ఈ రోజు నేను మూడు దేశాలు- హాషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్, ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా, ఒమన్ సుల్తానేట్‌లో పర్యటించేందుకు బయలుదేరి వెళుతున్నాను. ఈ మూడు దేశాలతోనూ భారత్‌కు ప్రాచీన నాగరిక సంబంధాలు, సమకాలీన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి.

ముందుగా, జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటిస్తాను. ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ఈ చారిత్రక పర్యటన సూచిస్తుంది. పర్యటనలో భాగంగా, రాజు అబ్దులా II ఇబ్న్ అల్ హుస్సేన్‌, జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్‌తో విస్తృత చర్చలు చేపడతాను. అలాగే యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా IIతో సమావేశమయ్యేందుకు ఎదురు చూస్తున్నాను. భారత్-జోర్డాన్ సంబంధాలకు గణనీయమైన సహకారాన్ని అందిస్తున్న ప్రవాస భారతీయులతో అమ్మాన్‌లో ముచ్చటిస్తాను.

అమ్మాన్ నుంచి ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ ఆలీ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళతాను. ఫెడరల్ డెమెక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియాను నేను సందర్శించడం ఇదే మొదటిసారి. ఆఫ్రికన్ యూనియన్‌కు అడీస్ అబాబా ప్రధాన కేంద్రంగా ఉంది. 2023లో జీ20కి భారత్ అధ్యక్షత వహించిన సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం లభించింది. డాక్టర్ అబియ్ అహ్మద్ ఆలీతో అడీస్ అబాబాలో విస్తృత చర్చలు నిర్వహిస్తాను. అలాగే ఇక్కడ ఉన్న భారతీయ సంతతి ప్రజలతో సమావేశమవుతాను. నాకు పార్లమెంట్ సంయుక్త సభను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం లభించింది. ఇక్కడ ‘‘ప్రజాస్వామ్యానికి తల్లి’’గా భారత్ సాగిస్తున్న ప్రయాణంపై నా ఆలోచనలను పంచుకొనేందుకు, గ్లోబల్ సౌత్‌కు ఇండియా-ఇథియోపియా భాగస్వామ్యం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

ఈ ప్రయాణంలో చివరిగా, ఒమన్ సుల్తానేట్‌ను నేను సందర్శిస్తాను. భారత్, ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పాటై 70 ఏళ్లు పూర్తయిన నేపథ్యాన్ని నా పర్యటన సూచిస్తుంది. ఒమన్ సుల్తాన్‌తో మస్కట్‌లో సమావేశమయ్యేందుకు, మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, బలమైన వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు నేను ఎదురుచూస్తున్నాను. మన దేశాభివృద్ధికి, రెండు దేశాల మధ్య భాగస్వామాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్న ఒమన్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తాను.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India car sales to hit 4.7 million in FY26 despite bumps

Media Coverage

India car sales to hit 4.7 million in FY26 despite bumps
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 మార్చి 2026
March 16, 2026

Thoughtful Strength: Balancing Security, Growth, and Autonomy Under PM Modi's Leadership