మన్నథు పద్మనాభన్ జయంతి ఈ రోజు. సామాజిక సేవ కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆ మహనీయుడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్మరించుకొంటూ, ఆయనకు నివాళులు అర్పించారు.

మన్నథు పద్మనాభన్ ఒక దార్శనికుడు. ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక సంస్కరణలోనే సిసలైన ప్రగతి వేళ్లూనుకొని ఉందని ఆయన నమ్మారని ప్రధానమంత్రి అన్నారు. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత వంటి రంగాలలో పద్మనాభన్‌వి మార్గదర్శక ప్రయత్నాలని ప్రధానమంత్రి ప్రస్తావించారు. పద్మనాభన్ కృషి దేశ ప్రజలకు గొప్ప స్ఫూర్తిని అందిస్తోందని కూడా ఆయన అన్నారు.

న్యాయపూర్ణ, కరుణామయ, సద్భావనపూర్వక సమాజాన్ని ఆవిష్కరించే దిశగా పయనించడంలో మనకు మన్నథు పద్మనాభన్ ఆదర్శాలు దారి చూపుతాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలు పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
 

‘‘మన్నథు పద్మనాభన్ జయంతి సందర్భంగా... మనం ఒక మహనీయుడిని ఎంతో ఆరాధనభావంతో స్మరించుకొంటున్నాం. ఆయన తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. ఆయన ఓ దార్శనికుడు.. నిజమైన ప్రగతి ఆత్మగౌరవంలో, సమానత్వంలో, సామాజిక సంస్కరణలో వేళ్లూనుకొని ఉందని ఆయన నమ్మారు. ఆరోగ్యం, విద్య, మహిళలకు సాధికారత కల్పన వంటి రంగాల్లో పద్మనాభన్ కృషి ఎంతో స్ఫూర్తిని అందిస్తోంది. ఆయన ఆదర్శాలు న్యాయపూర్ణ, కరుణామయ, సద్భావనపూర్వక సమాజాన్ని ఆవిష్కరించే దిశగా పయనించడంలో మనకు దారిని చూపుతూనే ఉంటాయి.’’

 

“മന്നത്ത് പത്മനാഭന്റെ ജന്മവാർഷിക ദിനത്തിൽ, സാമൂഹ്യ സേവനത്തിനായി ജീവിതം സമർപ്പിച്ച ഒരു മഹദ് വ്യക്തിത്വത്തെ അങ്ങേയറ്റം ആദരവോടെ നാം സ്മരിക്കുകയാണ്. ആത്മാഭിമാനം, സമത്വം, സാമൂഹിക പരിഷ്കരണം എന്നിവയിൽ വേരൂന്നിയതാണ് യഥാർത്ഥ പുരോഗതി എന്ന് വിശ്വസിച്ച ക്രാന്തദർശിയായിരുന്നു അദ്ദേഹം. ആരോഗ്യം, വിദ്യാഭ്യാസം, സ്ത്രീ ശാക്തീകരണം തുടങ്ങിയ മേഖലകളിലെ അദ്ദേഹത്തിന്റെ അതുല്യമായ സംഭാവനകൾ പ്രചോദനാത്മകമാണ്. നീതിയും അനുകമ്പയും ഐക്യവും നിറഞ്ഞ ഒരു സമൂഹത്തിന്റെ സൃഷ്ടിക്കായുള്ള പ്രയാണത്തിൽ അദ്ദേഹത്തിന്റെ ദർശനങ്ങൾ നമ്മെ എക്കാലവും നയിക്കുന്നു.”

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indonesia To Dubai, IITs And IIMs Are Going Global: The Strategy Behind India's Overseas Campuses

Media Coverage

Indonesia To Dubai, IITs And IIMs Are Going Global: The Strategy Behind India's Overseas Campuses
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 జూలై 2026
July 09, 2026

PM Modi Leading India's Economic, Cultural & Diplomatic Renaissance