మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ప్రధానమంత్రి ఈ రోజు నివాళులు అర్పించారు.

న్యాయం, సమానత్వం, రాజ్యాంగ వ్యవస్థ పట్ల డాక్టర్ అంబేద్కర్‌కు ఉన్న అంకితభావం.. దేశానికి ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. వ్యక్తి గౌరవాన్ని కాపాడటంలో, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో డాక్టర్ అంబేద్కర్ కనబరిచిన నిబద్దత నుంచి తరతరాలు స్ఫూర్తి పొందుతాయని ఆయన అన్నారు.

వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం ప్రయాణిస్తున్న మార్గంలో అంబేద్కర్ ఆదర్శాలు వెలుగులు నింపుతాయనే విశ్వాసాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని పోస్టు:

‘‘మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను స్మరించుకుంటున్నాను. ఆయన దార్శనిక నాయకత్వం, న్యాయం, సమానత్వం, రాజ్యాంగ వ్యవస్థ పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం దేశ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తాయి. వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడానికి, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి తరతరాలకు ఆయన స్ఫూర్తినందిస్తారు. వికసిత్ భారత్‌ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం ప్రయాణిస్తున్న మార్గంలో ఆయన ఆదర్శాలు వెలుగులు నింపుతాయి’’

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi makes India stand tall

Media Coverage

PM Modi makes India stand tall
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 1 ఫెబ్రవరి 2026
February 01, 2026

Budget 2026-27: Building a Self-Reliant, Innovative India Under PM Modi’s Leadership