ప్రశాంతి నిలయంలో శ్రీ సత్య సాయిబాబాకు ప్రధానమంత్రి నివాళులు
శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు ఏర్పాటు చేసిన గోదాన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి

 

సాయిరాం నామ స్మరణ నడుమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి చేరుకున్నారు. స్థానికులు అత్యంత ఆత్మీయంగా ప్రధానమంత్రికి స్వాతం పలికారు.

ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో శ్రీ సత్య సాయిబాబాకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. ఆ తరువాత ఓంకార్ హాలుకు వెళ్లి, దర్శించుకున్నారు. ఈ పవిత్ర స్థలాల్ని దర్శించుకోవడంతో శ్రీ సత్య సాయిబాబా అపార కరుణ, మానవాళి అభ్యుదయం కోసం ఆయన జీవన పర్యంతం కనబరచిన నిబద్ధత తనకు గుర్తుకు వచ్చాయని ప్రధానమంత్రి అన్నారు. నిస్వార్థంగా సేవ చేస్తూ ఉండాలని శ్రీ సత్య సాయిబాబా ఇచ్చిన సందేశం లక్షల మందికి మార్గదర్శకంగా నిలుస్తూ, స్ఫూర్తిని అందిస్తోందని శ్రీ మోదీ అన్నారు.
శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు ఏర్పాటు చేసిన గోదాన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాలుపంచుకున్నారు. ఈ ట్రస్టు పశు సంరక్షణ రంగంలో విశిష్ట కృషి చేయడం సహా అనేక ఉదాత్త కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి తన శుభాశీస్సులను అందించారు. శ్రీ సత్య సాయిబాబా చూపిన మార్గంలో అంతా నడుస్తూ, సమాజ హితం కోసం పనిచేయాలని ప్రధానమంత్రి అన్నారు.
 

‘ఎక్స్’లో వివిధ సందేశాల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

 

‘‘సాయిరాం నామ స్మరణ నడుమ ఎంతో ఆప్యాయతతో స్వాగతం పలుకుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి చేరుకున్నా.’’

 

“Paid homage to Sri Sathya Sai Baba at the Sai Kulwant Hall, Prasanthi Nilayam and went to Omkar Hall for Darshan. Being in these sacred spaces is a reminder of his boundless compassion and lifelong commitment to uplifting humanity. His message of selfless service continues to guide and inspire millions.”

 

“Among the many noble deeds they are doing, the Sri Sathya Sai Central Trust has focused greatly on animal welfare. Today, took part in the Gaudan Ceremony, in which farmers are being given cows. The cows in the pictures below are Gir Cows! May we all keep working for the welfare of our society, as shown by Sri Sathya Sai Baba.”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru

Media Coverage

In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 ఏప్రిల్ 2026
April 30, 2026

Investment Magnet India: PLI Triumphs, FTA Deals & Defence Milestones — How PM Modi’s Vision is Reshaping the Nation