గౌరవనీయులు, అధ్యక్షుడు ప్రబోవో,
ఇరుదేశాల విశిష్ట ప్రతినిధులు,
మీడియా మిత్రులకు,
నమస్కారం!
శుభ మధ్యాహ్నం!
నాకు ఎంతో ఆత్మీయమైన, గౌరవప్రదమైన స్వాగతం పలికిన నా మిత్రుడు, అధ్యక్షుడు ప్రబోవోకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
గతేడాది భారత్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధ్యక్షుడు ప్రబోవోను ముఖ్య అతిథిగా స్వాగతించే గౌరవం దక్కింది. ఇవాళ ఆయన అందించిన ఆత్మీయ, సాదర స్వాగతం మేరకు నేను ఇండోనేషియాలో పర్యటించటం నాకు ఎంతో సంతోషంగా ఉంది.
ఇవాళ ఉదయం ఇండోనేషియా అత్యున్నత పురస్కారాన్ని ఎంతో ఆత్మీయతతో, గౌరవంతో అందుకోవటం నాకు దక్కిన గొప్ప వరంగా భావిస్తున్నాను. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయులకు చెందుతుంది. ఇండోనేషియా ప్రజల సద్భావాన్ని ప్రతిబింబిస్తూ.. భారత్, ఇండోనేషియా మధ్య చరిత్రాత్మక, శాశ్వతమైన స్నేహ బంధాలకు గుర్తుగా ఇది నిలుస్తుంది. ఈ విశిష్టమైన గౌరవానికి గానూ అధ్యక్షుడు ప్రబోవోకి, ఇండోనేషియా ప్రభుత్వానికి, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
మిత్రులారా,
ఇటీవల సంవత్సరాల్లో భారత్, ఇండోనేషియా మధ్య సంబంధాలు నూతనోత్తేజాన్ని, మరింత ఆత్మవిశ్వాసాన్ని, వ్యూహాత్మక విస్తృతిని సంతరించుకున్నాయి.
మన మధ్య 2018లో ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నేడు నూతన శిఖరాలకు చేరుకుంటోంది. అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా ప్రతి సహకార రంగంలోనూ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాం.

భారత్-ఇండోనేషియా భాగస్వామ్యంలో నేడు సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఈ నూతన అధ్యాయం 21వ శతాబ్దపు ప్రపంచం, మానవాళిపై అపారమైన, సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
మిత్రులారా,
రెండు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర నమ్మకం.. రక్షణ, భద్రత, సముద్రయాన రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తోంది. రక్షణ రంగంలో పరస్పర వినిమయం, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారంలో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇవాళ మేం నిర్ణయించాం.
హిందూ మహాసముద్రంలో సముద్ర భద్రత, రక్షణను మెరుగుపరిచేందుకు ఇరుదేశాల తీర రక్షక దళాలు ఇకపై కలిసి పనిచేస్తాయి. రెండు సన్నిహిత సముద్ర తీర దేశాలుగా, బ్లూ ఎకానమీ, ఓడరేవుల అభివృద్ధి, సముద్ర వాణిజ్యంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మేం నిర్ణయించుకున్నాం.
మిత్రులారా,
పేదరిక నిర్మూలన, ప్రతి పౌరునికి సంక్షేమ పథకాల ప్రయోజనాలను సమర్థవంతంగా అందించటం భారత్, ఇండోనేషియాకు అత్యంత ప్రాధాన్యతా అంశాలుగా ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి మాకున్న అనుభవాలను, పరిష్కారాలను మేం ఇప్పటికే ఇండోనేషియాతో పంచుకున్నాం. ఈ సహకారాన్ని మేం తదుపరి స్థాయికి తీసుకెళ్తున్నాం.
ఆరోగ్య రంగంలో మా పరస్పర సహకారం ఇరుదేశాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించటంలో గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ కుదిరిన ఒప్పందం వల్ల భారతదేశంలో నాణ్యతతో, సరసమైన ధరల్లో లభించే మందులు ఇండోనేషియా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి.
ఇండోనేషియా వైద్యులు, ఆరోగ్య నిపుణుల నైపుణ్యాభివృద్ధికి కూడా మా వంతు సహకారాన్ని అందిస్తాం. భారతదేశంలో అభివృద్ధి చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. వీటితో పాటు స్థిరమైన వ్యవసాయం, వ్యవసాయ-సాంకేతికత రంగాల్లో అత్యుత్తమ విధానాలను మేం పరస్పరం పంచుకుంటాం.
మిత్రులారా,
ఇరవై ఒకటో శతాబ్దం... సాంకేతికత ఆధారంగా నడుస్తోంది. భారత్, ఇండోనేషియా../ యువత శక్తితో నడుస్తున్న దేశాలు. మన యువతకు సాంకేతికత పట్ల సహజమైన ఆసక్తి ఉంది.
కృత్రిమ మేధ, టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో మన యువత మధ్య సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఇవాళ ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. రెండు దేశాల అంకుర సంస్థల వ్యవస్థ మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని మేం నిర్ణయించాం.

ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బెంగళూరుకు సంబంధించిన విదేశీ క్యాంపస్‌ను ఇండోనేషియాలో ఏర్పాటు చేయనున్నాం. ఇది ఆసియాన్ ప్రాంతంలోని యువతకు ఎంతో మేలు చేస్తుంది.
అంతరిక్ష రంగంలో మన సహకారం దశాబ్దాల నమ్మకం, భాగస్వామ్యంపై ఏర్పాటైంది. దీని ఆధారంగా అంతరిక్ష రంగంలో ఉమ్మడి పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవటం, సామర్థ్య పెంపుదలను ముందుకు తీసుకెళ్లేందుకు మేం ఇవాళ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం.
మిత్రులారా,
నేటి ప్రపంచంలో సాంకేతికతలో "సరఫరా వ్యవస్థ స్థిరత్వం" కీలకంగా మారింది. కీలక ఖనిజాలు, ఉక్కు రంగాల్లో సరఫరా వ్యవస్థ స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఇరుదేశాల కంపెనీలు స్టెయిన్‌లెస్ స్టీల్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రంగాల్లోని భాగస్వామ్యాల్లో నూతన దశను ప్రారంభిస్తున్నాయి.
మిత్రులారా,
ఇరుదేశాల ప్రజల మధ్య ఉన్న సంబంధాలే మనకు అతిపెద్ద బలం. భారత్‌కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థతో అనుసంధానం కానుండటం సంతోషకరం. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య నిర్వహణను, ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.
మిత్రులారా,
రేపు ప్రంబనన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు యోగ్యకర్తలో అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి పాల్గొనే గొప్ప అవకాశం నాకు లభించింది. వెయ్యేళ్లకు పైగా పురాతనమైన ప్రంబనన్ ఆలయం.. భారత్, ఇండోనేషియాల ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి కాలాతీత చిహ్నంగా నిలుస్తుంది.
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండోనేషియా చరిత్రాత్మక పర్యటన శతాబ్ది ఉత్సవాలను ఇరుదేశాలు ఎంతో ఉత్సాహంతో జరుపుకోనున్నాయి. ఇండోనేషియా దేశ నిర్మాణంలో ఆ దేశ మొదటి విద్యాశాఖ మంత్రి, దూరదృష్టి గల విద్యావేత్త కి హజార్ దేవంతరా కీలక పాత్ర పోషించారు. ఆయన విద్యా విధానంపై గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనల ప్రభావం ఎంతో ఉంది. ఈ ఉమ్మడి మేధ, సాంస్కృతిక వారసత్వానికి గుర్తింపుగా ఈ శతాబ్ది ఉత్సవాలను "ఠాగూర్-దేవంతరా సాంస్కృతిక, విద్యా దౌత్య సంవత్సరం"గా భారత్, ఇండోనేషియా జరుపుకుంటాయి.
మిత్రులారా,
ప్రజాస్వామ్య విలువలు, భిన్నత్వంలో ఏకత్వం.. భారత్, ఇండోనేషియాకు ఉమ్మడి బలాలు. ఈ రోజు ఇరుదేశాల ఎన్నికల సంఘాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రజాస్వామ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
మిత్రులారా,
అంతర్జాతీయ సమస్యలపై కూడా భారత్, ఇండోనేషియా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటూనే ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంపై పరస్పర దృక్పథాల్లో బలమైన సమన్వయం ఉంది. ఆసియాన్ కూటమికి భారతదేశం ఎల్లప్పుడూ ప్రాధాన్యతను ఇస్తూనే ఉంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో చర్చలు, దౌత్యాల పాత్ర మునుపెన్నడూ లేనంతగా కీలకమైనవని భారతదేశం విశ్వసిస్తోంది. పాలస్తీనా సమస్యపై రెండు దేశాల పరిష్కారానికి, శాశ్వత శాంతి సాధనకు మేం మద్దతును కొనసాగిస్తున్నాం.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో చర్చలు, దౌత్యాల పాత్ర మునుపెన్నడూ లేనంతగా కీలకమైనవని భారతదేశం విశ్వసిస్తోంది. పాలస్తీనా సమస్యపై రెండు దేశాల పరిష్కారానికి, శాశ్వత శాంతి సాధనకు మేం మద్దతును కొనసాగిస్తున్నాం.
మిత్రులారా,
ఇరుదేశాలకు సువర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది.
మన చరిత్ర ఉమ్మడి సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉంది.
పరస్పర నమ్మకంతో వర్తమానం పెనవేసుకుంది.
ఉమ్మడి అభివృద్ధిలోనే మన భవిష్యత్ ఉంది.
ఇండోనేషియా "ఎమాస్”, భారతదేశ "వికసిత్ భారత్" కలలను మనం ఉమ్మడిగా సాకారం చేసుకుంటామనే విశ్వాసం నాకుంది.
ధన్యవాదాలు.
आज सुबह, मुझे बहुत स्नेह के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान भी दिया गया है।
— PMO India (@PMOIndia) July 7, 2026
ये सम्मान कोटि-कोटि भारतवासियों का है... इंडोनेशिया के लोगों की भावनाओं का है, भारत और इंडोनेशिया के ऐतिहासिक और आत्मीय संबंधों का है।
मैं प्रेसिडेंट प्रबोवो जी, इंडोनेशिया की सरकार और यहां की जनता का…
2018 में बनी हमारी Comprehensive Strategic Partnership आज एक नई उड़ान ले रही है।
— PMO India (@PMOIndia) July 7, 2026
हम Development, security, technology, culture और education... हर क्षेत्र में महत्वपूर्ण कदम बढ़ा रहे हैं।
मुझे विश्वास है, आज से भारत-इंडोनेशिया साझेदारी का एक सुनहरा अध्याय शुरू होगा: PM…
हमारे देशों के बीच बढ़ता विश्वास हमारी रक्षा, सुरक्षा और maritime सहयोग को मजबूत कर रहा है।
— PMO India (@PMOIndia) July 7, 2026
आज हमने defence exchange, disaster management और industrial सहयोग बढ़ाने पर सहमति बनाई: PM @narendramodi
आज हुए agreement से भारत की high-quality और किफायती दवाइयां इंडोनेशिया के नागरिकों को और सहजता से उपलब्ध होंगी।
— PMO India (@PMOIndia) July 7, 2026
हम इंडोनेशिया के doctors और healthcare workers की capacity building में भी योगदान देंगे: PM @narendramodi
भारत में develop किए गए गेहूं के बीज की supply से, इंडोनेशिया की food security और मजबूत होगी।
— PMO India (@PMOIndia) July 7, 2026
हम एक दूसरे के साथ sustainable farming और agro-technology में best practices भी साझा करेंगे: PM @narendramodi
आज के युग में, technology की supply chain resilience बहुत मायने रखती है।
— PMO India (@PMOIndia) July 7, 2026
Critical minerals और steel के क्षेत्र में supply chain को अधिक मजबूती देने के लिए भी अहम समझौता हुआ है।
हमारी companies के बीच stainless steel और rare-earth magnet को लेकर साझेदारी की नई शुरुआत हो रही है:…
हमें बहुत खुशी है कि भारत की UPI इंडोनेशिया के payment system के साथ integrate होने जा रही है।
— PMO India (@PMOIndia) July 7, 2026
इससे Ease of Doing Business और Ease of Travel, दोनों को ही बल मिलेगा: PM @narendramodi
कल, राष्ट्रपति प्रबोवो के साथ मुझे, योग्याकार्ता में प्रम्बानन मंदिर के conservation project को launch करने का सौभाग्य मिलेगा।
— PMO India (@PMOIndia) July 7, 2026
एक हजार वर्ष से भी अधिक पुराना प्रम्बानन मंदिर... भारत और इंडोनेशिया की साझा सांस्कृतिक विरासत का प्रतीक है: PM @narendramodi
हम दोनों देश...गुरुदेव रवीन्द्रनाथ टैगोर की ऐतिहासिक इंडोनेशिया यात्रा का शताब्दी वर्ष धूम-धाम से मनाएंगे।
— PMO India (@PMOIndia) July 7, 2026
इंडोनेशिया की विकास यात्रा में महान शिक्षाविद और यहां के पहले शिक्षा मंत्री देवान्तरा जी का अहम योगदान रहा है।
शिक्षा को लेकर उनके विचारों पर गुरुदेव टैगोर की सोच का गहरा…
वैश्विक उथल-पुथल के इस दौर में भारत का मानना है कि dialogue और diplomacy की भूमिका, पहले से कहीं अधिक महत्वपूर्ण हो गई है।
— PMO India (@PMOIndia) July 7, 2026
Palestine के विषय पर, हम Two-State Solution और long-term peace का समर्थन करते हैं: PM @narendramodi


