సేవ, విద్య ద్వారా సమాజంలో మార్పు కోసం జీవితాన్ని అంకితం చేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా, ఆమె సేవలను స్మరించుకుంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

సమానత్వం, న్యాయం, కరుణ వంటి ఉన్నత ఆశయాలకు సావిత్రిబాయి ఫూలే ప్రాధాన్యతనిచ్చేవారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సమాజంలో సమూల మార్పునకు శక్తిమంతమైన సాధనం విద్యేనని ఆమె బలంగా నమ్మారని తెలిపారు. జ్ఞానం, సాధన ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆమె జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు.

పేదలు, అణగారిన వర్గాల పట్ల ఆమె చూపిన సేవాభావం, మానవత్వం స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ అంటూ సావిత్రిబాయి విశేష కృషిని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. సమ్మిళిత, సాధికారత సమాజం కోసం దేశ ప్రయత్నాలకు ఆమె దార్శనికత మార్గదర్శకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రత్యేక పోస్టులో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

"సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా సేవ, విద్య ద్వారా సమాజ మార్పునకు జీవితాన్ని అంకితం చేసిన ఆ మార్గదర్శిని స్మరించుకుందాం. సమానత్వం, న్యాయం, కరుణ వంటి సూత్రాలకు ప్రాధాన్యతనిస్తూ ఆమె పనిచేశారు. సమాజంలో మార్పునకు శక్తిమంతమైన సాధనం విద్య అని ఆమె బలంగా విశ్వసించారు. కేవలం జ్ఞానాన్ని అందించటమే కాక, కొత్త విషయాలను నేర్చుకోవటం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేశారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి ఆమె చేసిన సేవలు ప్రశంసనీయం"

 

 

““सावित्रीबाई फुले यांच्या जयंतीनिमित्त, सेवा आणि शिक्षणाच्या माध्यमातून समाजपरिवर्तनासाठी आपले जीवन अर्पण करणाऱ्या अग्रणी व्यक्तीचे आपण स्मरण करतो. समता, न्याय आणि करुणा या तत्त्वांप्रती त्या कटिबद्ध होत्या. शिक्षण हे सामाजिक बदलाचे सर्वात प्रभावी साधन आहे, असा त्यांचा ठाम विश्वास होता आणि ज्ञान व अध्ययनाच्या माध्यमातून जीवनपरिवर्तन घडवण्यावर त्यांनी भर दिला. दुर्बल घटकांची काळजी घेण्यासाठी त्यांनी केलेले कार्यही विशेष उल्लेखनीय आहे.”

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From 'chalta hai' to 'badal sakta hai': Decoding PM Modi's Punctuality narrative

Media Coverage

From 'chalta hai' to 'badal sakta hai': Decoding PM Modi's Punctuality narrative
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 ఆగష్టు 2026
August 23, 2026

From Free Coaching to 400+ Space Startups — India’s Atmanirbhar Leap Under PM Modi