ఇండియా-నార్డిక్ మూడో సదస్సు సందర్భంగా ఓస్లోలో ఈ రోజు డెన్మార్క్ తాత్కాలిక ప్రధానమంత్రి శ్రీమతి మెట్టె ఫెడరిక్సన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించిన ఉభయ దేశాల నాయకులు, ఉమ్మడి కార్యాచరణలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యావరణం, వాతావరణ మార్పుల రంగాల్లో సహకారానికి ప్రాధాన్యతనిస్తూ రెండు దేశాల్లో హరిత పరివర్తనకు తోడ్పడేలా ఉమ్మడి ప్రయత్నాలను ఏకీకృతం చేసే 'భారత్-డెన్మార్క్ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం’ సాధించిన పురోగతిని ఇరు నేతలు స్వాగతించారు. 2020లో ఈ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా జరుగుతున్న ఉన్నత స్థాయి పర్యటనలు, చర్చలను గుర్తుచేసిన ఇరు దేశాల నాయకులు.. సరికొత్త- వర్ధమాన సాంకేతికతలు, కమ్యూనికేషన్స్, అధునాతన పరిశోధనలు, అంకురాలు, విద్యాసంబంధ మార్పిడి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. రక్షణ, కృత్రిమ మేధస్సు రంగాల్లో సహకారంపై కూడా వారు చర్చించారు. గుజరాత్‌లోని 'గిఫ్ట్ సిటీ'లో తమ కార్యకలాపాలను ప్రారంభించాల్సిందిగా డెన్మార్క్ కంపెనీలను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.

 

వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో హరిత పరిష్కారాల కోసం డెన్మార్క్ సాంకేతికతలను స్వాగతించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు. నీటి సంరక్షణ రంగానికి సంబంధించి వారణాసిలో 'స్వచ్ఛమైన నదులపై స్మార్ట్ ప్రయోగశాల’ను ఏర్పాటుచేయటానికి భారత్, డెన్మార్క్‌ల మధ్య విజయవంతమైన సహకారాన్ని ఇరు నాయకులు ప్రస్తావించారు. ఇది భారత ప్రభుత్వం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - బనారస్ హిందూ యూనివర్సిటీ (ఐఐటీ-బీహెచ్‌యూ), డెన్మార్క్ ప్రభుత్వం కలిసి చేపట్టిన ఒక విశిష్టమైన త్రైపాక్షిక కార్యక్రమం. ఇరు దేశాల నాయకులు మొబిలిటీ భాగస్వామ్యంపై కూడా చర్చించారు.

పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరు దేశాల నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి‌లో ప్రస్తుతం తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న డెన్మార్క్ పదవీకాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 ఆగష్టు 2026
August 17, 2026

India Ascendant: Citizens Hail PM Modi's Vision and India’s Multi-Sectoral Growth