్దేశించిన బృహత్ ప్రణాళిక’ ను నేతలు చర్చించారు. ఈ మాస్టర్ ప్లాను లో భవిష్యత్తు లో ఈ ప్రాంతం లో సంధానం సంబంధి కార్యకలాపాల కు ఒక మార్గదర్శకమైనటువంటి ఫ్రేమ్ వర్క్ భాగం గా ఉంది.

ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, బిమ్స్ టెక్ ప్రాంతీయ సంధానాన్ని, సహకారాన్ని, ఇంకా భద్రత ను పెంపొందించవలసిన అసవరం ఎంతైనా ఉందని నొక్కిచెప్పారు. ఈ విషయం లో ఆయన అనేక సలహాల ను ఇచ్చారు. బంగాళాఖాతాన్ని బిమ్స్ టెక్ సభ్యత్వ దేశాల నడుమ సంధానం, సమృద్ధి మరియు భద్రత లతో కూడిన ఒక సేతువు గా మలచడాని కి పాటుపడవలసింది గా ప్రధాన మంత్రి తన సాటి నేతల కు పిలుపు ను ఇచ్చారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు అన్య నేత ల సమక్షం లో మూడు బిమ్స్ టెక్ ఒ ప్పందాల పైన సంతకాలయ్యాయి. ఈ ఒప్పందాల లో వర్తమాన సహకార పూర్వక కార్యకలాపాల లో చోటు చేసుకొన్న ప్రగతి అనే విషయం కూడా చేరి ఉంది. ఈ మూడు ఒప్పందాలు ఏవేవి అంటే వాటిలో ఒకటోది - నేర సంబంధమైన అంశాల లో పరస్పరం చట్ట సహాయం అనే అంశం పై బిమ్స్ టెక్ ఒప్పందం; రెండోది - దౌత్య సంబంధి శిక్షణను ఇచ్చే రంగం లో పరస్పర సహకారాని కి ఉద్దేశించిన బిమ్స్ టెక్ అవగాహన పూర్వక ఒప్పంద పత్రం; మూడోది- బిమ్స్ టెక్ సాంకేతిక విజ్ఞానం బదలాయింపు కేంద్రం స్థాపన కు సంబంధించినటువంటి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేశన్.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
During Diplomatic Dinners to Hectic Political Events — Narendra Modi’s Austere Navratri Fasting

Media Coverage

During Diplomatic Dinners to Hectic Political Events — Narendra Modi’s Austere Navratri Fasting
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 అక్టోబర్ 2024
October 06, 2024

PM Modi’s Inclusive Vision for Growth and Prosperity Powering India’s Success Story