షేర్ చేయండి
 
Comments
Close relations between India and Finland based on shared values of democracy, rule of law, equality, freedom of speech, and respect for human rights: PM
PM Modi invites Finland to join the International Solar Alliance (ISA) and the Coalition for Disaster Resilient Infrastructure (CDRI)

ఎక్స్‌లన్సి,

న‌మ‌స్కారం.

మీ ప్ర‌సంగానికి అనేక ధ‌న్యావాదాలు.

ఎక్స్‌లన్సి,

కోవిడ్-19 కార‌ణం గా ఫిన్‌లాండ్ లో జ‌రిగిన ప్రాణ‌న‌ష్టాని కి గాను యావత్తు భార‌త‌దేశం ప‌క్షాన నేను నా హార్దిక సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. మీ నాయ‌క‌త్వం లో ఫిన్‌లాండ్ ఈ మ‌హ‌మ్మారి ని నేర్పు గా సంబాళించింది. దీనికి గాను నేను మీకు అభినందనలను తెలియజేస్తున్నాను.

ఎక్స్‌లన్సి,

ఈ మ‌హ‌మ్మారి కాలం లో భార‌త‌దేశం త‌న ప్ర‌జ‌ల ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌డం తో పాటు ప్ర‌పంచం అవ‌స‌రాల‌ ను కూడా దృష్టి లో పెట్టుకొంది. కింద‌టి సంవ‌త్స‌రం లో మేము 150కి పైగా దేశాల కు మందుల‌ ను, ఇత‌ర అత్య‌వ‌స‌ర స‌ర‌కుల‌ను పంపించాం. ఇటీవ‌లే మేము ఇంచుమించు 70 దేశాల కు భార‌త‌దేశం లో తయారు చేసిన టీకామందుల డోసులు 58 మిలియ‌న్ కు పైగా స‌ర‌ఫరా చేశాం. మేము మా శ‌క్తి మేర‌కు యావ‌త్తు మాన‌వ‌ జాతి కి తోడ్పాటు ను అందిస్తూనే ఉంటామ‌ని నేను మీకు భ‌రోసా ను ఇవ్వ‌ద‌ల‌చాను.

ఎక్స్‌లన్సి,

ఫిన్‌లాండ్‌, భార‌త‌దేశం రెండూ నియ‌మాల‌ పైన ఆధార‌ప‌డిన‌టువంటి, పార‌ద‌ర్శ‌క‌త్వం క‌లిగినటువంటి, మాన‌వీయ విలువ‌ల‌ కు పెద్ద‌పీట వేసేట‌టువంటి, ప్రజాస్వామ్య విలువ‌ల తో కూడిన‌టువంటి ప్ర‌పంచ‌ వ్య‌వ‌స్థ పట్ల న‌మ్మ‌కాన్ని క‌లిగివున్నాయి. ఉభ‌య దేశాలు సాంకేతిక విజ్ఞానం, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ లు, స్వ‌చ్ఛ శ‌క్తి, ప‌ర్యావ‌ర‌ణం, విద్య మొద‌లైన‌ రంగాల లో బ‌ల‌మైన స‌హ‌కారాన్ని ఇచ్చి పుచ్చుకొంటున్నాయి. కోవిడ్ అనంత‌ర కాలం లో ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌ళ్ళీ కోలుకోవ‌డానికి అన్ని రంగాలు కూడా చాలా ముఖ్య‌మైన‌వే. స్వ‌చ్ఛ శ‌క్తి రంగం లో ఫిన్‌లాండ్ ప్రపంచం లో ఓ అగ్ర దేశం గా ఉండ‌డమే కాకుండా భార‌త‌దేశాని కి ఒక ముఖ్య‌మైన భాగ‌స్వామి గా కూడా ఉంది. శీతోష్ణ‌స్థితి ని గురించి మీరు మీ భ‌యాందోళ‌న‌ లను వ్య‌క్తం చేసిన‌ప్పుడ‌ల్లా నేను మ‌న మిత్రుల తో అప్పుడ‌ప్పుడు చ‌లోక్తి గా ఏమిని చెప్తూ ఉంటానంటే ప్ర‌కృతి కి మ‌నం ఎంతో అన్యాయం చేశాం; మ‌రి ప్ర‌స్తుతం మ‌న మాన‌వులంటే ప్ర‌కృతి కి ఎంత ఆగ్ర‌హం క‌లిగిందంటే మ‌నంద‌రం మ‌న ముఖాల ను మాస్కుల తో క‌ప్పుకొని ఉండ‌క త‌ప్ప‌ని స్థితి ఎదురైంది అని. జ‌ల వాయు సంబంధిత ల‌క్ష్యాల ను సాధించ‌డానికి భార‌త‌దేశం లో మేము ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ల‌క్ష్యాల ను పెట్టుకొన్నాం. న‌వీక‌ర‌ణ‌యోగ్య శ‌క్తి రంగం లో 2030వ సంవ‌త్స‌రాని క‌ల్లా 450 గీగావాట్ స్థాపిత సామ‌ర్ధ్యాన్ని అందుకోవాల‌నేది మా ల‌క్ష్యం గా ఉంది. అంత‌ర్జాతీయ స‌హ‌కారాన్ని వ‌ర్ధిల్ల‌జేయ‌డానికి గాను అంత‌ర్జాతీయ సౌర‌కూటమి (ఐఎస్ఎ) తో పాటు కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ ఐ) ల వంటి కార్య‌క్ర‌మాల ను కూడా మేము మొద‌లు పెట్టాం. ఐఎస్ఎ లో, సిడిఆర్ఐ లో చేర‌వ‌ల‌సింది అంటూ ఫిన్‌లాండ్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫిన్‌లాండ్ కు ఉన్న ప్రావీణ్యం ద్వారా ఈ అంత‌ర్జాతీయ సంస్థ లు ఎంత‌గానో ల‌బ్ధి ని పొంద‌గ‌లుగుతాయి.

ఎక్స్‌లన్సి,

విద్య‌, నైపుణ్యాల అభివృద్ధి, నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం, డిజిట‌ల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల లో సైతం ఫిన్‌లాండ్ ఒక స‌మున్న‌త స్థానం లో నిల‌చింది. ఈ అన్ని రంగాల లో స‌హ‌క‌రించుకొనే సామ‌ర్ధ్యం మన‌లో ఉంది. ఈ రోజు న మనం ఐసిటి, మొబైల్ టెక్నాల‌జీ, డిజిట‌ల్ ఎడ్యుకేశన్ రంగాల లో ఒక కొత్త భాగ‌స్వామ్యాన్ని ప్ర‌క‌టిస్తున్నందుకు నేను సంతోషం గా ఉన్నాను. మా విద్య శాఖ కూడా ఒక ఉన్న‌త‌ స్థాయి చ‌ర్చ ను ఆరంభిస్తోంది. ఈనాటి మన శిఖ‌ర స‌మ్మేళ‌నం తో భార‌త‌దేశం-ఫిన్‌లాండ్ సంబంధాల అభివృద్ధి లో మరింత జోరు కనపడుతుందని నేను ఆశ‌ ప‌డుతున్నాను. ‌

ఎక్స్‌లన్సి,

నేటి స‌మావేశం మ‌న తొలి స‌మావేశం. మ‌నం స్వ‌యం గా భేటీ అయి ఉండి ఉంటే బాగుండేది. అయితే గ‌త సంవ‌త్స‌ర కాలం గా మ‌నం అంద‌ర‌మూ సాంకేతిక విజ్ఞానం స‌హ‌కారం తో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తి న స‌మావేశమవుతూ ఉండ‌టానికి అల‌వాటు ప‌డిపోయాం. కానీ, మనకు త్వరలోనే పోర్చుగ‌ల్ లో ఇండియా-ఇయు స‌‌మిట్, అలాగే డెన్‌ మార్క్‌ లో ఇండియా-నార్డిక్‌ స‌మిట్ జ‌రిగే క్రమం లో భేటీ అయ్యే అవ‌కాశం ద‌క్కుతుందని నేను ఆనందం గా ఉన్నాను. భార‌త‌దేశం సంద‌ర్శ‌న‌ కు త‌ర‌లి రావ‌ల‌సిందిగా కూడా నేను మిమ్మ‌ల్ని ఆహ్వానిస్తున్నాను. మీకు వీలైన వేళ‌ లో ద‌య‌చేసి భార‌త‌దేశానికి రండి. ఇక్క‌డి తో నా ఉప‌న్యాసాన్ని నేను ముగిస్తున్నాను. త‌దుప‌రి స‌మావేశం లో మ‌నం మ‌రిన్ని అంశాల ను చ‌ర్చిద్దాం.

అనేక ధ‌న్య‌వాదాలు.

అస్వీకరణ: ఇది ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగానికి దాదాపు గా చేసిన అనువాదం. సిసలు ప్రసంగం హిందీ భాష‌ లో సాగింది.

Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Forex reserves rise $3.07 billion to lifetime high of $608.08 billion

Media Coverage

Forex reserves rise $3.07 billion to lifetime high of $608.08 billion
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 జూన్ 2021
June 19, 2021
షేర్ చేయండి
 
Comments

India's forex reserves rise by over $3 billion to lifetime high of $608.08 billion under the leadership of Modi Govt

Steps taken by Modi Govt. ensured India's success has led to transformation and effective containment of pandemic effect